bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

డిసెంబర్ 26 – త్రోవ నడిపించును!

“వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని త్రోవ నడిపించుదును”.  (యిర్మియా. 31:9).

ప్రభువు ప్రేమతో నేడును వాక్కునిచ్చి,  “నా బిడ్డలారా, మీరు ఎప్పుడంతా ఏడ్చుచు ప్రార్థించుచు నా సముఖమునకు వచ్చుచున్నారో, అప్పుడంతా నేను మిమ్ములను త్రోవ నడిపించెదను. నా మార్గమునందు మిమ్ములను నడిపించెదను”  అని చెప్పుచున్నాడు.

ఆయనే మీ వంకరి త్రోవలను మార్చి, బాగు చేయువాడు. తారుమారుగా జీవించుచున్న వారి యొక్క జీవితమునందు అద్భుతమును చేసి, తిన్నగా నడిపించువాడు ఆయనే మీయొక్క రక్షకుడు, ఆయనే మీ యొక్క కాపరి. దాని తర్వాతి వచనమునందు కొనసాగించి చెప్పుచున్నాడు:      “ఒక గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు దానిని కాపాడును”      (యిర్మీయా. 31:10).

దావీదు గొర్రెలను కాయుచు ఉన్నప్పుడు, గొర్రెలను కబలించుకుని వెళ్ళుటకు తోడేళ్లు, ఎలుకబండియు వచ్చెను.  మరోసారి సింహము వచ్చెను. దావీదు తన యొక్క ప్రాణమనే పణంగా పెట్టి, ఎలుగుబంటిని కొట్టి చంపెను., సింహము యొక్క నోటి నుండి గొర్రెను తప్పించెను. ఎవనిని మృంగుదునా అని అవకాశము వెతుకుచు తిరుగుచున్న, సాతానైయున్న సింహమును జయించుటకు తనకు ఒక శక్తి గల కాపరి కావలెను అను సంగతిని గ్రహించెను. యెహోవానే తన యొక్క కాపరిగా ఎంచుకొని,     “యెహోవా నా కాపరి; నాకు లేమి కలుగదు”      (కీర్తనలు. 23:1).

ఆకాశమును భూమిని కలుగజేసిన ప్రభువు, కాపరిగా ఉండగలడా? అవును, యేసుక్రీస్తు తానే,     “నేనే గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును”      (యోహాను. 10:11) అని చెప్పెను.  ఆయన     “గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును; తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును”      (యెషయా. 40:11).

*మనుష్యులు ఏడుపుతోను, ప్రార్థనతోను వచ్చుచున్నట్లు, గొర్రెలు కూడాను గాయములతోను ముండ్లు కలుగజేయు గాట్లతోను, భయంకరమైన ఈగలతోను, పేన్లు కొరుకుచున్న వేధనతోను కాపరి వద్దకు వచ్చును. కాపరి గాయములను మాన్పేటువంటి తైలమును ఆ గాయముల పై రాసి, విరిగిపోయిన ఎముకలను కట్టును. ఎండ యొక్క వేడిమి వలన తల తిరుగుచున్నట్లు వచ్చుచున్న గొర్రెల యొక్క శిరసుపై నూనెను కుమ్మరించి అభిషేకించును. అది ఎంతటి సుఖము! ఎంతటి విడుదల! ఎంతటి సంతోషము! *

ప్రభువు మీ యొక్క శరీరమునకు కాపరిగా ఉండుట మాత్రము కాదు, మీ యొక్క ప్రాణమునకును కాపరియైయున్నాడు. ఆత్మ, ప్రాణము, శరీరమునకు కావలసిన అంతటిని ఆయన మీకు అనుగ్రహించును.     “మీరు చెదరగొట్టబడిన గొఱ్ఱెలవలె దారి తప్పిపోయి తిరిగిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లింప బడియున్నారు”       (1.పేతురు. 2:25).

దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రాణము చింతతో ఉన్నదా? వ్యాకూలతను, కన్నీరును హెచ్చు  ఆయెనా?  ఏడుపుతోను ప్రార్థనలతోను ప్రభువు  వద్దకు రండి. ఆయన మి ఆత్మలను ఆదరించి, తన యొక్క నామమును బట్టి నీతి మార్గములయందు మిమ్ములను నడిపించును.

నేటి ధ్యానమునకై: “యాకోబు కొలుచు పరాక్రమశాలియైన వాని హస్తబలము వలన (అతని) యోసేపు విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే”.     (ఆది.కా. 49:24).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.