No products in the cart.
నవంబర్ 25 – ప్రాణము ఒక యుద్ధరంగము!
“పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము” (రోమీ. 6:23). “పాపము చేయువాని ప్రాణమే మరణము నొందును” (యెహేజ్కేలు. 18:20).
ఒక మనుష్యుని యొక్క శరీరము నశించిపోయినను నశించక నిత్యా నిత్యముగా నిలుచున్నది అతని యొక్క ప్రాణమే. ప్రాణము అమూల్యమైనది. ఒకడు లోకమంతటిని సంపాదించుకొనిను అతడు తన ప్రాణమును నష్టపరచు కొనినయడల అతనికి లాభము ఏమిటి?
మీయొక్క ప్రాణమును ప్రభువు ప్రేమించుచున్నాడు. ప్రాణమునందు నివసింపవలెనని కోరుచున్నాడు. ఇదిగో, మనుష్యుల మధ్య నివాసముయున్నది (ప్రకటన. 21:3). మీయొక్క ప్రాణమే దేవుని యొక్క ఆలయము (1. కోరింథి. 3:16). మీయొక్క ప్రాణమే ఆయన యొక్క ప్రార్ధన మందిరము. అతి పరిశుద్ధ స్థలము. మహిమగల ఆత్మ, అనగా దేవుని పరిశుద్ధాత్ముడు మీమీద నిలుచుచున్నాడు. (1. పేతురు.4:14). అంత మాత్రమే కాదు, క్రీస్తు, మహిమ నిరీక్షణయై మీలో నివసించుచుయున్నాడు (కొలస్సీ. 1:27).
అయితే సాతాను అట్టి ప్రాణమును తన వైపునకు ఈడ్చుకొనుటకు యుద్ధము చేయుచున్నాడు. దేవునికి విరోధముగా పాపము చేయునట్లు చేసినట్లయితే మీలోనికి వచ్చి నివసించవచ్చును అని సాతాను తలంచుచున్నాడు. పలు రకములైన పాపపు యిఛ్చలను, లోకపుక్షనికమైన సుఖములను చూపించుచున్నాడు. ‘అనుభవించు రాజా అనుభవించు’ అని పిలచుచున్నాడు. పాపము వచ్చినట్లయితే మీకును, దేవునికిని మధ్యయున్న సంబంధము విరవబడును. పాపము ఒక అడ్డుగోడగా మారి, దేవుని యొక్క ముఖమును మరుగు చేయును అను సంగతిని అతడు ఎరుగును.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మీ దోషములే మీకును, మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములే ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు” (యెషయా. 59:1,2).
ప్రాణములో జరుగుచున్న యుద్ధము పాపమునకును, పరిశుద్ధతకును జరుగుచున్న యుద్ధమైయున్నది. సాతాను అసలీలతలను, సినిమాలను, నాటకములను, క్షణికమైన సుఖములను, మత్తు పదార్థములను, యిచ్ఛలను, సోది అడుగుటయు మొదలగు వాటిని దేవుని యొక్క బిడ్డలకు విరోధముగా తీసుకుని వచ్చి వలను వీరుచుచున్నాడు. అయితే ప్రభువు పాపమును సాతాను జయించుటకు తన యొక్క రక్తమును మనకు కుమ్మరించి ఇచ్చియున్నాడు. లేఖన వాక్యములను ఇచ్చియున్నాడు. ప్రార్థన యొక్క ఆత్మను ఇచ్చియున్నాడు.
ఏ ఒక్క మనుష్యుడైనను, తాను ఒక యుద్ధరంగమునందు నిలుచున్నాను అను తలంపు లేకుండా, లోకము యొక్క క్షణికమైన మత్తులోను, అల్లరితో కూడిన ఆటపాటలతోను వ్యర్థముగా సమయమును హరించుచు ప్రార్ధనాలేమితో జీవించుచున్నాడో, అతనిలోనికి సాతాను సులువుగా చొరబడి అతనిని నాశనమునకు తిన్నగా త్రోవ నడిపించును.
బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి, మరులు కొల్పబడినవాడై, శోధింపబడును. మరియు దురాశ గర్భము ధరించి, పాపమును కనగా, పాపము పరిపక్వమై, మరణమును కనును” (యాకోబు. 1:14,15). “పాపము వలన వచ్చు జీతము మరణము” (రోమి. 6:23).
నేటి ధ్యానమునకై: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1. యోహాను. 1:9,7).