Appam, Appam - Telugu

జూలై 11 – మనలో పరిశుద్ధాత్ముడు!

“నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను”    (యెహేజ్కేలు.36:27).

మనలో  మహిమగల నిరీక్షణగా క్రీస్తు నివాసము చేయుచున్నాడు. అది మాత్రమేనా? పరిశుద్ధాత్ముడు కూడాను మనలో నివాసము చేయుచున్నాడు. అలాగున పరిశుద్ధాత్ముడు మీలో నివాసము చేయునట్లు ఆయనను అనుగ్రహించెదను అని దేవుడు పాత నిబంధన యొక్క దినములయందే వాగ్దానమును చేసియుండుట ఎంతటి ఆశ్చర్యము!

తండ్రియైన దేవుడు వాగ్దానము చేసిన దానిని అనుగ్రహించినట్లు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అవును, తండ్రియైన దేవుడు మొదటిసారిగా మెస్సయ్యయైయున్న యేసుక్రీస్తును వాగ్దానము చేసెను. ఆ తరువాత యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను మనకు వాగ్దానము చేసెను.

కావున యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు,   “ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి వచ్చుచున్న శక్తిని పొందువరకు పట్టణములో నిలిచియుండుడని”  వారితో చెప్పెను (లూకా. 24:49).

అలాగనే శిష్యులు దేవుని యొక్క వాగ్దానమును విశ్వసించి యెరూషలేము నందుగల మేడ గదిలో కాంక్షతో ఎదురుచూచుచు ప్రార్థించుచున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి పైనను దిగివచ్చెను. ఒక్కొక్కరి లోను నివాసముండెను.

“లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; ఆయన మీతో కూడ నివసించి, మీలో ఉన్నందున, మీరు ఆయనను ఎరుగుదురు”    (యోహాను. 14:17) అని యేసు చెప్పిన మాటలు ఎంతటి వాస్తవమైనది!

పరిశుద్ధాత్మును మనము పొందినప్పుడు ఆయన మనలో నివాసము ఉండుటను దిట్టముగాను స్పష్టముగాను గ్రహించ గలుగుచున్నాము. ఆయన మనయందు ఉండుట చేత, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, న్యాయ తీర్పును గూర్చియు ఖండించి గ్రహింపజేయుచున్నాడు. చిన్న చిన్న పాపములను పరిశుద్ధాత్ముడు గ్రహింపజేసి, చూపించుచున్నందున మనస్సాక్షియైనది మిగుల పదును గలదిగాను అదురు పుట్టించుచున్నది. పాపమునకు కాసంత చోటు ఇచ్చినను పరిశుద్ధాత్మను దుఖఃపరిచియున్నాము అను గ్రహింపు అంతరంగమును వేదనపరచుచున్నది.

అది మాత్రమే కాక, పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నందున  పరిశుద్ధ గ్రంథమును చదువుచున్నప్పుడు లోతైన ప్రత్యక్షత లభించుచున్నది. ప్రార్థించుచున్నప్పుడు విజ్ఞాపన ఆత్మ చేత నింపబడి ప్రార్థించ గలుగుచున్నాము. ప్రసంగించుకున్నప్పుడు ఆయన యొక్క శక్తిని గ్రహించగలుగుచున్నాము. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన గొప్పవాడుగా, మన యొక్క శరీరమును తన యొక్క మహిమగల ఆలయముగా మార్చుచున్నాడు.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది:    “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదనియు, మీరు మీ సొత్తు కారని మీరెరుగరా?”    (1. కొరింథీ. 6:19).     ” మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?”     (1. కోరింథీ. 3:16).

దేవుని బిడ్డలారా, క్రీస్తు కూడా మీలో నివసించుచున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడాను మీలో నివాసము చేయుచున్నాడు. కావున మీరు రెండంతులు ధన్యత గలవారు.

నేటి ధ్యానమునకై: “ఆయన ఇచ్చిన అభిషేకము ….. అది అన్నిటినిగూర్చి మీకు భోధించుచున్నది”     (1. యోహాను.2: 27).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.