AppamAppam - Telugu

జూలై 10 – మేలులు కొదువైయుండదు!

“సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయైయుండదు”(కీర్తనల.34:10)

మేలు చేయుచున్న యేసు తోడైయున్నప్పుడు దేవుని యొక్క పిల్లలకు ఏ ఒక్క మేలుకూడా కొదువ కాకూడదు. “ఏ మేలు కొదువయైయుండదు” అని చెప్పుచున్న కీర్తనకారుడు దాని మీకు వివరించి తెలియజేయుటకై సింహమును దాని పిల్లలను కనబరచుచున్నాడు. సింహపు పిల్లలకు అవసరమైన ఒకే మేలు ఆహారము మాత్రమే. తల్లి సింహమును, తండ్రి సింహమును ఆహారమును తెచ్చి పెట్టగా వాటిని తిని ‘బలియుచు లావుగా ‘ అవి పెరుగుతాయి.

సింహము అడవి అంతటికీ రాజు. అది ఎన్నడును వెనుకంజవేయదు. దానిని ఎదిరించి ఏ జంతువును పోరాడి జయించ జాలదు. అది బహు వేగముగలది, బలమైనది, సునాయాసముగా జయించదగినది. కొన్ని సందర్భాలలో అట్టి సింహములే తమ పిల్లలకు ఆహారమును తెచ్చి పెట్టలేక పరితపించును. అట్టి సందర్భాలన్నిటా సింహపు పిల్లలు ఆకలిగొనుచు పస్థులుపడియుండును.

అయితే మనయొక్క ప్రభువైన యేసుక్రీస్తును చూడుడి! ఈయన కూడా ఒక  “సింహము”. యూదా గోత్రపు  రాజసింహము. ఆయన తనయొక్క పిల్లలకు సమస్త మేలులను చేయుచున్నాడు. ఆయనను వెదకు వారికి ఏ మేలును కొదువైయుండదు.

నాయొక్క తండ్రిగారు చెన్నై పట్టణమందు ఇంచుమించు ఒక సంవత్సరపు కాలము ఉద్యోగము లేక తపించెను. చెన్నై పట్టణపు పెద్ద పెద్ద వీధులగుండా నడిచి, “ప్రభువా ఈ పట్టణమునందు ఎంతోమంది అన్యులు మంచి ఉద్యోగమునందు ఉన్నారు. నిన్ను ఎరుగని వారుకూడా ఉన్నత స్థితియందు ఉన్నారు. ఎందుకని నీవు నాకు ఒక మంచి ఉద్యోగమును ఇయ్యకూడదు? ఎందుకని నన్ను హెచ్చించకూడదు?” అని కన్నీళ్ళతో ప్రార్థించెను. అప్పుడు ప్రభువు ఈ వచనమును (కీర్తన 34 :10) ఆయనకు జ్ఞాపకముచేసెను.

ఎవరికీ ఏ మేలును కొదువైయుండదు? ఆయనను వెతుకుచున్నవారికే, ఏ మేలును కొదువైయుండదు అని వ్రాయబడియున్నది. కావున ఆయన ప్రభువును ఉపవాసముతోను,  ప్రార్ధనతోను వెతుకుటకు ప్రారంభించెను. ప్రభువు వారి ప్రార్థనను ఆలకించి మంచి ఉద్యోగమును దయచేసెను. వారు ఎదురుచూచిన దానికంటే వారిని హెచ్చించి ఆశీర్వదించెను.

ప్రభువును వెతుకుటకు మీ హృదయములను త్రిప్పెదరా? మొదటిగా, ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వేదికెదరా? ఆయన యొక్క బంగారపు ముఖమును చూడవలెను. ఆయన యొక్క మృదువైన స్వరమును ఆలకించవలెను, అను కాంక్షను కలిగియుండేదరా? మీ కొరకై ప్రభువు ఒక వాక్కునిచ్చుచున్నాడు, “రెండంతలుగా మీకు మేలు చేసేదని  నేడు  నేను  మీకు తెలియజేయుచున్నాను”(జకర్యా.9:12).

మన యొక్క దేవుడు మేలులను చేయు దేవుడు. ప్రభువు దయచేయు మేలులు అని చెప్పుచున్నప్పుడు కేవలము లోకప్రకారమైన ఆశీర్వాదము మాత్రమే అని తలంచకూడదు. ప్రభువు దయచేయుచున్న శ్రేష్టమైన మేలులలో ఒకటి రక్షణ. అదే విధముగా పరిశుద్ధాత్ముడు అనేటువంటి మేలులను ప్రభువు మీకు దయచేయును.

 

నేటి ధ్యానమునకై: “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును”(మత్తయి. 7:11).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.