No products in the cart.
సెప్టెంబర్ 18 – ఏమి చెల్లించెదను!
“యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి, నేనాయనకేమి చెల్లించుదును?”(కీర్తన. 116:12)
కృతజ్ఞతగల అంతరంగము ప్రభువును ఆనందింపచేయును. ప్రభువు చేసిన సమస్త మేలులను తలంచి హృదయాంతరంగము నుండి ఆయనను స్తోత్రించునప్పుడు, ప్రభువు ఇంకను అనేక ఆశీర్వాదములను మీపై కుమ్మరించును.
జీవితమునందు అట్టడుగు దిగువ స్థితినుండి, మిక్కిలి ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడినవాని చరిత్రయే దావీదు చరిత్ర. గొర్రెలను కాస్తున్న ఆయనను ఇశ్రాయేలీయులయందు బహు గొప్ప రాజుగా ప్రభువు హెచ్చించెను. కష్టతరములైన పరిస్థితులన్నిటను ప్రభువు దావీదునకు తోడైయుండెను. దావీదునకు సహాయము చేసెను. గొప్పచేసెను.
దావీదు అట్టి ఉపకారములన్నిటిని కృతజ్ఞతతో జ్ఞాపకము చేసుకొనెను. ఇశ్రాయేలు ప్రజలవద్ద, “మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను స్తుతించుడి; ఆయన కృప నిరంతరముండును”(కీర్తన.136:23) అని ప్రకటించుటను చూడుడి! అంతమాత్రమే కాదు, కృతజ్ఞతాపూర్వకముగా ఆయన ప్రభువు వద్ద మూడు అంశములను నెరవేర్చుటకు తీర్మానించెను.
- ప్రార్ధన చేసెదను:- “రక్షణపాత్రను చేత పుచ్చుకొని, యెహోవా నామమున ప్రార్థన చేసెదను”(కీర్తన.116:13). ప్రార్ధన చేసెదను అను పదమునకు వంగి నమస్కరించెదను, ప్రార్ధించి ఆయనను నమస్కరించెదను, ప్రభువును కీర్తించి హెచ్చించెదను, ఆయనకు ఘనతను ప్రభావమును చెల్లించెదను అనేటువంటి అర్థములైయున్నవి. ప్రభువు గొప్పవాడును, సమస్తమునకు పూజాహనియ్యుడై యున్నాడు. మనము ఆయనను సేవించిటను ఆయన కోరుకొనుచున్నాడు, కాంక్షించుచున్నాడు.
- కృతజ్ఞతార్పణ నర్పించెదను:- “నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను”(కీర్తన.116:17). ఆశీర్వాదకరమైన ఒక అర్పణను దావీదు కనుగొనెను. అదియే కృతజ్ఞతార్పణ, జిహ్వఫలమునైయున్న కృతజ్ఞతార్పణ, ప్రభువు అట్టి బలులపైనే ఆశను కలిగియున్నాడు.
- మ్రొక్కుబళ్ళు చెల్లించెదను:- “యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను, ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను”(కీర్తన.116:14). తనను హెచ్చించిన ప్రభువును వట్టి నోటి మాటలతో మాత్రము కీర్తిస్తూ ఉండక, మ్రొక్కుబళ్ళు చెల్లించి క్రియలద్వారా ఘణపరచుటకు దావీదు తీర్మానించెను.
బైబిలు గ్రంథము చెప్పుచున్నది: “నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును”(సామెత.3:9,10). దేవుని బిడ్డలారా, ప్రభువు చేసిన ఉపకారములను మీరు మరువక కృతజ్ఞతతో, స్తోత్రమును చెల్లించినట్లయితే, ప్రభువు మిమ్ములను అత్యధికముగా ఆశీర్వదించును.
నేటి ధ్యానమునకై: “మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు'(2 కొరింథీ.9:8).