No products in the cart.
మార్చి 04 – శాశ్వతకాలముండు ప్రేమ!
“ప్రేమ శాశ్వతకాలముండును” (1. కొరింధీ. 13:8).
లేఖన గ్రంథమును, ప్రేమ యొక్క గ్రంథము అని మనము పిలుచుచున్నాము. దాని యొక్క మొదటి పుట నుండి చివరి పుట వరకును జాలువారుచున్న ఒక దైవ వర్తమానము ప్రేమయైయున్నది. ఒక భక్తుడు దానిని గూర్చి చెప్పుచున్నప్పుడు, లేఖన గ్రంథమును పిండి రసము తీసినట్లైతే ప్రేమయే చుక్కలు చుక్కలుగా కారుచు ఉండును అని చెప్పెను. బైబులు గ్రంథము మనుష్యునికి దేవుడిచే అనుగ్రహించబడిన ఒక గొప్ప ప్రేమ యొక్క వరమైయున్నది.
ప్రేమ శాశ్వత కాలముండును (1. కొరింథీ. 13:8). ప్రేమ ఎన్నడును మారనిది (యోహాను. 13:1); ప్రేమ దైవీకమైనది (యోహాను. 15: 9); ప్రేమ ప్రాణమును పెట్టును (యోహాను. 15: 13); ప్రేమ బలవంతము చేయుచున్నది (2. కొరింథీ. 5:14). ప్రేమ త్యాగముగలది (గలతి. 2:20); ప్రేమ గొప్ప ఔనత్యమైనది (ప్రకటన. 1:6) ప్రేమ ఎడబాప లేనిది. అవును, “క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?” (రోమీ. 8:35).
నేను కళాశాలయందు చదువుచూ ఉన్నప్పుడు ఆ దినములయందు అక్కడ ఉన్న హెచ్చరిక పలకలపై, “నీవు ఈ లోకము యొక్క మార్గము గుండా ఒక్కసారి మాత్రమే దాటి వెళ్ళుచున్నావు. కావున ఈ అరుదైన తరుణమునందు నీ చుట్టూత ఉన్న ప్రజలను ప్రేమించుము” అని వ్రాయబడియుండెను. నేను ఆ పంక్తులను పలుసార్లు చదివాను. ఆ పంక్తులు నా జీవితమును మార్చేను.
లోకము గుండా ఒక్కసారి మాత్రమే దాటి వెళ్ళుచున్నప్పుడు, కల్వరి ప్రేమ యొక్క లోతును గ్రహించుకొనునట్లు దేవుడు కనికరమును చూపించెను. ఎంతోమంది ప్రజలకు ఇట్టి ధన్యత లేదు. వారు ఇట్టి ప్రేమను గ్రహించుకోనలేక లోక ప్రేమల కొరకును, వేషధారన ప్రేమ కొరకును తపించి అబద్ధపు ఎండమావుల తట్టునకు పరుగులు తీస్తున్నారు. అయితే మనము మనలను ప్రేమించి, వాత్సల్యతను చూపించి, మన కొరకు తన్ను తాను అప్పగించుకొనిన క్రీస్తు యొక్క ప్రేమచేత తృప్తి చెందియున్నాము. ఆయన యొక్క ప్రేమ, రాతిని సహితము మైనమువలె కరుగజేయును. కఠిన హృదయము గల వారిని, బండ వంటి హృదయము గల వారిని పరిశుద్ధులుగా చేయును.
ఆయన యొక్క ప్రేమ ఎదుట లొంగిపోని వారు ఎవరు కలరు? ఆయన యొక్క ఆప్యాయత ఎదుట మోకరించని వారు ఎవరు కలరు? అపో. పౌలు అట్టి ప్రేమ చేత నింపబడినప్పుడు, అట్టి ప్రేమ పరిచర్య చేయనట్లు ఆయనను బలవంతము చేసెను (2. కొరింథీ. 5:14). అట్టి ప్రేమ చేత ప్రేరేపించబడినవాడై ఆయన అనేక దేశములకు బయలుదేరి వెళ్ళెను. క్రీస్తును గూర్చి ఎరుగని ప్రజల మధ్యలో సువార్తను ప్రసంగించెను. యూదులకు గొప్ప సవాలుగా ఉండెను. క్రీస్తు యొక్క ప్రేమ కొరకు తన్ను తాను పరిపూర్ణముగా త్యాగము చేసుకొనుటకు సిద్ధముగలవాడై ఉండెను.
ఒకసారి యెరూషలేములో పౌలునకు బంధకాలు కనిపెట్టుచున్నాయన్న సంగతిని విశ్వాసులు ఎరిగి ఆయనను హెచ్చరించినప్పుడు, ఆయన ధైర్యముగా, ఎందుకని మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక, చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను (అపో.కా. 21:13). దేవుని బిడ్డలారా, ఈ కల్వరి ప్రేమ మిమ్ములను ఎల్లప్పుడును బలవంతము చేయుచు ఉండవలెను.
నేటి ధ్యానమునకై: “ఎత్తయినను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను” (రోమీ. 8:38,39).
