No products in the cart.
ఆగస్టు 29 – తొట్రిల్లనియ్యడు!
క్రైస్తవ జీవితము కొండ ఎక్కుటకు సాదృశ్యమైనది. కొనసాగుచు కొండ శిఖరమునకు ఎక్కుచున్నప్పుడు కాళ్ల బలము క్షీణించి తొట్రిల్లుటకు ప్రారంభించుచున్నది. కొనసాగించి ఎక్కుటను విడిచిపెట్టి ఎక్కడైనను కొంతసేపు కూర్చుండి విశ్రాంతి పొందుదుమా అనిపిచును. విశ్రాంతిని కాంక్షించినట్లయితే కొనసాగించి ముందుకు సాగిపోలేము.
అందుచేత దావీదు మనలను బలపరచుటకు కోరుచున్నాడు. ప్రభువు ఎన్నడును మీ కాళ్ళను తొట్రిల్లనియ్యడు అని చెప్పుటను చూడుడి. అవును, మీ యొక్క జీవితమును ప్రభువు తొట్రిల్లనియ్యడు.
పేదరికమే గాని, అప్పుల సమస్యయే గాని కలిగి మీయొక్క జీవితము తొట్రిల్లిపోదు. ఆత్మ సంబంధమైన జీవితము తోట్రిల్లిపోదు.
ఎమ్మాఊరుకి వెళ్లిన శిష్యులు, ఒంటరిగా నడచినట్లుగా భావించిరి. అందుచేత, ప్రభువు వారితో కూడా నడిచెను. త్రోవ అంతయు లేఖన వాక్యములనుగూర్చి వారు మాట్లాడుచు వెళ్ళినప్పుడు, వారి యొక్క అంతరంగము రంగులుకొని మండుటకు ప్రారంభించెను. కాళ్ల నొప్పియు, వేదనయు, అలసటయు అన్నియు మరుగైపోయెను. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమే అగ్నిగా వారిలో రగులుకొని మండెను.
ఈ లోక జీవితమునందు ప్రభువు మీతో కూడా త్రోవయందు నడచుచు వచ్చుచున్నాడు. సందేహపడి తొట్రిల్లిపోకుడి. కలతచెంది సొమ్మసిల్లి ఆగిపోకుడి. మీ కాళ్ళను ఆయన బలపరచి, లేడీ కాళ్లవలె చేసి, ఉన్నతములయందును, ఎత్తయిన స్థలములయందును మిమ్ములను నిలబెట్టును.
దావీదు రాజు సెలవిచ్చుచున్నాడు: “నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండమీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను, తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను; అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవాయందు నమ్మికయుంచెదరు” (కీర్తనలు. 40:2,3).
ఇశ్రాయేలీయులయందు న్యాయాధిపతిగా ఉన్న తెబోరా ఒక స్త్రీయే. అయినను తన్ను బలపరచుచున్న ప్రభువునందు బలము పొంది యుద్ధమునకు వెళ్లి జయము పొందెను. ఆమె యొక్క కాళ్లు తొట్రిల్లలేదు. అందుచేతనే తేబోరా ఉత్సాహముతో, “నా ప్రాణమా నీవు బలవంతులను త్రొక్కితివి” అని నూతన గీతమును పాడెను (న్యాయా. 5:21).
మీయొక్క కాళ్లు తొట్టిల్లదు. బైబులు గ్రంథము సెలవిచ్చుతున్నది: “ప్రభువు తన భక్తుల పాదములను తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలముచేత ఎవడును జయము నొందడు” (1. సమూ. 2:9).
ప్రభువు మీ యొక్క కాళ్లను బలపరిచి వెళ్ళుచున్నాడు, “నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను; అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను” (కీర్తనలు. 91:13,14).
దేవుని బిడ్డలారా, రాళ్లును, ముల్లును, శ్రమలతో నిండిన అరణ్య మార్గమునందు మీయొక్క కాళ్లు నడచినను, లోకమును జయించినవాడు మిమ్ములను తన శక్తిగల హస్తమునందు ఆదుకొనియున్నాడు అను సంగతిని మరచిపోకుడి.
నేటి ధ్యానమునకై: “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైయున్నది” (కీర్తనలు. 119:105).