No products in the cart.
మే 18 – ఇహమందును, పరమందును
“ఇహమందు చాలరెట్లును, పరమందు నిత్యజీవమును పొందకపోడు” (లూకా. 18:30)
ఇహమందు కలదు, పరమందు కలదు. లోక ప్రకారమైన ఆశీర్వాదమును కలదు, నిత్యత్వమును గూర్చిన ఆశీర్వాదము కలదు. కొందరు ఇహమునందు ఆశీర్వదింపబడుచున్నారు. కొందరు పరమునందు ఆశీర్వదింపబడుచున్నారు. ఈ వాక్యమైతే ఇహమునకును పరమునకును గల ఆశీర్వాదమును కనబరుచుచున్నది.
ఒక చిన్నవాని వద్ద సబాతు పాఠశాల ఉపాధ్యాయుడు, “నీ యొక్క జీవితమునందు ఎలాగు ఉండవలెను అని నీవు కోరుచున్నావు?” అని అడిగెను. అందుకు ఆ చిన్నవాడు, “అయ్యా, ధనవంతుడు మరియు లాజరు కథ తెలియును కదా? ఇహమందు నేను ఈ ధనవంతుని వలె ఉండుటకు కోరుచున్నాను. పరమునందు లాజరు వలె ఉండుటకు కోరుచున్నాను” అని చెప్పెను.
దావీదు రాజునకు ఇహమును గూర్చిన జ్ఞానమును ఉండెను. పరమను గూర్చిన జ్ఞానమును ఉండెను. నేను జీవించు దినములన్నిటను (ఇహమునందు) “కృపాక్షేమములే నా వెంట వచ్చును; చిరకాలము యెహోవా మందిరములో (పరమునందు) నేను నివాసము చేసెదను” అని చెప్పెను (కీర్తన. 23:6).
ఇహమందును, పరమందును ఆశీర్వదింపబడుటకు యేసు చెప్పిన పద్ధతి ఏమిటో తెలియునా? “దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తలిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును, ఇహమందు చాలరెట్లును, పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను” (లూకా 18:29,30).
ప్రభువు కొరకు హృదయపూర్వకముగా ఇచ్చుచున్నప్పుడు ఇహమునందు నూరు రెట్లుగా ఆశీర్వాదమును పొందుకొనుటతోపాటు, పరలోకము యొక్క లెక్కలోను మీకు ధనము కలిగియుండును. కావున లోకప్రకారముగా ధనమును ఖర్చు పెట్టుటకంటేను ఇహమునకును, పరమునకును అని ప్రభువు యొక్క పరిచర్యయందు పెట్టుబడి పెట్టుడి. ఆత్మల సంపాద్యము నిమిత్తము ఇవ్వుడి.
ఇహమునకును, పరమునకును గల ఆశీర్వాదము, మీరు భూమియందు ప్రభువు యొక్క పరిచర్యను కట్టి లేవనెత్తుటయైయున్నది. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది, “భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును” (మత్తయి. 18:18). “ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును” (1. కోరింథీ. 3:12-14).
“దేవుడు (ఆయన) ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును” (రోమీ. 2: 6,7). దేవుని బిడ్డలారా, “మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు”. (2.థెస్స.3:13).
నేటి ధ్యానమునకై: 📖”కాబట్టి, గొప్ప బహుమానముగా దానికి ప్రతిఫలము కలుగును మీ ధైర్యమును విడిచిపెట్టకుడి;” (హెబ్రీ. 10:35).