No products in the cart.
ఏప్రిల్ 25 – దేవునిపై కోపము
“దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను” (యోనా. 4:9)
ప్రభువుపై యోనాకు కోపము కలిగెను. ఈ కోపము నుండి ఆయన మరులుగొన కొనలేకపోయెను. ప్రభువు యోనాను ప్రేమించి అతని యొక్క కోపమును మరులు గొలుపుటకై సొర చెట్టును మొలకెత్తుటకు ఆజ్ఞాపించెను. మరియు, యోనాను ప్రేమతో వెదకి వచ్చి, “యోనా నీవు కోపించుట న్యాయమా?” అని అడిగెను.
ఎందుకని యోనా తన కోపము నుండి మరులుగొనలేక పోయెను? తన యొక్క ప్రవచనము నెరవేర్చబడక పోవుటయే దానికి గల కారణము. ప్రభువు నీనెవె ప్రజలకు కనికరమును చూపించెను. ప్రభువు కనికరమును, జాలియు, దీర్ఘశాంతమును, అత్యంత కృప గలవాడై ఉండుటచేత, నీనెవె ప్రజలు గొనె పట్ట ధరించి బూడిదలో కూర్చుండుటను చూసిన వెంటనే వారిని క్షమించెను.
ప్రభువు సొర చెట్టు ద్వారా యోనాతో మాట్లాడెను. “నీవు కష్టపడకుండను, పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి, ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీవు విచార పడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువైయున్న, కుడి యెడమలు ఎరుగని జనమును, బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను” (యోనా. 4:10,11).
పలు సమయములయందు, మనము దేవుని యొక్క అనంత జ్ఞానమును, మార్గములను అర్థము చేసు కొనలేక పోవుట చేతనే, ప్రభువు వద్ద పలు ప్రశ్నలను అడుగుచున్నాము. దేవునికి విరోధముగా సణుగుటయును చేయుచున్నాము. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది, “రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును; బయలుపరచబడినవి, యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగును” (ద్వితి. 29:29).
నేడు కూడాను, ‘ఎందుకని నా యొక్క కుటుంబమునందు కష్టము? ఎందుకని మంచి ఉద్యోగము దొరకలేదు? ప్రభువు ఎందుకని నా బిడ్డలను తీసుకొనెను? అని పలు ప్రశ్నలు మీయొక్క హృదయమునందు లేవవచ్చును.
అయితే, నియమింపబడ్డ సమయమునందు మీరు పరలోకమునకు వెళుతున్నప్పుడు, మహా గొప్ప ప్రేమగల దేవుడు సమస్తమును మీ యొక్క మేలుకై హేతువగునట్లు చేయుచు వచ్చెను అను సంగతిని స్పష్టముగా తెలుసుకుందురు. బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది, “దేవుని ప్రేమించువారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి” (రోమీ. 8:28).
అనేక అంశములు మీ యొక్క స్వల్ప జ్ఞానమునకు అందనివై ఉండుటచేత, ప్రభువు యొక్క మార్గములను అర్థము చేసుకొనలేక విభ్రాంతి చెందుచున్నారు, సణుగుకొనుచున్నారు, కోపగించుకొనుచున్నారు. అయితే ప్రభువు యొక్క పాదములయందు కూర్చుండి, ప్రార్థించి, ధ్యానించినట్లయితే, గూఢమైన రహస్యములను బయలుపరచువాడు తన యొక్క సత్యమును మీకు బయలుపరచును.
దేవుని బిడ్డలారా, దేవునికి విరోధముగా మీయొక్క హృదయమునందు కోపము కలిగి, దిన దినమునకు ఘట సర్పమువలె పెరిగి, ఆయన మీకు అనుగ్రహించియున్న మేళులను దిగమింగి వేయుటకు చోటును ఇవ్వకుడి.
నేటి ధ్యానమునకై: 📖”ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును” (1. కొరింథి. 13:12).