bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

జూలై 09 – ఆత్మమూలముగా జన్మించుట

“శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది”    (యోహాను. 3:6) 

మీరు ఆత్మసంబంధమైన కుటుంబమునందు జన్మించవలెను అని ప్రభువు మిగుల కోరుచున్నాడు. మీరు ఆత్మమూలముగా జన్మించకపోయినట్లయితే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించ లేరు. ఈ లోకమునందు తల్లి యొక్క గర్భమునందు జన్మించుచున్నప్పుడు ఆదాము యొక్క స్వభావములను పొందుకొనియున్నాము. పాపపు స్వభావములను పొందుకొని ఉన్నాము. పాపపు స్వభావములు మనయందు క్రియ చేయుచున్నది.

అయితే మారుమనస్సు పొంది మన యొక్క పాపములను ఒప్పుకొని మరల జన్మించుచున్నప్పుడు, ప్రభువు యొక్క కుటుంబములోనికి వచ్చుచున్నాము. ప్రభువు యొక్క బిడ్డలుగా మారుచున్నాము. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో మస్తమును క్రొత్తవాయెను”     (2. కోరింథీ. 5:17).

అనేకులకు మరల జన్మించుట అంటే ఏమిటి అను సంగతియు, ఆత్మమూలముగా జన్మించుట అంటే ఏమిటి అను సంగతియు తెలియుట లేదు. గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుడైయున్న నికోదేమును చూచి,    “నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా?”     (యోహాను. 3:10) అని యేసు అడిగెను.   “మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువే, గాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో అది నీకు తెలియదు; ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను”    (యోహాను. 3:7,8).

యేసు ఆత్మమూలముగా జన్మించినవాడిని,  ‘గాలితో’ పోల్చి మాట్లాడటను చూచుచున్నాము. గాలిని మనము చూడలేక పోయినను దాని యొక్క కదలికను గ్రహించ గలుగుచున్నాము. గాలి యొక్క పయనము ద్వారానే గ్రహించు కొనుచున్నాము. అది ఎక్కడినుండి బయలుదేరుచున్నది అను సంగతి, ఏ దిశ తట్టునకు వెళుచున్నది అను సంగతి, ఎక్కడంతా వీచుచు తిరిగి వచ్చుచున్నది అను సంగతి మనకు తెలియదు. అయితే గాలియందు ఒక శక్తి ఉన్నది అను సంగతి, గాలి పలు విధాలలో క్రియచేయుచున్నది అను సంగతి మన వల్ల గ్రహించ గలుగుచున్నాము.

పరిశుద్ధాత్మ అనుగాలి పరలోకము నుండి వీచుచున్నది.    “వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను”    (ఆపో.కా. 2:2). పరలోకము నుండి వీచిన ఆ గాలి విశ్వాసుల యొక్క ఆత్మలో వీచిన గాలిగా ఉండెను. అది  వారియందు పునఃజన్మ అను నూతన అనుభవమును తీసుకొని వచ్చెను. ఆనాడు వారు పరిశుద్ధాత్మునిచే నింపబడిరి.

గాలిని మెదడు యొక్క జ్ఞానము చేత గ్రహించు కొనుచున్నట్లు, ఆనాడు శిష్యులు పొందుకొనిన అభిషేకమును వారిని ఆవరించి ఉండుటను లోకస్థులచే గ్రహించుకొనలేకపోయిరి. అయితే శిష్యులు తాము ఉన్నతమైన బలముచేతను, ఉన్నతమైన కృపచేతను నింపబడి ఉండటను గ్రహించుకొనిరి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ  యొక అభిషేకమును మీరు తప్పకుండా పొందుకొనవలెను.

నేటి ధ్యానమునకై: 📖”ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది, మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు యెరూషలేము పట్టణములో నిలచియుండుడని వారితో చెప్పెను”    (లూకా. 24:49).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.