నవంబర్ 19 – నేనే నెరవేర్తును!
“యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు అప్పుడు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసికొందురు; యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును” (యెహేజ్కేలు. 36:36).
ప్రభువు ప్రవక్తయైన యెహేజ్కేలు ద్వారా బబులోను చెరలో ఉన్న ప్రజలకు అనేక వాగ్దానములను అనుగ్రహించెను. నేను మరలా మిమ్ములను లేవనెత్తి కట్టెదను. నిర్మూలమైన వాటిని మరలా కట్టి లేపెదను. పాడైపోయిన స్థలములను పైరు భూములుగా చేసేదెను అని వాక్కునిచ్చెను.
ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు నమ్మికను కోల్పోయినవారై ఉండిరి. ఇది జరిగేటువంటి అంశమేనా అని సందేహించిరి. కావున ప్రభువు, ‘యెహోవానైన నేను దీనిని చేసేదెను, దీనిని నెరవేర్తును’ అని చెప్పెను.
మన యొక్క దేవుడు వాగ్దానములు యొక్క దేవుడు. బైబులు గ్రంథము అంతటను వేవేల కొలది వాగ్దానములు అనుగ్రహింపబడియున్నది. ప్రభువు తాను అనుగ్రహించిన వాగ్దానములన్నిటిని నెరవేర్చి, తన యొక్క నామమును మహిమ పరచుకునియున్నాడు. దేవుని యొక్క బిడ్డలు చేయవలసినది అన్నియును ఆయన యొక్క వాగ్దానములను దృఢముగా పట్టుకొనుటయే.
ప్రభువు మీకు ఒక వాగ్దానమును అనుగ్రహించి ఉన్నట్లయితే దానిని దృఢముగా పట్టుకొనుడి. ఎన్ని శోధనలును, శ్రమలు వచ్చినను, ఆ వాగ్దానములను విడచిపెట్టకుడి. మరచిపోకుడి.
పాత నిబంధన, కొత్త నిబంధన పరిశుద్ధుల యొక్క జీవిత విధానమును చదివి చూడుడి. వారు ఎప్పుడంతా ప్రార్థించుచున్నారో, అప్పుడంతా వాగ్దానములను పట్టుకుని ప్రార్ధించిరి. ‘నీవిలా సెలవిచ్చితివి కదా, చేయుము’ అని వారు గోజాడిరి.
మన ప్రియ ప్రభువు కేవలము మాటలను చెప్పువాడు మాత్రము కాదు. ఎట్టి మాటలైయితే చెప్పుచున్నాడో, దానిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. “ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను” (కీర్తనలు. 33:9). ఆయన సమస్తమును చేయుటకు సమర్ధుడు.
యోబు చెప్పుచున్నాడు: “దేవా, నీవు సమస్తక్రియలను చేయగలవనియు; నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు” (యోబు. 42:2). ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు అని బైబులు గ్రంథము చెప్పుచున్నప్పుడు, ఆయన సెలవిచ్చినది ఎలాగున నిష్ఫలమగును? నిశ్చయముగానే దానిని నెరవేర్చును. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు; పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా?.
యోసేపు యొక్క జీవితమును చదివి చూడుడి. చిన్న వయస్సులోనే ప్రభువు యోసేపును ప్రేమించెను. దర్శనముల ద్వారా యోసేపుతో మాట్లాడెను. కాలములు గతించాయి, ఆ కలలు నెరవేర్చబడుటకు ఎట్టి అనుకూలతైనను లేని పరిస్థితి ఏర్పడెను.
అయినను ప్రభువు తాను చెప్పిన వాటిని నెరవేర్చి, యోసేపు యొక్క సహోదరులు ఆయన ఎదుట వంగి నమస్కరించునట్లు చేసెను. దేవుని బిడ్డలారా, “ఆయన తన యొక్క మాటలన్నిటియందును ఒక్కటైనను నేలపై పడిపోనియ్యలేదు” అను సంగతిని ఎరుగుదురు. (1. సమూ. 3:19).
నేటి ధ్యానమునకై: “ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును; అది నిష్ఫలముగా నాయొద్దకు మరలక, అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును” (యెషయా. 55:10,11).
