Appam, Appam - Telugu

జనవరి 07 – క్రొత్త హృదయము!

“యెహోవా యొక్క ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రవర్చనమును చెప్పుచుండగా, నీవు క్రొత్త మనుష్యుడవ్వుదువు.  అతడు సమూయేలు నొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త హృదయమును అనుగ్రహించెను”   (1. సమూ.  10:6,9)

ప్రభువు సౌలునకు వేరొక హృదయమును అనుగ్రహించెను. అది క్రొత్త హృదయము. అది గొప్ప ఔన్నత్యము గల హృదయము.   “ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల అతడు నూతన సృష్టియైయున్నాడు. పాతవి గతించి పోయెను, సమస్తమును నూతన మాయెను” అనుట ఎంతటి వాస్తవమైన మాట! ప్రభువు మీకును ఈ నూతన సంవత్సరమునందు ఒక నూతన హృదయమును దయచేయును.

గాడిద వెనక నడిచిన సౌలును ప్రభువు కొత్త మనిషిగా మార్చుటకు కోరుకునెను. క్రొత్త బాధ్యతలను ఇచ్చుటకు సంకల్పించెను. అతనికి క్రొత్త ఔన్నత్యములను ఇచ్చుటకు సంకల్పించెను. సౌలును ఇశ్రాయేలీయులపై రాజుగా అభిషేకించెను. ఇది ఎంతటి గొప్ప హెచ్చింపైయుండెను!  దానికై సౌలునకు ఒక క్రొత్త హృదయము అవసరమైయుండెను.

ఇరవైయవ శతాబ్దమునందు, సరిగ్గా పనిచేయని హృదయమును శస్త్రచికిత్సను చేసి తీసివేసి క్రొత్త హృదయమును అమర్చే చికిత్సా విధానమును మొట్టమొదటిసారిగా దక్షిణ ఆఫ్రికాకి చెందిన, డాక్టర్ క్రిస్టియాన్ ఫెర్నాడ్ అనువారు లోకమునకు పరిచయము చేసి క్రొత్త సాధనను సృష్టించెను. దీని ద్వారా వైద్యరంగమునందే అతి గొప్ప మార్పులు కలుగజేసుకొనెను.

అయితే వైద్యుల ద్వారా అమర్చబడేటువంటి కొత్త హృదయము ఒకరి యొక్క జీవిత దినములను కొన్ని దినములకు గాని, కొన్ని మాసములకు గాని, కొన్ని సంవత్సరములకు గాని పొడిగించబడుటకు మాత్రమే సహాయపడును. అయితే, వైద్యుల అందరికంటేను గొప్పవాడైయున్న ప్రభువు, మీకు ఒక క్రొత్త హృదయమును దయచేయుచున్నప్పుడు, అది ఎంతటి ఔన్నత్యము గలదిగాను, ఎంతటి మహిమగలదిగాను ఉండును! ఎంతటి హెచ్చింపుగలదై ఉండును!

పాపము చేత అలసిపొయి, వ్యాధిగ్రస్తమైన తన హృదయమును మార్చునట్లు దావీదు రాజు ఆసక్తితో ప్రార్ధించెను.   “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము”  అని దావీదు బతిమిలాడెను  (కీర్తన. 51:10).

సొమ్మసిల్లిపోయిన హృదయమును, బద్దలైపోయిన హృదయమును తీసివేసి ప్రభువు మీకు ఒక నూతన హృదయమును ఇచ్చుచున్నాడు.  అట్టి క్రొత్త హృదయమునందు దైవీక సమాధానమును, దేవుని ప్రసన్నతయు వచ్చున్నది.  క్రొత్త హృదయమును దేవుని యొక్క కృపయు, మహిమయు నింపుచున్నది. అట్టి క్రొత్త హృదయముచేత మీయొక్క జీవితమే  క్రొత్తగా మారుచున్నది.

మీరు ప్రాచీన హృదయమును తీసివేయుడి. దుష్ట తలంపులను తొలగించివేయుడి. పాపము చేత మలినపరచబడిన హృదయమును మీ నుండి తొలగించునట్లు ప్రభుని వద్ద గోజాడుడి. యేసుక్రీస్తు యొక్క రక్తపు బొట్టులు మీయొక్క హృదయములో పడుచున్నప్పుడు అది డాగు ముడత మొదలగు వాటిని పరిపూర్ణముగా తొలగించి నూతన హృదయముగా మార్చుటకు శక్తి గలది. అప్పుడు క్రీస్తు యేసునందుగల తలంపు మీయందును ఉండును

దేవుని బిడ్డలారా, కొత్త హృదయము మీయందు రూపించబడవలెను.

 నేటి ధ్యానమునకై: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?”    (యిర్మియా. 17:9).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.