bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

డిసెంబర్ 21 – అంశము:- “యేసుని నామము!”

“ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట, వీనికి ఈ పూర్ణస్వస్థతను కలుగజేసెను”    (అపో.కా. 3:16) 

“పూర్ణ స్వస్థత” అను పదమును కొద్దిగా ఆలోచించి చూడుడి. ప్రభువు యొక్క నామమును పేతురు ఉపయోగించు చున్నప్పుడు, పుట్టి కుంటివాడు స్వస్థతను పొందుకొనెను. అది సంపూర్ణమైన స్వస్థత. ఎట్టి కొదువయు లేని మెండైన స్వస్థత అది పూర్ణ స్వస్థత.

ఎట్టి మందుల వలన గాని, ఎట్టి వైద్యుల వలన గాని పూర్ణ స్వస్థతను ఇవ్వలేరు. కొన్ని మందులు వ్యాధులబారి నుండి రవంత విడుదలను ఇచ్చునట్లు కనబడినను, వాటి యొక్క ప్రభావమువలన పలు రకాల బలహీనతలు వచ్చుచున్నాయి. అయితే, పూర్తిగా సంపూర్ణమైన పూర్ణ స్వస్థతను ఒక మనుష్యునికి ఇవ్వగలదు అంటే, అది యేసు క్రీస్తుని వలన మాత్రమే అగును.

ఈ వచనమును మరల చదివి చూడుడి.   “ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను”.  అవును యేసుని నామము వలన విశ్వాసము వచ్చుచున్నది. అట్టి విశ్వాసము పూర్ణ స్వస్థతను తీసుకొని వచ్చుచున్నది. పేతురు సెలవిచ్చుచున్నాడు,   “వెండి బంగారములు నాయొద్ద లేవు గాని;  నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడువుము”    (అపో.కా. 3:6).

“నాయందు ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నామము యేసుక్రీస్తు. ఆయనను యెరిగేటువంటి జ్ఞానమే గాక మరి ఎట్టి జ్ఞానమును నాకు లేదు. నేను అంత గొప్పగా విద్యను అభ్యసించిన వాడను కాను. నా వద్ద లోకపు జ్ఞానమే గాని, వైద్య జ్ఞానమే గాని లేదు. అయితే, అన్ని నామముల కంటే అత్యున్నతమైన నామమును కలిగినవాడు నా వద్ద ఉన్నాడు.  కావున, ఆయన నామమునందు నీవు లేచి నడువుము” అనుటయే పేతురు చెప్పిన దానికి గల భావము.

చూడండి, ప్రతి ఒక్క రోగమునకు ఒక పేరు కలదు.   “ఎయిడ్స్ అను రోగము ఎంతటి ఘోరమైనది అనుటయును, అది ఒక్క ప్రాణహాంతకమైనది అనుటయును ఎరుగుదుము.  ‘క్యాన్సర్’  అనుట ఒక రోగము యొక్క పేరు.  ‘ఆస్తమా’ (ఆయాసము) ఒక రోగము యొక్క పేరు. అయితే, యేసుని పావన నామము ఇట్టి వ్యాధుల యొక్క బలమునంతటిని తొలగించి, పూర్ణ స్వస్థతను ఇచ్చేటువంటి శక్తిగల నామమైయున్నది. ఇది శత్రువు యొక్క బలమునంతటిని అధముచేయు నామమైయున్నది.

“యేసుని నామమునందు,  పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును  వంగునట్లును, ప్రతివాని నాలుకయు ఆయనను ప్రభువు అని ఒప్పుకొనును”.   రోగములు గాని, వ్యాధులు గాని పాతాళమునుండియు, దయ్యముల వద్దనుండియు, వ్యాధి క్రిముల వద్దనుండియు వచ్చినను, ప్రభువు వాటినంతటిని అధము చేయుటకు శక్తి గలవాడై యున్నాడు.

ప్రభువు యొక్క నామము సమస్త రోగములను బలహీనతలను అధిక మించేటువంటి శక్తి గలది. ప్రభువు యొక్క నామమునందు అధికారమును, ఏలుబడియు కలదు. ప్రభువు యొక్క నామమునందు స్వస్థత కలదు. దేవుని బిడ్డలారా, ప్రభువుని వద్ద “ఇప్పుడే నన్ను స్వస్థపరచుము” అని ప్రార్థించి స్వస్థతను పొందుకొనుడి.

నేటి ధ్యానమునకై: 📖”నా నామమున …. రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురు”    (మార్కు.16:17,18).

  

Leave A Comment

Your Comment
All comments are held for moderation.