No products in the cart.
అక్టోబర్ 03 – ఆహారమును, నీళ్ళును!
“ఆయన నీ ఆహారమును, నీ పానమును, దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను”(నిర్గమ.23:25)
ప్రభువు మీతో చేసియున్న ఆశీర్వాదపు వాగ్దానములు ఎంతటి మనోహరములు! ఆయన మీయొక్క ఆశీర్వాదపు ఊటగా ఉన్నాడు. తనయొక్క జనమును ఆశీర్వదించుటయందు ఆయన అక్కర కలిగినవాడును, వాంఛ గలవాడును, ఆసక్తిగల వాడునైయున్నాడు.
ప్రభుపు ఇశ్రాయేలు జనులను అరణ్యమనందు మార్గము నడిపించుకొనుచు వచ్చుచున్నప్పుడు, వారికి ఆహారముగా ఆకాశమునుండి మన్నాను కురిపించునట్లు చేసెను. ప్రతి ఒక్కరికి కావలసిన మన్నాగా అది ఉండెను. ఆహారమును ఆయన ఆశీర్వదించినందున్న ఇజ్రాయేలు జనులయందు బలహీనతలు ఏమీయు ఉండలేదు.
ఏలియా కెరీతువాగునొద్ధ దాగియుండినప్పుడు, అతనికి ఆహారము దొరుకునట్లు ప్రభువు కాకోలములకు ఆజ్ఞాపించెను. కాకిఅనేది ప్రతిదినమును అతనికి ఆహారమును తీసుకొచ్చెను. అతడు వాగు నీటిని త్రాగెను. ఆవాగు ఎండిపోయినప్పుడు అతనికి ఆహారమును నీళ్లను ఇచ్చునట్లు ప్రభువు సారెపతు విధవరాళ్లను లేవనెత్తెను. ఆ దేవుడు మీ మీదకూడ అత్యధిక అక్కరను కలిగినవాడైయున్నాడు అనుటను మర్చిపోకుడి. “కాబట్టి, ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి”(మత్తయి.6:31).
ఏసు భూమిమీద ఉన్న దినములయందు, ఆయన ఒకసారి రొట్టెను తీసుకొని ఆశీర్వదించెను. ఆశీర్వదించబడిన ఆ రొట్టె ఐదువేలమందిని పోషించుటకు చాలినదైయుండెను. ఆయనే మీయొక్క ఆశీర్వాదపు రొట్టెయైయున్నాడు. ఆహారము అను మాటకు కొత్త నిబంధనయందు లోతైన గొప్ప అర్థమున్నది. యేసు తన్ను గూర్చి జీవాహారము నేనే అని చెప్పెను (యోహాను.6: 35).
ప్రభువు మీయొక్క ఆహారమును ఆశీర్వదించుచుట మాత్రము కాదు, నీళ్లనుకూడ ఆశీర్వదించును. పాత నిబంధనయందు ఇశ్రాయేలు ప్రజలు యొక్క నీళ్లను ఆయన ఆశీర్వదించెను. ఇజ్రాయేలు జనుల దినములయందు ఉన్న నీళ్లైయితే మిగుల పరిశుభ్రముగా ఉండెను. ఇజ్రాయేలు జనులు మారాకు వచ్చినప్పుడు ఆ మారాయొక్క చేదుకలిగిన నీళ్లను ప్రభువు మధురముగా మార్చి ఇచ్చెను. బండయొక్క నీళ్ళ వలన వారియొక్క దాహమును తీర్చెను. ఎరికోపట్నము యొక్క నీళ్లు చెడిపోయినదై ఉన్నప్పుడు, ఎలీషా ద్వారా ప్రభువు అద్భుతములను చేసెను. ఆ నీళ్లను ఆరోగ్యముగలదానిగా మార్చెను.
ప్రభువు ఇచ్చు నీళ్లు ఎంతటి ఔనత్యముగలదై యుండుటను చూడుడి. బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును”(యోహాను.4:14). ప్రభువు ఆహారమును నీళ్లను ఆశీర్వదించువాడు. ప్రార్ధించుడి, మీ గృహములయందుగల ఆహారమును, నీళ్లను ప్రభువలన ఆశీర్వదింపబడినదై ఉండవలెను.
నేటి ధ్యానమునకై: “యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును. భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు”(కీర్తన.115:14,15).