Appam, Appam - Telugu

మార్చి 27 – విజయమును, పరిశుద్ధాత్ముడును!

“దానియేలు అతిశ్రేష్ఠమైన (బుద్ధి) ఆత్మగలవాడై …  నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను”  ‌‌  (దానియేలు. 6:3) 

మీ యొక్క జీవితము విజయవంతముగా ఉండవలెనా?  విజయమును ఇచ్చు పరిశుద్ధాత్ముని పొందుకొనుడి. పొందుకొనిన ఆత్మను రగిలించి మండించుడి. ఆత్మ వరములు మీయందు బహు బలముగా క్రియచేయుటకు మిమ్ములను సమర్పించుకొనుడి. దానియేలు పరిశుద్ధాత్మునిచే నడిపించబడిన జీవితమును జీవించెను. తద్వారా రాజ్యమంతటికిని అధికారిగా హెచ్చింపబడెను.

దానియేలును గూర్చి రాజుగారి యొక్క తల్లి చెప్పిన సాక్ష్యము ఏమిటి?    “నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట ….. ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక, ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును”     (దానియేలు. 5:11,12) అనుటయే ఆ సాక్ష్యము.

పాత నిబంధన కాలమునందు పరిశుద్ధ ఆత్మునిచే నింపబడి యున్నవారిని కనుగొనుట మిగుల అరుదైయుండెను. అయితే మన యొక్క కాలము, పరిశుద్ధాత్ముని యొక్క కాలము. కడవరి వర్షము యొక్క కాలము. సర్వ శరీరులపైన ప్రభువు తన యొక్క అభిషేకమును కుమ్మరించుచున్న కాలము. తొమ్మిది ఆత్మీయ వరములను, శక్తులను జరిగింప బడుచున్న కాలము. మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలంటే మీ యొక్క అంతరంగమును యేసుని రక్తముచేత కడిగి, దేవుని ఎదుట దప్పికతో ఎత్తి పట్టుకొనుడి.

ఒక్కడు దప్పిక గొనిన యెడల నా యొద్దకు వచ్చి, దప్పిక తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో,  వాని కడుపులోనుండి జీవజల నదులు పారునని, పరిశుద్ధాత్ముని గూర్చి యేసు సెలవిచ్చెను. ఆయనను మీరు పొందుకొనుచున్నప్పుడు, ఆయన తానే ఆదరణకర్తగా మీయందు నివసించును. సర్వ సత్యములోనికి మిమ్ములను బోధించి నడిపించును. ఆలోచనను చెప్పి విజయపు మార్గమును చూపించును. పరిశుద్ధాత్ముడు విజయము నిచ్చు ఆత్ముడైయున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “ప్రవాహ జలమువలె (ఆయన) శత్రువు వచ్చుచున్నప్పుడు, ప్రభువు యొక్క ఆత్ముడు అతనికి విరోధముగా ధ్వజమును ఎత్తును”    (యెషయా.59:19).

మీ యొక్క జీవితమునందు మీ ఎదుట రెండు అంశములు ఉంచబడియున్నది. ఒకటి, పాపపు క్షణికమైన సుఖములను అనుభవించుటను ఎంచుకొనుట. మరొకటి యేసుని రక్తముచేత కడుగబడి,  పరిశుద్ధ ఆత్మునిచేత నింపబడియున్న జీవితమును ఎంచుకొనుట. ఒక మనుష్యుడు ఎట్టి స్థితియందు జీవించుచున్నాడో, అట్టిస్థితియే అతడు మరణించుచున్నప్పుడు అతనితో ఉండును.  బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “పాపుల యొక్క యెముకలలో వారి యొక్క యౌవన కాలపు పాపముతో(బలము) నిండియుండునుగాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును”    (యోబు. 20:11). అదే సమయమునందు, పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధముగా జీవించినట్లయితే,  పరమునుండి ఆయన మీ యెముకలమీదికి అగ్ని (ప్రయోగించి) పంపించియున్నాడు (విలాప. 1:13).  దేవుని బిడ్డలారా, పరలోకపు అగ్నిచే నింపబడియుండుడి.  విజయవంతమైన జీవితమును జీవించుటకు అదియే మార్గము.

నేటి ధ్యానమునకై: 📖”యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మయు, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మయు, తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మయు అతనిమీద నిలుచును”    (యెషయా.  11:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.