No products in the cart.
మార్చి 09 – ఆకాశపు తూములు!
“నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను” (మలాకి. 3:10).
ఆకాశము తెరవబడియున్న పలు సందర్భములను బైబిలు గ్రంధమునందు మనము చదువగలము. మొట్టమొదటిగా నోవాహు యొక్క దినములయందు ఆకాశము తెరవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను (ఆది. కా. 7:11). నలభై దినములు రాత్రియు పగలును భూమి మీద వర్షము కురబడుచూనే ఉండెను. వర్షము కురవక యుండినట్లయితే ఓడ పైకి లేచి ఉండేది కాదు. కొండలకు మీదుగా, పర్వతములకు మీదుగా ఓడ హెచ్చింపబడవలెను అంటే అతి పెద్ద వర్షము కురిసి తీరవలెను.
అదేవిధముగా సంఘము అను ఓడ క్రీస్తు యొక్క రాకడలో పరలోకమునకు ఎత్తబడవలెను అంటే అభిషేకము అను అతి పెద్ద వర్షము అవస్యముగా కావలెను. ఆకాశపు తూములు విప్పబడ వలసినది అవస్యము. పరిశుద్ధాత్ముడు తానే స్వయముగా అట్టి వర్షము వలె దిగి వచ్చును.
అంత్యదినములు సమీపించే సమీపించే కొలది, అభిషేకము అత్యధికముగా పెరుగుచూనే ఉన్నది. ఇంకను పలు వేల రెట్లు ఇట్టి అభిషేకము పెరుగును. అకస్మాత్తుగా ఉన్నపణముగా అతి త్వరలో ఆకాశపు తూములు తెరవబడునట్లు దేవుని యొక్క కొలతలేని అభిషేకము దేశమంతటా బహు బలముగా కుమ్మరించబడును. దాని తర్వాతనే ప్రభువు యొక్క బిడ్డలు ఆయన యొక్క రాకడయందు కొనిపోబడుదురు.
పరో చూచిన కలలో రెండు భాగములు ఉండెను. అందులోని ఒక భాగము, ఏడు సంవత్సరములు సమృద్ధిగల సంవత్సరములు. ప్రభువు దానిని పుష్టిగల యేడు వెన్నులకును, బలిసినవియునైన యేడు ఆవులకును పోల్చిచెప్పెను. దాని తర్వాత ఏడు సంవత్సరములు అతి భయంకరమైన కరువులు కలుగును. దేశమునందుగల సమృద్ధి కనపడకుండా పోవును అట్టి ఏడు సంవత్సరములు అంత్యక్రీస్తు యొక్క ఏలుబడికి సాదృశ్యమైయున్నది.
అట్టి దినములయందు వచనము వినకూడని భయంకరమైన కరువు వచ్చును. అయితే, అంత్యక్రీస్తు యొక్క ఏలుబడికి ముందుగా దేశమంతటా వర్షము కురిసి సమృద్ధిగల, సస్యశ్యామలమైన దినములను ప్రభువు ఆజ్ఞాపించును. ఇట్టి అభిషేకపు వర్షము కుమరింప బడుచున్నప్పుడే సమృద్ధి గల ఆత్మీయ ఆశీర్వాదములు భూమిమీదకు వచ్చి దిగును.
లోకము అంత్యక్రీస్తును ఎదురుచూస్తున్న దినములలో మనము అభిషేకపు వర్షము కురవబడుటను ఆసక్తితో ఎదురుచూస్తూనే ఉన్నాము. ప్రభువు యొక్క సన్నిధిలో నుండి విశ్రాంతి పొందు కాలములు ఖచ్చితముగా వచ్చే తీరును.
ఇట్టి విశ్రాంతి పొందు కాలములు అని చెప్పబడుటను మరికొందరైన తర్జుమాకారులు నవ ఉత్సాహపు కాలములు అని సూచించుచున్నారు. ఆకాశపు తూములు తెరవబడపోవుచున్నది. అతి పెద్ద వర్షమునైన అభిషేకము కురువబడ బోవుచున్నది. సర్వ శరీరుల మీదను ప్రభువు తన యొక్క ఆత్మను కుమ్మరింప బోవుచున్నాడు. అట్టి అభిషేకపు వర్షము దిగివచ్చుటను ఎవరు అడ్డగించి ఆపనే లేరు. దేవుని బిడ్డలారా, నేడే దానిని పొందుకొనుడి. గొప్ప ఉజ్జీవమును ఆసక్తితో ఎదురుచూడుడి. అట్టి అభిషేకమే ప్రభువు యొక్క రాకడకు మిమ్ములను సిద్ధపరచును.
నేటి ధ్యానమునకై: “మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమిమీద దాని కురియజేయును” (ప్రసంగి. 11:13).
