No products in the cart.
ఆగస్టు 28 – వచ్చిన మార్గములో!
“నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్ల నన్ను పంపియున్నాడు”(అ. పొ.9:17)
‘నీవు వచ్చిన మార్గములో…’అని చెప్పి అపోస్తులుడైన పౌలునకు అననీయ ప్రాముఖ్యమైన ఒక అంశమును జ్ఞాపకము చేయుచున్నాడు. పౌలు సంఘమును హింసించువాడై వచ్చుచున్న మార్గములో ప్రభువు అడ్డగించెను. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి ఒక వెలుగు పౌలు చుట్టూ ప్రకాశించెను. అదియే ప్రభువు సౌలును పౌలుగా చేసిన సందర్భమైయున్నది.
మీరు ఏ మార్గమునందు వెళ్ళుచున్నారు? ప్రభువు యొక్క బిడ్డలకు విరోధమైన మార్గమునందు వెళ్లి ప్రభువును దుఃఖపరచుచున్నారా? శాపముయొక్క మార్గమునందు నడచుచున్నారా? మీయొక్క మార్గమునందు ప్రభువు అడ్డుపడి, మిమ్ములను తిన్నగా నడిపించుటకు కోరుచున్నాడు.
దుబాయికి వెళ్లుటకై ప్రణాళికను కలిగియున్న ఒక సహోదరుడు, అలా వెళ్ళనైయున్న కొన్ని దినములకు ముందుగా చెన్నై పట్టణమునందుగల తన స్నేహితుని యొక్క ఇంటికి వచ్చెను. అప్పుడు చెన్నై సముద్ర తీరమునందు కూర్చుండి రాత్రియందు ప్రార్ధించుటకై ఆయన స్నేహితులు బయలుదేరిరి. ఈ సహోదరుడుకూడ వారితోపాటు కలసి ప్రార్ధించుటకు వెళ్లెను. వారు వృత్తాకారమునందు కూర్చుండి ప్రార్థించుచు ఉన్నప్పుడు, ప్రభువు యొక్క ఆత్మడు బలముగా వారిపై దిగివచ్చెను.
దుబాయికి వెళ్లనైయున్న సహోదరుని ప్రభువు ఆత్మతోను, అగ్నితోను కొలతలేనంతగా నింపెను. పలు గంటల సమయము ఆ అభిషేకము ఆయనయందు పొంగిపారుతు ఉండెను. చివరిగా జరిగినది ఏమిటో తెలుసా? దుబాయికి వెళ్లి ధనమును సంపాదించాలని ఆశించిన ఆయన, ఆ మార్గమును మార్చుకొని, ప్రభువు యొక్క సంపూర్ణ సేవకుడిగా, ఆత్మలను సంపాదించుటకు తన్ను సమర్పించుకొనెను.
మీయొక్క మార్గములను ప్రభువునకు సమర్పించుకుని ఆయనను మాత్రము అనుకొనుడి. అప్పుడు మీయొక్క మార్గమంతయును నేతిలో అడుగు పెట్టినట్లు ఆయన మీకు సహాయము చేయును. అంత మాత్రమే కాదు, మీరు నడచుచున్న మార్గమంతయు ప్రభువు మీతోకూడ నడిచి వచ్చును. ఇక మీరు ఒంటరిగా నడవరు.
మోషే ఇశ్రాయేలు ప్రజలను చూచి ప్రేమతో చెప్పెను. “మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను, మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు, మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురు, మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా” (ద్వితీ. 1:31-33).
దేవుని బిడ్డలారా, పలు ఓటమిమీల వలన మనస్సు విసిగి వేసారిపోయి, ప్రభువు యొక్క పాదాలను విడిచి తొలగిపోయి ఉండవచ్చును? నాకంటు శుభ దినములు గలవ అని కలవరపడుతున్నారు? విశ్వాసముతో ప్రభువు యొక్క మార్గములోనికి మరలా తిరిగి రండి. ఆయన పరిశుద్ధ మార్గమునందు మిమ్ములను నడిపించును.
నేటి ధ్యానమునకై: “యెహోవా మీ ముందర నడచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును”(యెషయా.52:12).