Appam, Appam - Telugu

ఆగస్టు 02 – ఉదయకాల ప్రార్ధన!

“ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము” (కీర్తనలు. 143:8). నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము” (కీర్తనలు. 143.10).

ఉదయకాలమునందు ప్రభువు యొక్క పాదములయందు కూర్చుండుట ఆయనకు ప్రీతికరమైయున్నది. దావీదు తన యొక్క దేవుని ప్రియ పరచవలెనని వాంఛను కలిగియుండుట చేత ప్రతిదినమును ఉదయకాలమునందు లేచి దైవసముఖమునకు వచ్చి, ప్రభువా, నీకు ప్రీతికరమైనది చేయుటకు నాకు బోధించుము” అని ప్రార్ధించెను.

దేవుణ్ణి ప్రియ పరుచుటకు మన స్వబలము చేతగాని, స్వనీతి చేతగాని, స్వప్నప్రయత్నము చేతగాని చేయలేము. ప్రతి దినమును ఉదయకాలమునందు దైవ సముఖమునకు లేచి వచ్చి, ” ప్రభువా నాకు నేర్పుము” అని అడుగుచున్నవారే దేవుని ప్రియపరచుదురు. అవును, ప్రభువు మనకు నేర్పించినట్లయితే నిశ్చయముగానే ఆయన మార్గములయందు మనము నడచి ఆయన యొక్క చిత్తానుసారముగా నడుచుకొందుము.

ప్రభువు మనకు బోధించుటకు ఉదయకాల సమయము మిగుల మధురమైనది. సుమధురమైన సమయము. దేవుడు మనతో మాట్లాడుటయు, మనము ఆయనతో సంభాషించుటయు, ఆ దినమంతయును ప్రభువు యొక్క చిత్తము ఏమిటి అను సంగతిని తెలుసుకొనుటయును, ఆయన చేత బోధించ బడుటయును ఎంతటి మహిమకరమైన అనుభవములు!

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “చల్లపూట సమయమున ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును వినిరి” (ఆది.కా. 3:8). దేవునితో ముచ్చటించుటకు ఉదయకాల సమయమునే మన యొక్క హృదయము నెమ్మదిగాను, సమాధానముగాను ఉండును. అట్టి సమయమునందే దేవుని యొక్క స్వరమును మనము స్పష్టముగా విని ఆనందించగలము. దాని తర్వాత పగలు సమయములయందు లోక కార్యములు, లోక భారములు మనలను నలిపివేయవచ్చును. అందుచేతనే ప్రభువునకు ప్రియమైన దానిని చేయుటకు ప్రభువు మనకు నేర్పించునట్లుగా ఉదయకాల సమయమును కేటాయించవలెను.

దావీదు ఉదయకాలమున లేచినందున, “నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను: నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును” (కీర్తనలు. 17:15) అని వ్రాయుచున్నాడు. దావీదు మాత్రము కాదు, దేవుని యొక్క పరిశుద్ధులు అందరును ఉదయకాలమున లేచి, దేవునితో సంభాషించి, ఆయన యొక్క మెల్లని స్వరమును విను అలవాటును కలిగియుండిరి. “అబ్రహాము తెల్లవారుజామున లేచి” అని ఆది.కా. 22:3 నందు చదువుచున్నాము. యోబు ఉదయకాలమున లేచి దేవుని సమూఖమునందు దహన బలులను అర్పించుటను బైబిలు గ్రంథమునందు చూచుచున్నాము. (యోబు. 1:5).

యేసు యొక్క ప్రార్థన గూర్చి బైబిలు గ్రంథము సెలవిచ్చుటను చూడుడి. “ఆయన పెందలకడనే లేచి, యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను” (మార్కు. 1:35).

దేవుని బిడ్డలారా, ఉదయకాలమునందు లేచి ప్రార్థించుటయును, ధ్యానించుటయును, ప్రభువుతో సంభాషించుటయును మీ యొక్క జీవితమునందు అనుభవముగా చేసుకొనుడి. ఉదయకాలమునందు లేచి పూర్ణ హృదయముతోను సంతోషముతోను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నప్పుడు, స్తుతులయందు ప్రీతి గల ప్రభువు, మీకు తన యొక్క మార్గమును బోధించును.

నేటి ధ్యానమునకై: “మీరందరు కూడివచ్చి ఆలకించుడి; యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును; అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును అను సంగతిని వీరికి తెలియజేయువాడు ఎవరు?” (యెషయా. 48:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

Login

Register

terms & conditions