No products in the cart.
జూన్ 23 – అదియును, అంతమునైయున్నవాడు!
“అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని… సెలవిచ్చుచున్నాడు” (ప్రకటన.1: 8).
ప్రభువు అదియును అంతమునైయున్నవాడు. ప్రభువు యొక్క నామములయందు ఒకటి ఆదియైన్నవాడు అనుటయైయున్నది. ఆదికాండము మొదటి వచనమునందు, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని బైబిలు గ్రంథము ప్రారంభించుచున్నది (ఆది.కా. 1:1).
యోహాను సువార్త ప్రారంభించుచున్నప్పుడు, “ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవునియొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైయుండెను.
ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” (యోహాను. 1:1-3) అని ప్రారంభించెను.
కీర్తనకారుడు, “ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి; ఆకాశములు కూడ నీ చేతిపనులే” (కీర్తనలు. 102:25). అని చెప్పెను.
గొప్ప కవీశ్వరుడైన తిరువళ్లవరు ఒక క్రైస్తవుడు అనుటను ఆయన రచించిన మొదటి తిరుకురల్ కావ్యమునందు తెలియజేయబడుచున్నది. “అఘర ముదళ ఎళుత్తెళ్ళాం ఆదిభగవన్ ముదట్రే ఉళఘు” అని ఆయన చెప్పుచున్నాడు. ఆయన ఉన్న దినములయందు లెక్కించలేని విగ్రహములును, విగ్రములయొక్క నామములును ప్రసిద్ధిగాంచినవై ఉండి ఉండవచ్చును.
తమిళమునందు కవితను రచించుచున్న ప్రతి ఒక్కరును, ‘దైవ నామ స్తోత్రం’ అను నామమున ఒక విగ్రహము యొక్క నామమును ప్రారంభమునందు వ్రాయుట కలదు. అయితే కవిస్వరుడైన తిరువళ్లువరు, ‘ఆదిభగవన్’ అను యెహోవా దేవుని సూచించెను.
యెహోవా ‘ఆది’ మాత్రము గాక, అంతమును ఆయనే. ఆమేన్ అనువాడును ఆయనే. బైబిలు గ్రంథము యొక్క చివరి భాగము ‘ఆమేన్’ అను మాటతో సమాప్తమగుచున్నది (ప్రకటన. 22:21). ‘ఆది’ అనువాడు. ‘ఆమేన్’ అని సంతకమును పెట్టి ముగించబడునట్లు బైబిలు గ్రంధము ముగించబడుచున్నది. “ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా” అని ప్రకటన.3:14 నందు వచ్చుచున్న వచనము మనలను ఆలోచింప చేయుటతోపాటు ప్రభువును సుతించునట్లు ప్రేరేపించుచున్నది.
సామెతల గ్రంథమునందు 8 ‘వ అధ్యాయము నందుగల ప్రవచనపు వచనములను చూడుడి. “అనాదికాలము మొదలుకొని; మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము, నేను (నియమింప) అభిషేకింపబడితిని. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని” (సామెతలు. 8:23,24). “నేను ఆయన యొద్ద ప్రధానశిల్పినై; అనుదినము సంతోషించుచు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని” (సామెతలు. 8:30,31).
తమిళ భాషను గూర్చి చెప్పుచున్నప్పుడు, “రాళ్లను త్రవ్వి మట్టిని త్రవ్వని కాలమునకు ముందుగానే ఉద్భవించిన ముత్యపుతమిళము” అని చెప్పుదురు. అట్టి ముత్యపు తమిళమునకు, ముందుగా ఆదుర్భవించిన వాడే, మన ప్రభువు. ఆయన యొక్క ప్రారంభము ఎప్పుడు అనుటను ఎవరి వలనను అంచనా వేసి చెప్పలేరు.
జగతుత్పత్తికి ముందుగానే ఆయన ఉన్నవాడు. లోకము నశించిపోయినను నిత్యానిత్యముగా నిలిచియుండువాడు ఆయన మాత్రమే. ఆయనే ఆదియు అంతమునైయున్నవాడు; ఆయనే మనలను సృష్టించినవాడు.
దేవుని బిడ్డలారా, “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును; చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను” (కీర్తనలు. 23:6) అని దావీదుతో కలసి మీరును విశ్వాసపు ఒప్పుకోలు చేయుడి.
నేటి ధ్యానమునకై: “ఆదినుండి (వారిని) మనుష్యులను సృజించినవాడు పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు” (మత్తయి. 19:4).