No products in the cart.
మే 12 – జయించేటువంటి తీర్మానము,!
“క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచు, ప్రతి స్థలమందును మా ద్వారా ఆయన గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచున్న దేవునికి స్తోత్రము” (2 కోరింథీ. 2:14).
జయముపై జయమును పొందుటకును, శోధనలపై జయమును పొందుటకును నేడు తీర్మానించుడి. జయమునకై మిమ్ములను మీరు సమర్పించుకొనుడి. మిమ్ములను ఎల్లప్పుడును విజయోత్సహముతో ఊరేగించవలెను అని ప్రభువు ఆసక్తిగలవాడై ఉన్నాడు.
కావున, ‘నేను తోకగా ఉండక తలగావుందును, క్రిందివానిగా ఉండక పైవానిగా ఉందును అనియు, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక”. (1. కొరింథీ. 15:57) అనియు విశ్వాసపు ఒప్పుకోలను చేయుడి.
యేసుక్రీస్తునకు పరాజైము అనుటయే లేదు. ఆయన జయ క్రీస్తు. ఇశ్రాయేలీయులకు జయ గంభీరమైనవాడు. ఇశ్రాయేలీయుల సైన్యమునకు ముందుగా జయశాలిగా, ఠీవిగా నడిచి వెళ్ళువాడు. కనానునందుగల ఏడు జనాంగములను హతమార్చి, ముప్ఫై ఒక రాజులపై ఇశ్రాయేలీయులకు జయమును అనుగ్రహించిన ఆయన, నిశ్చయముగా మీకు కూడాను జయమును అనుగ్రహించును.
మీరు చేయవలసిన ఒక అంశము కలదు. ఓటమిని గూర్చి ఎట్టి తలంపునకును చోటు ఇవ్వకుడి. ప్రతికూలమైన మాటలను మాట్లాడకుడి. మనస్సునందు అలసటను ప్రాలద్రోలి, ప్రభువు యొక్క ఉత్సాహభరితమైన ఆత్మ చేత నింపబడుడి. నేడు ప్రభువు నాకు ఒక అద్భుతమును చేసి, జయమును అనుగ్రహించును అని ఉత్సాహముగా విశ్వాసపు ఒప్పుకోలును చేయుడి.
కొందరు ఎల్లప్పుడును ఓటమిని గూర్చిన మాటలనే మాట్లాడి: “నేను ఎందుకని పుట్టాను? ప్రాణాలతో ఉండుటకంటే చనిపోవడము మంచిది. ఇతరులందరు హెచ్చింపబడుచున్నారు. నేనే దిగజారి పోవుచున్నాను. నా తలరాత అలా ఉంది” అని మానక చెప్పుచు క్రిందకు దిగజారి పోవుచూనే ఉన్నారు. దేవుని బిడ్డల యొక్క నోట ఇటువంటి మాటలు రానియ్యకూడదు.
మీరు రాజాధిరాజు యొక్క పిల్లలగా ఉండగా, ఎందుకని అనాధలవలె గ్రహించవలెను? ప్రభువు మీ కొరకు సిలువయందు సమస్తమును చేసి ముగించియుండగా, ఎందుకని దారిద్రతతోను, బలహీనతతోను జీవించవలెను? ఎల్లప్పుడును, అయన మిమ్ములను విజయోత్సవముతో ఊరేగించుచున్నవాడు మీతో కూడా ఉన్నాడు.
పోరాట సమయమునందు శత్రువులను వెళ్ళగొట్టుటకు వచ్చినప్పుడు, యెహోషాపాతు విజయవంతమైన మాటలను మాట్లాడెను. కారణము, ఆయన యొక్క కన్నులలో దేవుని గూర్చిన సరియైన ప్రత్యక్షత ఉండెను. “మా పితరుల దేవుడైన యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవైయున్నావు; అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు” (2. దినవృ. 20:6) అని ఆయన ఒప్పుకోలు చేసెను.
దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన ప్రభువును మీరు వెంబడించుచున్నారా. ఆయన వలన ప్రభువు వలన అసాధ్యమైనది ఏదియు ఏదియు లేదు. ఈ లోకమునందు మీకు పోరాటము ఉండవచ్చును. కలవరపడకుడి, యుద్ధము యెహోవాది, ఓటమి సాతానునకు చెందినది. మీకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రమును చెల్లించుడి.
నేటి ధ్యానమునకై: “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను; నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డు కఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును” (కీర్తనలు. 23:4).
