bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

జూలై 18 – పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపింపు

“యెహోవా ఆత్మ …..  అతని రేపుటకు మొదలు పెట్టెను”     (న్యాయా. 13:25) 

ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీయుల యొక్క బానిసత్వము నుండి విమోచించుటకై శ్రేష్టమైన పాత్రగా ప్రభువు సంసోనును ఏర్పరచుకొనెను.  సంసోను అట్టి పిలుపును, ఏర్పాటును లక్ష్యము చేయక, నిర్విచారముగా ఉండినప్పుడు పరిశుద్ధాత్ముడు అతనిని ప్రేరేపించుటకు మొదలుపెట్టెను.

ప్రభువు కొరకు శూర కార్యములు చేయునట్లు, నేడును పరిశుద్ధాత్ముడు మిమ్ములను ప్రేరేపించుచూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణను మీ యొక్క జీవితమునందు అనుభవించియున్నారా? మిమ్ములను మీరే నడిపించుకొనక, ప్రభువు యొక్క సంకల్పము చొప్పున మిమ్ములను నడిపించుటకు పరిశుద్ధాత్ముడు అట్టి ప్రేరేపణను దయచేయుచున్నాడు.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది:   “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో, వారందరు దేవుని కుమారులై యుందురు”     (రోమీ. 8:14).

ప్రభువు యొక్క ఆత్ముడు నా జీవితమునందు అత్యధికముగా దయచేయుచున్ళ ఒక ప్రేరేపణ విశ్వాసుల కొరకును, దైవ సేవకుల కొరకును ప్రార్థించుటయైయున్నది. ప్రార్థించుచుండగా కొందరి  ముఖములను నా మనోనేత్రమునకు ముందుగా తీసుకొని వచ్చి నిలబెట్టును.

కొందరి యొక్క పేర్లను కూడా జ్ఞాపకముచేయును. ఇంకా అత్యధికముగా ప్రార్ధించునట్లు పురిగొల్పును. అట్టి ప్రేరేపణ చేత ప్రార్ధనా భారము, ఆత్మల భారము ఏర్పడును. అప్పుడు తగిన మాటలను చెప్పి ప్రార్ధించునట్లుగా విజ్ఞాపన ఆత్మను పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును.

కొందరు విశ్వాసులు దైవాత్ముని యొక్క ప్రేరేపణ చేత బహు బలముగా ప్రార్థించుచున్నప్పుడు, సంఘమంతయును పరిశుద్ధాత్ముని చేత నింపబడుటను చూచియున్నాను.  దేవుని యొక్క అభిషేకము ప్రతి ఒక్క విశ్వాసిని నిండి పొర్లునట్లు చేయును.

ఆలాగునే పరుస్థుతులకు తగినట్లుగా పాటలను పాడుటకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణను దయచేయును.అట్టి పాటలు మీకు మాత్రము గాక, సంఘమంతటికిను భక్తియందు అభివృద్ధి చెందుటకు హేతువైనవిగా మారిపోవును.

అలాగునే మీరు చేయుచున్న ప్రతి ఒక్క ప్రార్థనయు, పాడుచున్న పాటలును, అందించుచున్న దైవ వర్తమానములును పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చొప్పున అమర్చబడియుండి నట్లయితే, అందులో నిశ్చయముగానే గొప్ప ఆత్మల నూర్పిడి ఉండును.  గొప్ప ప్రతిఫలమును మీరు కాంక్షించవచ్చును. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చొప్పున నడుచుటకు మీరు మిమ్ములను సమర్పించుకొనుడి.

ఎల్లప్పుడును మీయొక్క హృదయమును పరిశుద్ధాత్మునితో జతపరచి ఆయన చిత్తము ఏమిటి అను సంగతిని, ఏమి చెప్పుచున్నాడు అను సంగతిని, బహు జాగ్రత్తతో గమనించుటకు ప్రయత్నించుడి. దానికై ఆత్మీయ క్షున్నమైన గ్రహింపు మిగుల అవశ్యము.

కొన్ని సమయములయందు నూతన ఆత్మలను సంధించినట్లు ప్రేరేపణను ఇచ్చును. వైద్యశాలకు వెళ్లి వ్యాధిగ్రస్తులతో మాట్లాడునట్లు ప్రేరేపణను ఇచ్చును.

అలాగునే ప్రభువు మీతో మాట్లాడుచున్నప్పుడు వెనువెంటనే లోబడుడి. తోబడినట్లయితే అత్యధికమైన దేవుని మార్మములను అనుగ్రహించి మిమ్ములను త్రోవ నడిపించును. లోబడకపోయినట్లయితే ఆయన కూడా మిమ్ములను ప్రేరేపింపక నిలిపివేయును.

నేటి ధ్యానమునకై: 📖”మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు”    (మత్తయి. 10:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.