No products in the cart.
మే 06 – పాతాళమును జయించిరి!”
“ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు” (కీర్తనలు. 16:10).
ఆదాము యొక్క పాపము నిమిత్తము, పాత నిబంధన పరిశుద్ధులు, పాతాళములో సాతాను చేత చరలో ఉంచబడిరి. యాకోబు దుఃఖముతో: “నెరసిన వెండ్రుకలు గల నన్ను (మృతులలోకము) పాతాళములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను” (ఆది.కా. 42:38). “పాతాళపు పాశములు నన్ను … ఆవరింపగను” (కీర్తనలు. 18:5) అని చెప్పెను దావీదు. “పాతాళము నాకు ఇల్లు అను ఆశయే” (యోబు. 17:13) అని చెప్పెను యోబు భక్తుడు.
అయితే యేసు క్రీస్తు కల్వరి మరణము చేత, సాతానును మాత్రము కాదు, మరణమును పాతాళమును జయించెను. పాతాళపు తాళపు చెవులను సాతాను యొక్క చేతిలో నుండి లాగుకొని, పాతాళములోనికి ప్రవేశించి, సాతానుచేత చేరపట్టబడిన పాత నిబంధన యొక్క పరిశుద్ధులందరిని చెరలోనుండి విమోచించెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను” (1. పేతురు. 3: 18,19,20).
పాతాళమునకు వెళ్లి కూడాను, ప్రభువైన యేసు వలన ప్రసంగించగలిగిను. పాతాళము యొక్క శక్తి ఆయనను జయించలేక పోయెను. పాతాళమునందు గల పాత నిబంధన పరిశుద్ధులను విమోచించునట్లుగా, తన యొక్క రక్తమను యేసు చెల్లించెను. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై, ఆయన మరణము పొందెను అని హెబ్రీ. 9:15 నందు చదువుచున్నాము.
పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పాపములు కప్పబడనే గాని, సంపూర్తిగా కడిగి శుద్ధీకించబడలేదు. (కీర్తనలు. 32:1). వారు పరిపూర్ణముగా శుద్ధీకరించబడుటకు యేసుక్రీస్తు యొక్క కల్వరి మరణము వరకును కనిపెట్టవలసినదై యుండెను.
పాతాళమునందు అబ్రహము యొక్క ఒడిలో లాజరు విశ్రమించెను. అయినను సిలువ యొక్క మరణము తరువాత, అంతమందిని, యేసు ఆరోహణమైనప్పుడు, చెరను విమోచించుకొని ఉన్నతమునకు ఎక్కెను (ఎఫెసీ. 4:8). అప్పుడు పరదేసు అను తోటను ఏర్పరిచెను. ఆ దినమున ఆయనతో కూడా మరణించిన దొంగ కూడాను, పాత నిబంధన పరిశుద్ధులతో కూడా, పరదేశునందు విశ్రమించెను.
సరే, పాతాళమును జయించుటకు ఆయనకు సహాయపడినది ఏది? అవును, అది పునరుద్ధానము యొక్క శక్తి. అట్టి శక్తిని అపో. పౌలు ఆసక్తితో వెతికెను. ఆయన చెప్పెను: “ఏవిధము చేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,’ అని వ్రాయిచున్నాడు. అందుచేత ఆయన సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు (ఫిలిప్పీ. 3:10,11).
దేవుని బిడ్డలారా, నేడు కూడాను పాతాళము యొక్క శక్తిని జయించేటువంటి అధికారమును ప్రభువు మీకు అనుగ్రహించియున్నాడు. పాతాళము యొక్క ద్వారములు ఎన్నడును మిమ్ములను జయించ జాలదు అని వాక్కునిచ్చియున్నాడు. ప్రభువు యొక్క సువార్త వలనైన శక్తి చేత, పాతాళమునకు వెళ్ళుచున్న వారిని విమోచించి, పరలోకము యొక్క బాటలోనికి తీసుకుని రండి.
నేటి ధ్యానమునకై: “మృతుడనైతిని, గాని ఇదిగో, యుగయుగములు సజీవుడనైయున్నాను, ఆమెన్; మరణము యొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి” (ప్రకటన. 1:18).
