No products in the cart.
జూలై 03 – పరలోకపు (గవిని) గుమ్మము!
“ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు; పరలోకపు (గవిని) గుమ్మము ఇదే అనుకొనెను” (ఆది.కా. 28:17,18).
పరలోకపు గుమ్మమును గూర్చి నేడు ధ్యానించెదము. ప్రతి ఇంటికి గుమ్మము ఉండును. ఆలయములకు గుమ్మము కలదు. నగరములకు కూడాను గుమ్మము కలదు. అదే సమయమునందు పరలోకమునకు కూడాను ఒక గుమ్మము ఉండటను గమనించుడి.
ఆలయము యొక్క ఆచూకే లేని ఒక స్థలమునందు, ప్రభువును దర్శించిన యాకోబు ఆకాశము తెరవబడి ఉండుటను చూచెను. భూమికిని ఆకాశమునకును నిచ్చెన ఉంచబడి ఉండుటను చూచెను. అట్టి నిచ్చెనయందు దేవుని దూతలు ఎక్కుచూను, దిగుచూను ఉండెను.
ఇట్టి నిచ్చెన ద్వారా, ఏ మనుష్యుడు పరలోకమునకు ఎక్కి వెళ్ళుటను యాకోబు గమనించలేదు. అట్టి నిచ్చెనయందు ఎక్కి వెళ్లేటువంటి పరిశుద్ధత ఏ మనుష్యునికిని లేదు అను సంగతియే దీనికి గల కారణము. పాపమును చూడని శుద్ధ నయనము గల దేవుని సమీపించి చేరుటకు కావలసిన ధైర్యము మనుష్యునికి లేదు. కావున, దేవుని యొక్క దూతలు మాత్రము ఆ నిచ్చెనను ఉపయోగించిరి.
అయితే కొత్త నిబంధన కాలమునకు వచ్చుచున్నప్పుడు, యేసు క్రీస్తే అట్టి నిచ్చెనగా మారెను. ఆయనే పరలోకమును భూమిని ఒకటిగా ఏకము చేసెను. మనుష్యుడు పరలోకమునకు వెళ్లేటువంటి ధన్యతకు మార్గమును తెరిచి ఇచ్చెను. యోహాను దర్శనమునందు చూచుచున్నప్పుడు, విస్తారమైన జనులు పరలోకమునందు ఎక్కి వచ్చుటను చూచెను. అంత మాత్రమే కాదు, ఇక్కడకు ఎక్కి వచ్చుటకు కావలసిన పిలుపు కూడాను యోహానునకు లభించెను. యేసు మన కొరకు గుమ్మముగా మారుట ఎంతటి గొప్ప ధన్యత! నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని ఆయన సెలవిచ్చెను కదా!
బైబిలు గ్రంధమునందు పలు గుమ్మమును గూర్చి మనము చదువుచున్నాము. ప్రకటన. 3:8 నందు ఒక గుమ్మమును గూర్చి బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది. ఇది తరబడియున్న గుమ్మము. ‘ఇదిగో తలుపు (తియ్యబడియున్న గుమ్మము) నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయనేరడు’ అని ప్రభువు చెప్పెను.
మనుష్యుడు ఒక గుమ్మమును మూసినట్లయితే, ప్రభువు ఏడు మహిమగల గొప్ప ఔన్నత్యమైన గుమ్మములను మనకు తెరచి ఇచ్చుచున్నాడు. ఆశీర్వాదపు తాళపు చెవులన్నియును ఆయన యొక్క హస్తములలోనే ఉన్నది. ఆయన దావీదు యొక్క తాళపు చెవిని మన ఎదుట ఉంచియున్నాడు. సువార్త యొక్క గుమ్మములును, పరిచర్య యొక్క గుమ్మములును, పరిశుద్ధత యొక్క గుమ్మములును, ప్రార్థన యొక్క గుమ్మములును తెరవబడేయున్నది.
నేడు ఒక తెరవబడియున్న గుమ్మమును ప్రభువు మీకు చూపించుచున్నాడు. అనేక ఆటంకములు గల మార్గమునందు మీరు నడిచి వచ్చిరి. పోరాటముల మార్గమునందు నడిచి వచ్చిరి. ముందుకు కొనసాగలేక తపించిపోయిరి. అయితే, ప్రభువు నేడు తెరచిన గుమ్మమును మీకు ముందుగా ఆజ్ఞాపించుచున్నాడు.
ఇశ్రాయేలీయులు కానానులోనికి వచ్చినప్పుడు, యెరికో గుమ్మములు మూయబడి ఉండెను. ఇశ్రాయేలీయులు స్తుతులతో చుట్టి తిరిగి వచ్చినప్పుడు, యెరికో ప్రాకారములు కుప్పకూలునట్లు చేసి, ప్రభువు గుమ్మమును తెరిచెను. మీరును అలాగునే దేవుని స్తుతించుడి. మీకు విరోధముగా మూయబడియున్న అన్ని గుమ్మములను దేవుడు అద్భుతముగా తెరచి ఇచ్చును.
నేటి ధ్యానమునకై: “కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి” (కీర్తనలు. 100:4).