No products in the cart.
మార్చి 08 – లెబానోను
“నా ప్రియురాలా, నీవు అధికసుందరివి; నీయందు కళంకమేమియు లేదు. లెబానోను విడిచి నాతోకూడ రమ్ము, నా ప్రాణేశ్వరీ! లెబానోను విడిచి నాతో కూడ రమ్ము” (పర.గీత. 4:7,8).
పరమగీతములు అనుట లోతైన ఆత్మీయ అనుభవములను బోధించుచున్న ఒక గీత గ్రంథమునైయున్నది. సొలోమోను యవ్వన ప్రాయమునందు ఉన్నప్పుడు, దేవునితో అత్యధికముగా సంభాషించెను. దేవుణ్ణి సంతోషపరిచెను. దేవుని కొరకు బహువిస్తారమైన బలులను అర్పించెను. కావున, ప్రభువు సొలోమోనునకు అమితమైన జ్ఞానమును దయచేసెను.
అట్టి అమితమైన జ్ఞానమే సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథము మొదలగు గ్రంథములను వ్రాయుటకు సొలోమోనునకు సహకారముగా ఉండెను. ఈ పరమగీతముల గ్రంథము క్రీస్తునకును సంఘమునకును మధ్య గల ఉన్నతమైన సత్సంబంధమును, పెండ్లి కుమారునికిని పెండ్లి కుమార్తెకు మధ్య ఉన్న లోతైన సంబంధమును బయలుపరచుచున్నది.
లెబానోను అను మాటకు తెల్లని పర్వతము అనుట అర్థమునైయున్నది. ఇశ్రాయేలు దేశమునందు ఉత్తర పశ్చిమమునందు గల పార్వతపు ప్రాంతమే లెబానోను అని పిలవబడుచున్నది. హెర్మోను పర్వతము కూడాను అక్కడే ఉన్నది. ఇట్టి పర్వతపు శిఖరమునందే కురవబడిన మంచు కనబడుట చేత ఇది తెల్లటి పర్వతము అని పేరును కలిగియున్నది.
‘లెబానోను విడిచి నాతో కూడా రమ్ము’ అని మన ప్రాణ ప్రియుడు మనలను ప్రేమతో పిలుచుచున్నాడు. నిర్మలమైన పరిశుద్ధతతోను, డాగు ముడత లేని పవిత్రతతోను, నిష్కలంకమైన వధువుగా నీవు నా యొద్దకు రావలెను అనుటయే ఆ పిలుపునందుగల రహస్యము. ప్రభువు యొక్క రాకడలో ప్రభువు పరిశుద్ధులను మాత్రమే తన వద్దకు సమకూర్చి చేర్చుకొనును. ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడి” (కీర్తనలు. 50:5).
క్రైస్తవ జీవితమునందు, పరిశుద్ధత మిగుల ప్రాముఖ్యమైనది. మన యొక్క ప్రాణ ప్రియుడు పరిశుద్ధముగా ఉండుట చేతనే మనము కూడాను పరిశుద్ధముగా ఉండవలెను. అపో. పేతురు ఆ సంగతిని గూర్చి వ్రాయుచున్నప్పుడు: “మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము, మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. నేను పరిశుద్ధుడను గనుక, మీరును పరిశుద్ధులై ఉండుడి” (1. పేతురు. 1:16,15) అని వ్రాయుచున్నాడు.
క్రీస్తు యొక్క రాకను గూర్చిన సూచనలన్నియును నేడు బహుతీవ్రముగా నెరవేర్చబడుచూనే ఉన్నాయి. ప్రవర్చనములు కూడాను నెరవేర్చబడియున్నది. లోకమునందు జరుగుచున్న సంభవములు ప్రభువు యొక్క రాకడ బహు సమీపము అను సంగతిని మనకు స్పష్టముగా సూచించుచు కనబరుచుచూనే ఉన్నది.
అందుచేతనే, “ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకును, గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును. నా ప్రియురాలా! నీవు అధికసుందరివి, నీయందు కళంకమేమియు లేదు. లెబానోను విడిచి నాతో కూడ రమ్ము, నా ప్రాణేశ్వరీ! లెబానోను విడిచి నాతో కూడ రమ్ము” (పర.గీత. 4:6-8) అని ప్రభువు మనలను చూచి త్వరగా పిలుచుచున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్ములను పరిశుద్ధ పరచుకొని ప్రభువు యొక్క రాకడకు సిద్ధపరచుకొందురా?
నేటి ధ్యానమునకై: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” (ప్రకటన. 22:17).
