Appam - Telugu, AppamAppam - Telugu

డిసెంబర్ 19 – ప్రభువుని హస్తము !

“నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి….”(1.దిన.4:10).

“ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండవలెను”  అనుట యబ్బేజ యొక్క  ప్రార్థనలోని ఒక భాగమైయున్నది. ఆ ప్రార్ధన ఎంతటి మధురమైనదియు చక్కనిదియు ఉండుటను కాస్త ఆలోచించి చూడుడి.

“యబ్బేజ”  వేదనను పుట్టించువాడు అని అర్థము. అవును అతడు ధుఖఃముతో నిండినవాడై యుండెను. అతడు జన్మించినప్పుడు అతని తల్లి అతనిని వేదనపడి కనెను. ఒకవేల ఆ సమయమునందు ఆమె యొక్క భర్త మరణించి ఉండవచ్చును. వృత్తి నష్టాలుపాలై ఉండవచ్చును. పేదరికమును వ్యాధియు పట్టి పీడిస్తూ ఉండవచ్చును.  అయితే అతడు ఆ దుఃఖముతోకూడ జీవించి, కన్నీటిని తుడిచేటువంటి ప్రభువు యొక్క హస్తమును తేరి చూచెను.

ఎజ్రా యొక్క గ్రంథమును చదివి చూడుడి. అక్కడ మరల మరల ‘ ప్రభువు యొక్క హస్తము నాపై మేలుకరముగా ఉన్నది’  అని ఆ భక్తుడు వ్రాయుచున్నదానిని చూడగలము. అతడు వ్రాయుచున్నాడు:. “​నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి”(ఎజ్రా.7:28). దావీదు సెలవిచ్చుచున్నాడు,. “నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, నీ కుడిచేయి నన్ను పట్టుకొనును”(కీర్తన.139:9,10).

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క హస్తము ఎల్లప్పుడు మీపై  నిలిచి ఉండుటకు మిమ్ములను మీరు సమర్పించుకుందురా?  ప్రభువు యొక్క హస్తము  రక్షించు హస్తము (కీర్తన.144:7). ప్రభువు యొక్క హస్తము పరాక్రమములను చేయు హస్తము (కీర్తన.89:13). ప్రభువు యొక్క హస్తము  మీకు సహాయము చేయు హస్తము(కీర్తన.119:173).

ఒక బలమైన దేవుని సేవకుడు ఉండెను. అకస్మాత్తుగా ఆయనకు ఎదురుచూడని రీతిలో వ్యాధియు పోరాటము వచ్చెను. మరణపు అంధకారము ఆయనను ఆవరించెను. మరణముతో పోరాడుచున్న ఆ రాత్రియందు ఆకస్మాత్తుగా ఒక దర్శనమును చూచెను. ఒక భయంకరమైన లోయను ఆయన దాటవలసినదై యుండెను. ఆ లోయలో భయంకరమైన దురాత్మలు కేకలుపెట్టుచు ఉండెను. ఆయన సమీపమునకు రాగానే ‘రమ్ము, రమ్ము లోపలికి రమ్ము. నీవు మా యొద్దకు చేరవలసిన అనేకులను పరలోకమునకు తీసుకుని వెళ్ళిపోయావు. నీమీద కక్ష తీర్చుకొనక విడిచిపెట్టును అని కేకలు పెట్టెను.

ఆ లోయను అందులోని నల్లటి రూపముగల భయంకరమైన అట్టి అపవిత్ర ఆత్మలను చూచినప్పుడు, ఆ భక్తుని యొక్క అంతరంగము తడబడెను. అదే సమయమునందు ఒక గొప్ప ప్రకాశముగల శిలలతో కొట్టబడిన  హస్తము ఆ చీకటి లోయయొక్క చీకటి ప్రాంతములోనికి బలముగా దిగి వచ్చెను.  ఆ  హస్తముపై ఆ భక్తుడు ఎక్కి నడచి లోయను దాటెను. అంతమునందు ప్రభువు ఆయనతోకూడ మాట్లాడి ‘నా హస్తము నీతోకూడ ఎల్లప్పుడు ఉండును. నీవు ముందుకు కొనసాగాము.  వెనుకకు తిరిగి చూడకము’ అని చెప్పెను. మరుక్షణమున ఆ దర్శము మరుగైపోయెను. ఆ భక్తుడు పరిపూర్ణమైన స్వస్థతను పొందుకొనెను. దేవుని బిడ్డలారా, మీరు ప్రభువు యొక్క హస్తమునందు ఉండుటను గ్రహించుడి! స్తోత్రించుడి!

నేటి ధ్యానమునకై: “పైనుండి నీ చెయ్యి చాచి, నన్ను తప్పింపుము మహా జలములలోనుండి”(కీర్తన.144:7).

ఈ రోజు బైబిల్ రీడింగ్

Leave A Comment

Your Comment
All comments are held for moderation.