No products in the cart.
నవంబర్ 29 – మొలలోతు అనుభవము!
“ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి, నీళ్లగుండ నన్ను నడిపింపగా; అక్కడ నీళ్లు మొల లోతుండెను” (యెహేజ్కేలు. 47:4)
“మొలలోతు” అనుట నడుమును కట్టుటను గూర్చియు, పరిచర్య చేయుటను గూర్చియు, దీనత్వము కలిగి ఆసక్తితో సేవను చేయుటను సూచించుచున్నది. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి అని యేసు సెలవిచ్చెను (లూకా.12: 35). పరిచర్యను చేయుటకు ఎల్లప్పుడును మీయొక్క నడుములు కట్టబడినదై ఉండవలెను.
గ్రామమునందుగల మత్స్యపు వ్యాపారులను చూచియున్నాను. వారు మత్స్యములను రెండు బుట్టలలో నింపుకొని రెండు బుట్టలకును అడ్డముగా ఒక కర్రను కలిపి, ఆ కర్రకును తమ భుజములపై మోస్తూ వేగముగా నడిచెదరు. 15 మైళ్ళు, 20 మైళ్ళు మోసుకొని వెళ్ళుచ్చు దూరమునందుగల ఊర్లలో విక్రయించెదరు. వారు బయలుదేరుటకు ముందుగా ఏమి చేయుదురు తెలియునా? ఒక తుండు గుడ్డను తీసుకుని తమ నడుమునకు బిర్రుగా కట్టుకొనెదరు. ఊపిరిని బిగబెట్టుకొని తమ భుజములపై ఆ బరువును ఎత్తి పెట్టుకొని బహువేగముగా నడిచెదరు.
ఎందుకని అలాగున తమ నడుమునకు కట్టుకొని నడిచెదరు? అది మానసిక స్థిరత్వమును, దృఢమైన మానసిక తీర్మానమును సూచించుచున్నది. ఇక్కడ ఎత్తుకునేటువంటి ఆ బరువును ఆయా స్థలములకు తీసుకుని వెళ్లి చేర్చేంతవరకును నా నడకను పరుగునందును, తడబడనే తడబడును అనేటువంటి స్థిరత్వమును సూచించుచున్నది.
అపోస్తులుడైన పౌలు, పరిచర్యకై తన నడుమును కట్టుకొని వెళ్లుచున్నాడు. ఆయన సెలవిచ్చుచున్నాడు, “అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను” (ఫిలిప్పీ. 3:14).
ప్రభువు పరిచర్యను చేయునట్లు ఈ భూమి మీదకి దిగివచ్చెను. అట్టి పరిచర్యయందు మీరును ఆయనతో కూడా కలిసి ఆత్మలను నరకపు పట్టునుండియు, పాపము యొక్క బలమునుండియు విడిపించ వలెనని ఎదురుచూచుచున్నాడు. కావున చీళ్ళమండలము, మోకాళ్ల అనుభవము నుండి మొలలోతునకు తీర్మానముతోను, ప్రతిష్టతోను దిగి రండి. పూర్ణ బలముతోను పరిచర్యను చేయుటకు నేడు మిమ్ములను సమర్పించుకొనుడి. మొలలోతు నీళ్ల లోతునకు దిగి రావలెను అంటే, మంచి తీర్మానముతో మీయొక్క నడుమును కట్టుకొనవలెను. మీ యొక్క మనస్సు అను నడుము కట్టబడుచున్నప్పుడు, సత్యమను దట్టిచే మీయొక్క మనస్సును నడుము కట్టబడియుండును అని అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు (ఎఫ్ఫెసి. 6:14).
యేసు క్రీస్తును గూర్చి, ఆసక్తికరమైన ఒక సంభవము యోహాను సువార్త 13:15 ‘వ వచనమునందు మనము చదువ వచ్చును. ఆయన తన యొక్క నడుమునకు ఒక తుండు గుడ్డను కట్టుకొని, శిష్యుల యొక్క పాదములన్నిటిని కడుగుటకు మొదలుపెట్టెను. మహిమగల రాజు ఎంతగా తన్నుతాను తగ్గించుకుని పరిచారకునివలె కనబరుచుకొనెను అను సంగతిని ధ్యానించి చూడుడి. దేవుని బిడ్డలారా, అట్టి త్యాగము మీయొక్క హృదయమును పురిగొల్పును గాక.
నేటి ధ్యానమునకై: 📖”ప్రభువు యొక్క ఆత్ముడు నామీద ఉన్నాడు; బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను” (లూకా. 4:18).
