No products in the cart.
మార్చి 01 – ప్రేమించుడి!
“కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను” (1. కొరింథీ. 13:2).
లోకమునందే తలమాణిక్యమైనది విశ్వాసమే అని అనేక ప్రసంకీకులు నొక్కి వక్కాణించుచున్నారు. విశ్వసించు వానికి సమస్తమును సాధ్యము. విశ్వాసము చేత కొండలను పెక్కలించేటువంటి అరుదైన గొప్ప కార్యములను చేయవచ్చును. మన యొక్క విశ్వాసమే లోకమును జయించేటువంటి విజయము అని విశ్వాసమును మాత్రమే నొక్కి వక్కాణించుచు చెప్పుచున్నారు.
మంచిదే, విశ్వాసము అత్యవసరమైనదే. అదే సమయమునందు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మనము మర్చిపోకూడదు. విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను మూడిటిని ఒకటిగా నిలబెట్టి అందులో ఏది గొప్పది అను ప్రశ్నను అపో. పౌలు లేవనెత్తుచున్నాడు. బహుశా అదే ప్రశ్నను నా వద్ద ఎవరైనా అడిగినట్లయితే ఒక్క నిమిషము కూడాను ఆలస్యము చేయకుండా ప్రేమయే గొప్పది అని బదులు ఇచ్చేదెను (1. కొరింథి. 13:13).
ఒకసారి ఒక శాస్త్రి యేసుని వద్దకు వచ్చి, ‘బోధకుడా, ధర్మశాస్త్రమునందుగల ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ ప్రధానమైనది’ అని పది ఆజ్ఞలను కూడాను ప్రస్తావించి అడిగెను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు పది ఆజ్ఞలు మాత్రము గాక, యూదుల రబ్బీలు మొత్తము 3,600 చట్టదిట్టాలను వ్రాసి ఇచ్చియుండెను. యూదుల యొక్క పవిత్ర గ్రంథమైయున్న తెల్మండ్ అను గ్రంధమునందు ఇది కనబడుచున్నది.
ఈ ప్రశ్నకు వెంటనే యేసుక్రీస్తు: “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెనను; నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను అనునదియే” అని జవాబును ఇచ్చెను (మత్తయి. 22:37,39) “ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నదని అతనితో చెప్పెను” (మత్తయి.22:40).
క్రీస్తు మనలను మాత్రము గాక, సంఘమును కూడా ప్రేమించెను అని ఎఫెసీ. 5:25 ‘నందు చదువుచున్నాము. సంఘము అనుట, రక్షింపబడియున్న విశ్వాసుల యొక్క సహవాసమైయున్నది. ప్రభువు తన యొక్క స్వరక్తము చేత సంఘమును సంపాదించు కొనియున్నాడు (అపో.కా. 20:28). కావున, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ప్రేమించునట్లుగా క్రీస్తు సంఘమును ప్రేమించెను. అంత మాత్రమే కాదు, సంఘము ఎదుట అన్యజనులకు కూడాను తన యొక్క ప్రేమను కనబరుచుట కొరకు ఆయన ఆసక్తి గలవాడై ఉన్నాడు.
ఒక క్రైస్తవ పత్రికయందు ఒకసారి ఒక ప్రార్థనను చదివాను. “ప్రేమగల దేవా! నీవు మాపై ఎంతగానో ప్రేమను ఉంచావు! మేము ఒకరికొకరు ప్రేమించవలెను అని బోధించి తెలియజేసావు. అయితే నీ బిడ్డలమైయున్న మేము ప్రేమకు బదులుగా ద్వేషమును, ఆప్యాయతకు బదులుగా చీలికలను, పట్టు విడుచుటకు బదులుగా మొండి పట్టును, కనికరమునకు బదులుగా అసూయను, ఈర్షను గైకొనియున్నాము. దేవా ఇట్టి పరిస్థితిని మార్చి నీ యొక్క మహత్తరమైన ప్రేమ చేత మమ్ములను నింపుము. ప్రేమ అను పాశము చేత మమ్ములను బంధించి నీ తట్టున ఆకర్షించుకొనుము” అని వ్రాయబడి ఉండెను. దేవుని బిడ్డలారా, అది ఎంతటి అమోహమైన ప్రార్థన ఇది!
నేటి ధ్యానమునకై: “ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనుటయందు శ్రద్ధ కలిగినవారై, జాగ్రత్తగా ఉండుడి” (ఎఫెసీ. 4:1).
