No products in the cart.
ఫిబ్రవరి 04 – సేవించెదము!
“నేనును నా ఇంటివారును యెహోవానే సేవించెదము” (యెహోషువ. 24:15).
“యెహోవానే సేవించెదము” అని యెహోషువా దట్టముగాను స్పష్టముగాను సెలవిచ్చుచున్నాడు. యెహోవాను అని సెలవియ్యక యెహోవానే అని సెలవిచ్చుటను చూడుడి. ఇది వేరు ఎవ్వరిని మేము సేవింపము అను తీర్మానమును తెలియజేయుచున్నది. యేసు సెలవిచ్చెను, “ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకనిని ద్వేషించి, యొకనిని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి, యొకనిని తృణీకరించును” (మత్తయి. 6:24).
ఈ లోకమునందు ఇద్దరు యజమానులు కలరు. ఒకరు యేసుక్రీస్తు, మరొకరు అపవాధి యైయున్న సాతాను. వీరిద్దరినీ ఒకే సమయము నందు మీవల్ల సంతోషపరచ లేరు. యేసుని ప్రేమించి సాతానును ద్వేషింపవలెను. మొదటిగా, మీరు యేసుక్రీస్తు నందు ప్రేమను ఉంచినట్లయితే ఆయననే సేవించుడి.
రెండోవది ప్రభువును మీరు సేవించుచున్నప్పుడు పూర్ణహృదయముతోను, పూర్ణ ప్రాణముతోను, పూర్ణబలముతోను సేవింపవలెను. పూర్ణ హృదయముతోను, పూర్ణప్రాణముతోను అనుట నూటికి నూరు సేవించుట అనుట దాని అర్థము. పాఠశాలయందు చదువుతున్న విద్యార్థులు నూటికి నూరు మదింపులను తీసి ప్రధమ స్థానమునకు రావలెను అనుటయే గురిగా కలిగియుండునట్లు, ప్రభువునే సేవించుటయందు మీరు నూటికి నూరు మదింపులను తీయవలెను. “మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము” (1.సమూ. 12:24).
మూడోవది, మీరు భయమును కలిగి ప్రభువును సేవింపవలెను. “భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి” (కీర్తన. 2:11) అని కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు. ఇట్టి భయము అనుట ఏదో వ్యాధుల పాలు చేయును, నరకాగ్ని లోనికి త్రోసి వేయును, దండించును అనేటువంటి మొదలగు భయము కాక. ఇది ఘనతను చేకూర్చె భయము. ప్రభువును ప్రేమించుట వలన వచ్చుచున్న దైవ భయము. చెడుతనమును అసహ్యించు కొనుటయె హోవాయందు కలిగియుండు భయము (సామెత. 8:13).
నాల్గోవది, మీరు యదార్థమైన హృదయముతోను, ఉత్సాహ మనస్సుతోను ప్రభువును సేవింపవలెను. అలాగుననే దావీదు తన కుమారుడైన సొలొమోనునకు బుద్ధి నేర్పించెను (1.దినవృ. 28:9). మనుష్యుల కొరకు పరిచర్య చేయక, ప్రభువు కొరకు మనఃపూర్వకముగా పరిచర్యను చెయ్యవలెను. యధార్థ హృదయముతోను, ఉత్సాహ మనస్సుతోను, ఆయన పరిచర్యనందు ఉండవలెను.
ఐదోవది, సంతోషముతో ప్రభువును సేవించుడి. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. ” సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి” (కీర్తన. 100:2). ఆయన యొక్క సన్నిధియే మీకు ఆనందము. ఆయనయొక్క సముఖమే మహఆనందము. ప్రభువును సేవించుట మీయొక్క మనస్సునందు ఆదరణను ఇచ్చును. దేవుని బిడ్డలారా, మీరు జీవించు దినములన్నిటను ప్రభువునే సేవింపవలెను. ఆయనను సేవించుటయు, ఆయనకు పరిచర్య చేయుటయే మీకు ఇవ్వబడియున్న ధన్యతలైయున్నవి.
నేటి ధ్యానమునకై: “యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు, పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో” (అ.పో.20:19).