No products in the cart.
సెప్టెంబర్ 26 –! “చేర్చుచున్న ప్రభువు!”
“మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో(సంఘమునందు) చేర్చుచుండెను”(ఆ.పో.2:47)
మన ప్రభువు చేర్చుచున్న ప్రభువు. ఆయన పడగొట్టువాడని, చెదరగొట్టువాడని అనేకులు ప్రభువును గూర్చి అపార్థముగా తలంచుచున్నారు. అయితే ప్రభువు, తన యొక్క జనులను ప్రేమించి, చేర్ఛున్నవాడై యున్నాడు. “నా యొద్దకు వచ్చుచున్న వారిని నేను ఎంత మాత్రమును అవతలకి నెట్టివేయను” అనుట ఆయన యొక్క మాటయే కదా?
పలు సందర్భములయందు మీరు చేయి విడువబడిన వారివలె కనబడినను. అప్పుడు, ప్రభువు నన్ను మరిచిపోయెను, తృణీకరించి వేసెను అని అంతయు తలంచ వచ్చును. అయితే రెప్పపాటులో అయిన చేయి విడిచినను, గొప్ప కనికరముతో చేర్చుకొనువాడై యున్నాడు. మీరు ఆయనను ఎరుగనివారై ఉండినప్పుడుకూడ, ఆయన మిమ్ములను ప్రేమతో వెదకివచ్చెను. ఆయన యొక్క వారసులైయుండునట్లు మిమ్ములను చేర్చుకొనెను.
ఒక స్త్రీని గూర్చి ఎరుగుదును. ఆమె తన భర్తకు చేసిన ద్రోహమును బట్టి ఇంటనుండి వెళ్ళగొట్టబడెను. అవమానమును, నిందయు పొందెను. సమస్తమును కోల్పొయిన దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చును. ఒక దినము ఆమె సువార్తను వినే అవకాశము లభించెను. ఎట్టి పరిస్థితిలోనైనను నన్ను ద్వేషింపనివాడును, త్రోసివేయనివాడును, చేర్చుకొనుటకు ఆశతో ఉన్నవాడునైయున్న యేసుక్రీస్తుని ప్రేమ ఆమె అంతరంగమును తాకెను. యేసునకు తన జీవితమును సంపూర్ణముగా సమర్పించుకునెను. తరువాత ప్రార్థనతో భర్తకు క్షమార్పణ కోరి ఉత్తరము వ్రాసెను. ఎంతటి ఆశ్చర్యము! ప్రభువు ఆ కుటుంబమును ఒకటిగా చేర్చెను. ప్రభువు సమకూర్చువాడు.
బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి”(యాకోబు.4:8). “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా”(హెబ్రీ.11:6). “చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు”(కీర్తన.147:2).
ఈ ప్రపంచమునందు వెళ్ళగొట్టబడిన జనులు అనేకమంది కలరు. పిల్లలచే వెళ్లగొట్టబడినవారు, బంధువులచే వెళ్ళగొట్టబడినవారు, సమాజముచే నిరాకరించబడి వెళ్లగొట్టబడినవారు అని అనేకులు కలరు, ప్రభువు వారినందరినీ చేర్చుకొనుటకు ఆసక్తితో ఉన్నాడు.
ఆనాడు ఇశ్రాయేలీయులు తమ దేశమునుండి వెళ్లగొట్టబడిరి. అయితే ప్రభువు, వారిని మరలా సమకూర్చియున్నాడు, సమకూర్చుచూనే ఉన్నాడు. వారు కాళ్లను మోపి తమ దేశమునందు నిలువబడియున్నారు. దేవుని బిడ్డలారా, ఆత్మసంబంధమైన ఇశ్రాయేలీయులైన మిమ్ములనుకూడా, చేర్చుకొనుటకు ప్రభువు ఆసక్తితో ఉన్నాడు.
నేటి ధ్యానమునకై: “ఆ జనముకొరకు మాత్రమేగాక, చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను”(యోహాను. 11:52).