No products in the cart.
ఫిబ్రవరి 26 – దావీదువంటి వారిగా ఉండును!
“ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు” (జెకర్యా. 12:8).
ప్రభువును స్తుతించుటయే తన జీవితము యొక్క ఉద్దేశముగా కలిగియున్న దావీదును ప్రభువు మిగుల అత్యధికముగా ప్రేమించెను. అతనిని తన హృదయానుసారునిగా చూచెను. అంత మాత్రమే కాదు, ఆయనకు కొలతలేని అభిషేకమును, ప్రవచనాత్మకమైన కీర్తనలను ఇచ్చెను.
దావీదు శత్రుల ఎదుట అభిషేకింపబడెను. సహోదరుల ఎదుట అభిషేకింపబడెను. సమస్త ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట అభిషేకింపబడెను. శత్రువులను లోబరుచుకొను శక్తిని ప్రభువు దావీదునుకు ఇచ్చి, శత్రువులను అతని పాదపీఠమునకు తీసుకొని వచ్చెను.
దావీదు గోలియాతుతో యుద్ధమును చేసినప్పుడు, దాని తరువాత జరిగిన వందలకొలది యుద్ధములయందును, ప్రభువు దావీదునుకు జయముపై జయమును ఇచ్చి ఆశీర్వదించెను.
దేవుని బిడ్డలారా, పలు ఓటమి గల మార్గములగుండా మీరు వచ్చియున్నారా? సంతోషమును కోల్పోయి బలహీనత చెంది తల్లాడుచు నిలబడియున్నారా? కలత చెందకుడి! దావీదు కుమారుడైన యేసు సంపూర్ణముగా జయము పొందినవాడైయున్నాడు.
మీరు దావీదు వంటివారై ప్రభువును స్తుతించుటకు మిమ్ములను సమర్పించుకున్నట్లయితే ప్రభువు మీ గుడారమును స్థిరపరచును. మీ యొక్క తల్లాడుతున్న మోక్కాళను బలపరచును. అప్పుడు మీరు అపో. పౌలుతో కూడా కలసి: ” నన్ను బలపరచుచున్న క్రీస్తునియందే సమస్తమును నేను చేయుటకు బలము కలదు” (ఫిలిప్పీ. 4:13) అని ఉత్సాహముగా చెప్పగలరు.
మీ గుడారము దావిదు యొక్క గుడారముగా ఉండవలెను. అప్పుడు మీ గుడారమునందు దేవుని ప్రసన్నత ఉండును. దేవుని మహిమ ఉండును. ఆటలు పాటలు సంతోషము ఉండును. ప్రభువును ప్రేమించుచున్న మీకు ఆయన సమస్తమును మేలునకు హేతువుగా జరిగించును. మీరు బలముగలవారిగా మారుదురు.
మరలా ఒకసారి జెకర్యా ప్రవచము ద్వారా ప్రభువు దయచేసియున్న వాగ్దానమును చదివి చూడుడి. “ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతివారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు” (జెకర్యా. 12:8).
పాత నిబంధన పరిశుద్ధులు, “విశ్వాసముద్వారా వారు రాజ్యములను జయించిరి; నీతి కార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి; అగ్ని బలమును చల్లార్చిరి; ఖడ్గ ధారను తప్పించు కొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి” అని హెబ్రీ. 11:33,34 ‘నందు చదువుచున్నాము. దేవుని బిడ్డలారా, మీరు కూడాను ప్రభువును స్తుతించి స్తుతించి బలము పొందుదురు గాక.
నేటి ధ్యానమునకై: “యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?” (కీర్తనలు. 27:1).
