No products in the cart.
జనవరి 10 – క్రొత్త ఫలములు!
“పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది; మన ద్వారబంధములమీద వ్రేలాడుచున్న నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు ఉన్నాయి; నా ప్రియుడా! నేను నీకొరకు దాచియుంచియున్నాను” (ప.గీ.7:13).
మన దేవుడు సమస్తమును నూతన పరచువాడు. ఫలము లేని జీవితమును జీవించుచున్న వారినికూడ ఫలముగల జీవితమును జీవించునట్లు మార్చి నూతన పరచుచున్నాడు. చేదైన ఫలమును ఇచ్చిన వారినికూడ మధురమైన ఫలముగల ఫలమును ఇచ్చునట్లుగా మార్చుచున్నాడు.
మీరు మీ తోటలో క్రొత్త ఫలమును ఇచ్చు వృక్షములను నాటుచున్నారని అనుకొనుడి. మీరు గుణపముతో ఆ నేలను త్రవ్వి, చెట్లను నాటి, వాటికి యెరువునువేసి, నీరునుపోసి పరామర్శించెదరు. కొన్ని సంవత్సరములయందు ఆ చెట్లు వృక్షములుగా ఎదిగి ఫలమును ఇచ్చుటకు మొదలుపెట్టు చున్నది. తొలిసారిగా మీ వృక్షములు యందు పండ్లను చూచినప్పుడు మీయొక్క ఆనందమునకు అవధులు ఉండదు. మిగితా ఫలములను తినుట కంటే మీ వృక్షము యొక్క ఫలమును తినుటయందు అత్యధిక సంతోషము కలుగును.
అదే విధముగా ప్రభువు మీయందు ఫలమును ఎదురు చూచుచున్నాడు. తోటలోని వృక్షములయందుగల అంజూరపు చెట్టు ఫలమును ఇవ్వక పోయినప్పుడు యజమానుడు దానిని నరికివేయుమని చెప్పెను. న్యాయ తీర్పు అను గొడ్డలి చెట్టు యొక్క వేరున ఉంచబడియున్నది. అయినను ఆ తోటమాలి యజమానితో విజ్ఞాపన చేసినందున ఇంకా ఒక సంవత్సరపు కాలము ఆ చెట్టును ఉండనిచ్చునట్లు యజమానుడు అనుమతిచ్చెను. తోటలో ఉన్నప్పటికీని తోటమాలి దాని నిమిత్తము బతిమిలాడి నందున ఆ చెట్టు తప్పించబడెను.
అయితే త్రోవపక్కన నాటబడియున్న అంజూరపు చెట్టునకైతే బతిమిలాడువారు ఎవరును లేరు, తోటమాలి దానికి అక్కడ లేడు. ‘ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువు’ అని ప్రభువు చెప్పినప్పుడు, ఆ చెట్టు ఎండిపోయెను. మీరు నీటికాలువల యోరను నాటబడి, ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉండవలెను (కీర్తన.1:3).
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును; వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు; ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును; వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును” (యెహేజ్కేలు.47:12).
“అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము; ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు” (గలతి.5 : 22,23) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. దేవుని బిడ్డలారా, ఆత్మ యొక్క ఫలములు మీయందు కనబడవలెను అనుటయే ప్రభువు యొక్క ఆకాంక్షయైయున్నది.
నేటి ధ్యానమునకై: “కాబట్టి, ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము” (హెబ్రీ.13:15).