No products in the cart.
ఫిబ్రవరి 18 – జ్ఞానమునందుగల ప్రీతికరము!
“జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము; నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించుము” (సామెతలు. 4:5,6)
జ్ఞానియైయున్న సొలోమోను రాజు, యవ్వన వయస్సునందు ఉన్నప్పుడు ఆయన యొక్క యహృదయము ప్రభువుతో ఏకమైయుండెను. దేవునికి ప్రీతికరమైనది చేయుటకు ఆయన మిగుల కోరుకునెను. ప్రభువునకై ఒక ఆలయమును కట్టినట్లయితే ప్రభువు అట్టి ఆలయమునందు నివాసము చేయును అనుటయును, ప్రభువు యొక్క ఇష్టమంతయు ఆయనపై ఉండును అటయును సొలోమోను ఎరిగియుండెను. కావున, “నా దేవుడైన ప్రభువు గొప్పవాడు, నేను ఆయనకు కట్టబోవుచున్న ఆలయము గొప్పదైయుండును” అని చెప్పి ప్రభువునకై మహిమగల ఆలయమును కట్టి నిర్మించెను.
ఆలయ ప్రతిష్ట అయినప్పుడు వేవేల కొలది దహన బలులను ప్రభవునకు చెల్లించి ప్రభువు యొక్క హృదయమును ఆనందింపజేసెను. ప్రభువు కూడా సలోమోనుపై మిగుల ప్రీతి గలవాడై ఉండెను. కావున తన యొక్క మహిమగల ప్రసన్నతతో ప్రతిష్ట చేయబడిన ఆలయమునందు వచ్చి దిగి, ఆ ఆలయమును తన యొక్క మహిమచేత నింపెను. అంత మాత్రమే కాదు, “ఈ స్థలమునందు చేయబడుచున్న ప్రార్థనలన్నిటికి నా కనులు తెరవబడుయు, నా చెవులు ఆలకించుచూనే ఉండును” అని వాగ్దానము చేసియున్నాడు.
సోలోమోను యొక్క హృదయము దేవుని యొక్క హృదయముతో ఏకమై ఎల్లప్పుడును దేవుని ప్రియపరచుట వలన ప్రభువు సొలోమోనునకు అమితమైన జ్ఞానమును దయచేసెను. బుద్ధిని వివేకమును ప్రభువు ఇంతవరకు లోకమునందు పుట్టియున్న ఏ ఒక్కరికిని లేని శ్రేష్టమైన వివేకము సొలోమోనకు ఉండెను. ప్రభువు దయచేసిన అట్టి శ్రేష్టమైన జ్ఞానముచేత ఆయన సామెతలను, ప్రసంగి, పరమగీతములు మొదలగు గ్రంథములన్నిటిని వ్రాసెను. ప్రభువునకు ఇష్టులుగా నడుచుకొనునట్లు పలు రహస్యములను ఆయన బయలు పరిచియున్నాడు. ఇప్పుడు సొలోమోను రాజు తన అనుభవము నుండి ఏవేవి ప్రభువునకు ఇష్టమైనవి అని చెప్పుచున్నాడు అనుటను చూచెదము.
- “దొంగత్రాసు యెహోవాకు హేయము; సరియైన గుండు ఆయనకిష్టము” (సామెతలు. 11:1). వ్యాపారస్థులు వ్యాపారమందు అత్యధికముగా సంపాదించవలను అను గురితో కల్తి చేయుటయును, దొంగ త్రాసు వాడుటయును, అదనపు ధరకు అమ్ముటయును చూడగలము. అయితే ప్రభువు, సరియైయిన గుండును ఉంచి నిజమైన వ్యాపారమును చేయుచున్న వారిపైనే ఇష్టమును కలిగియుండును.
- “అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు; సత్యవర్తనులు ఆయనకిష్టులు” (సామెతలు. 12:22). “అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడుదురు” అని ప్రకటన గ్రంథమునందు మనము చదువుచున్నాము. అయితే సత్య ప్రవర్తన కలిగి జీవించువారిపై ప్రభువు ఇష్టుడైయుండును!
- “భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయమైనది; యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టమైనది” (సామెతలు. 15:8). దేవుని బిడ్డలారా, మిమ్ములను దేవుని సముఖమునందు విరిగినలిగిన సజీవ బలిగా అర్పించుకొని ప్రార్థించుటకు సమర్పించుకొనుడి. ప్రభువు మీపై ఇష్టుడైయుండును.
నేటి ధ్యానమునకై: “నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు; యథార్థవాదులు వారికి ప్రియులు” (సామెతలు. 16:13).