No products in the cart.
నవంబర్ 26 – ఈ మట్టుకు!
“ఈ మట్టుకు తాళుడి” (లూకా. 22:51).
ఈ మట్టుకు తాళుడి! క్రీస్తు యొక్క ప్రేమ పూర్వకమైన విజ్ఞప్తి ఇది! యేసు, కత్తిని తీసిన పేతురును మరియు చుట్టూత నిలబడియున్న వారిని చూచి ఈ మట్టుకు తాళుడని చెప్పెను. కత్తెను చేత ఎత్తి పట్టుటను ఆపుడి, గాయపరచుటను ఆపుడి, విలపించుటను ఆపుడి, కనికరము లేకుండా నడుచుకొనుటను ఆపుడి అనుటయే ఆయన యొక్క విజ్ఞప్తి.
అనేకులు దేనికి తీసిన తమ యొక్క స్వభలమునైయున్న కత్తిని దూసుచున్నారు. తమకు తామే తమ చేతులలో న్యాయమును ఎత్తి పట్టుచున్నారు. ప్రభువుకొరకును, కనిపెట్టుటయందును చట్టదిట్టాల కొరకు కనిపెట్టుట లేదు. “ఈ మట్టుకు తాళుడి” అని ప్రభువు చెప్పుచున్నాడు.
మీరు మీకొరకు యుద్ధమును చేయుచున్నప్పుడు, ప్రభువు మౌనముగా ఉండిపోవుచున్నాడు. అయితే ప్రభువు హస్తములలో మీ యొక్క బాధ్యతలను అప్పగించుచున్నప్పుడు, మీ యొక్క యుద్ధములను చేయుటకు అర్పించుకున్నప్పుడు, ఆయన బహు చక్కగా గొప్ప ఔన్నత్యమైన తీరులో యుద్ధమును చేసి మీకు జయమును అనుగ్రహించును.
మోషే చెప్పెను: “యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును; మీరు ఊరకయే యుండవలెను” (నిర్గమ.14:14). ఇంతవరకు మీరు యుద్ధమును చేయుచున్నట్లయితే, దూసిన ఖడ్గముతో ఉండినట్లయితే, అంతరంగమునందు కోపమును, వైరాగ్యమును, ద్వెషమును పెట్టుకొని ఉండినట్లయితే, ప్రభువు మిమ్ములను చూచి ప్రేమతో ఈ మట్టుకు తాళుడి అని చెప్పుచున్నాడు.
ఆనాడు బహుశా బిలాము యొక్క చేతుల్లో ఖడ్గము లేదు. అతని యొక్క ఉద్ఘండ కోపమంతటిని గాడిదపై చూపించెను. గాడిద ఎందుకని తనకు లోబడట లేదు అను సంగతిని గూర్చి అతడు అర్థము చేసుకోలేక పోయెను.
అతడు వెళ్ళు త్రోవ నుండి తొలగి, పొలములోనికి నడిచిన గాడిదను కూడాను పలుమార్లు కొట్టెను. కొట్టుటను ఈ మట్టుకు తాళించుటకు కల్పించిన ప్రభువు, ఆ గాడిద ద్వారా ప్రవక్తకు గ్రహింపజేసెను. అవును, ‘నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితిని’ అని ఆ గాడిద ప్రవక్తయైన బిలామును అడిగెను.
బిలామునకైతే, ఈర్షయు కోపమును ఇంకను తీరలేదు. గాడిద మాట్లాడుటను గూర్చియు అతడు ఆశ్చర్యపడలేదు. దేవదూత ఒకడు నిలబడి గాడిదను అడ్డగించుట కూడాను అతని వలన అర్థము చేసుకొనలేక పోయెను. అతడు ఆ గాడిదను చూచి: “నీవు నామీద తిరుగబడి పరిహాసము చేయుచువచ్చుచున్నావు; నాచేతిలో ఒక ఖడ్గమున్నయెడల, ఇప్పుడే నిన్ను చంపివేయుదును” అని చెప్పి గాడిదను చూచి ఉరిమెను.
‘నేను మాత్రము రక్షింపబడక ఉండినట్లయితే, అతని అంతును చూచెదను. నేను మాత్రము అభిషేకము పొందక పాత మనిషిగా ఉండినట్లయితే అతనికి మంచి గుణపాఠము నేర్పింతును’ అని అనేకులు చెప్పగా వినియున్నాను.
ఆత్మీయ కన్నులు తెరవబడక, శారీరక కన్నులతో చూచుచున్న వారే ఖడ్గమును దూసుచుందురు. ప్రభువైతే ఈ మట్టుకు తాళుడి అని చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఖడ్గమును చేత ఎత్తి పట్టుకొనుట ఆపివేయుడి. దానితోపాటు ఈ యొక్క పాపపు జీవితమును కూడాను ఆపివేయుడి.
నేటి ధ్యానమునకై: “నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది; ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తయిన నాకోట ఆయనే” (కీర్తనలు. 62:1,2).