Appam, Appam - Telugu

ఏప్రిల్ 07 – వృద్ధాప్యపు వయస్సునందు!

“వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము”    (కీర్తనలు. 71:9).”

వృద్ధాప్యపు వయస్సును గూర్చి దావీదు తలంచినప్పుడు, అర్థము కాని చింతయు, భయమును ఆయన యొక్క హృదయమును కబలించి పట్టుకొనెను. అయినను వృద్ధాప్యమును గూచ్చి ఆయన మనస్సు సొమ్మసిల్లిపోక అట్టి చింతను ప్రభువు మీద మోపివేయుటకు తీర్మానించెను.     “వృద్ధాప్యమునందు నన్ను విడనాడకము”  అని ఆసక్తితో ఆయన ప్రార్థించుటను చూడుడి!

ఆస్వాల్ట్స్మిత్ అను దైవ సేవకులను గూర్చి ఎరుగనివారు ఎవరు ఉండరు. ఆయన ప్రభువు కొరకు బలముగా సేవను చేసినవాడు. గొప్ప ఆలయమును కట్టించెను. నిస్తారమైన పుస్తకములను రచించెను. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండెను. ఆ ఇద్దరును ఆయన యొక్క సంఘమునందు గొప్ప బోధకులుగా ఉండెను. ఆయనకు అన్ని వసతులును ఉండెను. సంపత్తు, పేరు ప్రఖ్యాతులు ఉండెను. అయితే, ఆయన యొక్క ఇద్దరు కుమారులు ఆయనను  వృద్ధాప్యపు వయస్సునందు ఆయనను తమతో ఉంచుకొనుటకు ఇష్టము లేక, ఒక వృద్ధాప్యపు ఆశ్రయమునందు చేర్పించిరి. ఆయన అక్కడనే ఉండి తన యొక్క డెభ్భైఏడవ వయస్సునందు మరణించెను.

ఆయన యొక్క హృదయము ఎంతగా బాధపడియుండును అను సంగతిని తలంచి చూడుడి. తన పిల్లలతో కలిసి ఉండుటకు ఎంతగా తాపత్ర్యపడియుండును! మనవళ్లను తీసుకుని ముద్దాడి ఆనందించుటకు ఎంతగా ఆశపడియుండును! అట్టి ఆనందములేక వెనక ముందు తెలియని మిగతా వృద్ధులతో గడుపుట ఎంతటి వేదనకరమైనదై ఉండును! దావీదు వీటినంతటిని తలంచి చూచి,    “వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము”  అని  కన్నీటితో ప్రార్ధించెను.

వృద్ధాప్యపు వయస్సు వచ్చినప్పుడు, మన యొక్క బలము క్షీణించుచున్నది, కంటి చూపు మందగించుచున్నది, సంపాదించలేము. ఇతరులను ఆధారపడి జీవించవలసినదై ఉండును. అట్టి సమయమునుందు మనయొక్క బలహీనతను, దిక్కుమాలిన పరిస్థితిని  అదునుగా తీసుకుని ఎవరైనా మనలను విడనాడినట్లయితే లేక గాయపరచు మాటలను మాట్లాడినట్లయితే మనస్సునందు   సొమ్మసిల్లి పోవుచున్నాము.

మనుష్యులు బహుశా మనలను త్రోసివేసినను. పిల్లలు, బహుశా తృణీకరించినను, మనము కొండవలె నమ్మియున్నవారు మనలను చూచుటకైనను  ఇష్టపడక పక్కకు పోయినను. అయినను ప్రభువు మనలను ఎన్నడును చేయి విడువనే విడువడు. బాల్యము మొదలుకొని మనలను చేయి పట్టుకుని నడిపించినవాడు, వృద్ధాప్యమునందును మనలను చేయు విడువకయుండును. ఇంతవరకు మోసినవాడు ఇకమీదటను మోయును, ఇక మీదటను హక్కున చేర్చుకుని  కాపాడుకొనును.

వృద్ధాప్యమునందును ప్రభువునకు సేవ చేయునట్లు మనము తీర్మానించినట్లయితే, చివరి శ్వాస ఉన్నంతవరకు పరిచర్య చేయునట్లు మనలను బలపరచుటకు ఆయన చాలినవాడు.   “దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము”     (కీర్తనలు. 71:18).

దేవుని బిడ్డలారా, వృద్ధాప్యమునందును ప్రభువు మిమ్ములను జీవింపచేయును. పక్షిరాజు వలె మరల మీయొక్క వయస్సు యవ్వన వయస్సువలె అగును. మీ వయస్సునకు తగినట్లుగా మీయొక్క బలము ఉండును. మీయొక్క బలము క్షీణించుచున్నప్పుడు, ప్రభువు ఎన్నడును మిమ్ములను చేయి విడిచిపెట్టడు.

నేటి ధ్యానమునకై: “నేను బ్రదుకు దినములన్నియు కృపా, క్షేమములే నా వెంట వచ్చును; చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను”     (కీర్తనలు. 23:6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.