Appam, Appam - Telugu

సెప్టెంబర్ 13 – ఉత్సాహపు పిలుపు!

“ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి”    (మార్కు. 10:49) 

భర్తిమయి రెండు రకములైన గుంపు వారిని దర్శించుచున్నాడు. ఒకవైపున  ‘అతనిని గద్దించి ఊరకుండుము’ అని చెప్పుచున్న గుంపు. మరో వైపున,  ‘అతనిని ఉత్సాహపరచి, ధైర్యము తెచ్చుకొనుము, లెమ్ము  క్రీస్తుని వద్దకు రమ్ము’ అని పిలుచుచున్న గుంపు. మీరు కూడాను ఇట్టి రెండు రకములైన గుంప్పువారిని మీయొక్క ఆత్మీయ జీవితమునందు సంధించి ఉండవచ్చును.

ఒక సేవకుడు నూతనముగా పరిచర్యకు వచ్చినప్పుడు, తనకు తెలిసిన కొంతమంది సేవకులు ఆయనను ఉత్సాహపరిచి, సహాయమును చేయుదురు అని ఎదురుచూచెను. అయితే వారు, ఆయన యొక్క మనస్సును కృంగునట్లు చేసి, ఆయనను, ఆయన యొక్క పరిచర్యను బహు భయంకరముగా నలిపివేయుటకు చూచిరి. అదే సమయము నందు ఆయన ఎదురు చూడని కొంతమంది సేవకులైయితే, ఆయనను ప్రేమతో హక్కున చేర్చుకుని ఆయనకు ఆలోచనలు తెలియజేసి ఆయనతో ప్రార్ధించి పరిచర్యయందు ఎదుగునట్లు సహాయపడిరి.

యుద్ధమునందు పరాజయము పొందిన ఒక యువరాజునకు విజయము పొందిన ఆ మహా చక్రవర్తి ఒక నిబంధనను విధించెను.  నీళ్లతో నిండియున్న ఒక గిన్నెను ఒక బిందువు కూడా కింద పడకుండా పట్టుకుని వెళ్లి ఒక మైలు దూరము తర్వాత అక్కడ ఉన్న మహా చక్రవర్తికి ఇచ్చినట్లయితే విడుదల అనేది ఆ నిబంధన. ఆ యువరాజు గిన్నెను తీసుకొని నడుచున్నప్పుడు, ఒకవేళ నీళ్లు నేలపై చిందినట్లయితే అతనిని ఖడ్గముతో నరికి వేయుటకు ఇద్దరు బటులును అతని వెనక నడిచి వెళ్లిరి.

అంత మాత్రమే కాదు, దారిపొడుగూతా ఆ యువరాజును ఉత్సాహపరచున్నట్లు ఒక గుంపును, పరిహాసము చేయునట్లు మరొక గుంపును ఆ చక్రవర్తి నియమించి ఉండెను. అయితే  ఆ యువరాజు, కుడి వైపున గాని, ఎడమవైపున గాని చూడకుండా, ఆ గిన్నెపైనే తన యొక్క పూర్తి ధ్యాస అంతటిని నిలిపి నడిచెను. చివవరకు విడుదలను సంపాదించుకొనెను.

విజయము పొందిన తర్వాత యువరాజు ఇలాగున చెప్పెను:     “నన్ను ఉత్సాహపరచి పొగడుచుండు వారిని గమనించలేదు, నిందించి అమాంతముగా దూషించిన వారిని గమనించలేదు. నా మనస్సంతయు గిన్నెలోని నీళ్లపైనే ఉండెను.మిగుల జాగ్రత్తగా నడిచాను” అని చెప్పెను. అదే విధముగాని మీయొక్క ప్రాణమునందు గమనమును ఉంచి, మీ యొక్క పరుగును విజయవంతముగా పరిగెత్తి ముగించుటయందు మీరు జాగ్రత్తగా గలవారై ఉండవలెను.

అనేకమంది యవ్వన సేవకులు,     ‘అయ్యో, ఇతరులు నన్ను నీచముగా మాట్లాడుచున్నారే, గేలియు, పరిహాసమును చేయుచున్నారే’  అని చెప్పి సొమ్మసిల్లిపోవుచున్నారు. బర్తిమయును  అరవక ఊరకుండుమని అడ్డగించిన గుంపువారు నేడును మీపై రాళ్లను రువ్వవచ్చును. కాయలు కాసే చెట్టునకే  రాళ్ళదెబ్బ అని చెప్పుదురు.

చెట్టు తనపై తగులుచున్న గాయములను లక్ష్యముచేయక, రాళ్లతో కొట్టు వారికి కూడాను మంచి ఫలములను రాల్చి ఇచ్చునట్లుగా, మీరును సత్క్రియల ద్వారా వారిని ఆదాయము చేసుకొనుటకు ప్రయత్నించవలెను.

మీయొక్క అభివృద్ధియందు అక్కర కలిగియున్న వేల కొలది దేవుని బిడ్డలు మిమ్ములను తమ యొక్క ప్రార్ధనల చేత మిమ్ములను ఆదుకొనుచున్నారు అను సంగతిని మరచిపోకుడి. మీకు ఆదరణగా క్రీస్తు నిలబడుచున్నాడు. వేల కొలది పదివేల కొలది దేవదూతలు నిలబడుచున్నారు. లెక్కించలేని సేవకులు నిలబడుచున్నారు కావున సొమ్మసిల్లిపోక ముందుకు కొనసాగుచూ వెళ్లుడి.

నేటి ధ్యానమునకై: 📖”తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి…..కలుగును గాక”.      (యూదా. 1:24,25).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.