No products in the cart.
మార్చి 17 – సోమ్మసిల్ల వద్దు!
“నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు” (యెషయా. 40:28)
దేవుని ప్రజలను తొట్టిల్లునట్లు సాతాను ఉపయోగించుచున్న అతి భయంకరమైన ఆయుధాలలో ఒకటి మనస్సునందు నిరుత్సాహమైయున్నది. ఈ ఆయుధము అనేక విశ్వాసులపై దాడి చేసియున్నది. అనేకమంది సేవకులను కూడా కదిలిచివేసియున్నది.
అయితే, మన యొక్క ప్రియ ప్రభువును తేరి చూడుడి. ఆయన ఎన్నడును సొమ్మసిల్లనివాడు. మనము కూడాను సొమ్మసిల్లిపోవుటను ఆయన కోరుకొనుట లేదు. అందుచేతనే, “సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే” అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది (యెషయా. 40:29).
కొందరికి ఎల్లప్పుడును శరీరమునందు అలసట కలదు. కొందరికి మనస్సునందు అలసట కలదు. మనస్సునందు అలసట వచ్చినట్లయితే ఉత్సాహమును కోల్పోయినవారై, ముఖము అంధకారము కమ్మీ, ఏదో ఒక జీవసెవము వలె కనబడుదురు. అయితే ప్రభువును స్తుతించి ఆనందించువారు ఎల్లప్పుడును ఉత్సాహముగా ఉందురు.
మీయొక్క అంతరంగమునందు అలసట ఏర్పడినట్లయితే వెంటనే దేవుని యొక్క పాదముల చెంతకు వెల్లుడి. దేవుని యొక్క బిడ్డలతో కలిసి ప్రభువును ఉత్సాహముగా ఆరాధించుడి. “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును” (సామెతలు. 17:22) అనియు, “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు” (సామెతలు. 24:10) అనియు జ్ఞాని చెప్పుచున్నాడు.
కొందరికి శరీరమునందు గాని, ప్రాణమునందు గాని లేకుండా ఆత్మలో అలసట కలుగును. ఆత్మ ఎల్లప్పుడును కలత చెందుచూనే ఉండును. భయమును చింతయు పట్టి పీడించును. లేఖన గ్రంథము చదువుటకు ఇష్టము ఉండదు. ప్రార్థించుటకు మనస్సు రాదు. అలాగైతే ఏదో ఒక శత్రువు మీకు విరోధముగా పోరాడుచున్నాడు అను సంగతిని దిట్టముగా తెలుసుకొనుడి. ప్రభువు యొక్క సేవకుల యొద్దకు వెళ్లి ఆలోచన అడిగి వారి వద్ద ప్రార్థించుకొనుడి.
అంత మాత్రమే కాదు, మీయొక్క ఆత్మలో పోరాడుచున్న శత్రువుతోను ఎదిరించి నిలబడుడి. సాతాను ఎదిరించి నిలబడినట్లైతే అతడు పారిపోవును. నేను దేవుని యొక్క బిడ్డను, సాతానా నీవు నన్ను ముట్ట జాలవు అని దృఢముగా ఆజ్ఞాపించుడి. ఆ తరువాత ప్రభువును నోరార స్తుతించుటకు ప్రారంభించుడి. ప్రభువును స్తుతించే స్తుతించే కొలది మీయొక్క ఆత్మలో ఒక గొప్ప విడుదల కలుగును.
యేసుక్రీస్తు స్తుతి వస్త్రమును ఇచ్చుట కొరకే ఈ భూమికి దిగివచ్చెను కదా! బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదెకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు” (యెషయా. 61:3).
దేవుని బిడ్డలారా, అట్టి స్తుతిని మీయొక్క వస్త్రముగా ధరించుకొనుడి. స్తుతించుటకు కొద్దిగా కష్టముగా ఉండినను ఆ సంగతిని లక్ష్యము చేయక కొనసాగించి స్తుతించుచునే ఉన్నప్పుడు, ఖచ్చితముగా విడుదల కలుగును, అంతరంగమునందు ఆనందము ఏర్పడును, బంధకాలు అన్నియును తెగిపోవును.
నేటి ధ్యానమునకై: “మనము మేలు చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము” (గలతి. 6:9).
