No products in the cart.
జూలై 12 – ఆత్మసంబంధమైన వాడు
“ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింపబడడు” (1.కోరింథీ. 2:15)
బైబిలు గ్రంధము దేవుని యొక్క బిడ్డలను ఆత్మ సంబంధులు మరియు శరీర సంబంధులు అని రెండు రకములుగా విభజించుచున్నది. ఆత్మ సంబంధుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేతను, నడిపింపు చేతను ముందుకు కొనసాగుచున్నాడు. అయితే శరీర సంబంధుడు, తనయొక్క మనస్సును, శరీరమును ఆశించుటను చేయుటకు ప్రయత్నించి పడిపోవుచున్నాడు.
ఆత్మ సంబంధమైనవాడు అన్నిటిని పరిశీలించి నిదానించి జరిగించును అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. అవును, అతడు సమస్తమును చక్కగా ఆలోచించి జరిగించును; అతడు తొందరపడి ఇష్టము వచ్చినట్లు అశ్రద్ధగా ఎన్నడను జరిగించడు. ప్రార్థనతో ప్రభువు వద్ద విచారించి ప్రభువునకు ప్రీతికరమైన అంశమేనా, ప్రభువునకు చిత్తమైనదేనా, ప్రభువు నేను తీసుకొనుచున్న తీర్మాణములను సంతోషముగా అంగీకరించునా అను సంగతి నంతటిని ఆలోచించి జరిగించువాడు.
పేతురు యొక్క జీవితమును చూడుడి. యవ్వనస్తుడై ఉన్నప్పుడు అతడు తన యొక్క ఇష్టము వచ్చినట్లు శరీర కార్యములను జరిగించెను. ముసలివాడైనప్పుడు జీవితమును పరిశుద్ధాత్మునిచే నడిపించబడుటకు సమర్పించుకొనెను. యేసు పేతురుని చూచి, “నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని, నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు; వేరొకడు నీ నడుము కట్టి, నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను” (యోహాను. 21:18).
మీరు పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపునకు మిమ్ములను పరిపూర్ణముగా సమర్పించుకుందురా? ప్రతి ఒక్క తీర్మానమును తీయుచున్నప్పుడు ఆ తీర్మానము దేవుని వాక్యానుసారముగా ఉన్నదా అనుటను ఆలోచించి చూడుడి. ఒక్క నిమిషమైనను ప్రభుని వద్ద దాని గూర్చి విచారించి ప్రభువునకు అది ప్రీతికరమైనదేనా అనుటను దృఢ నిశ్చయము చేసుకొనుడి.
దావీదు రాజు యొక్క అనుభవమును చూడుడి. ఆయన దేవుని సముఖమునందు తన్ను తాను తగ్గించుకొని నిదానించి చూచుకొనెను. “దేవా, నన్ను పరిశోధించి, నా హృదయమును తెలిసుకొనుము; నన్ను పరీక్షించి, నా ఆలోచనలను తెలిసుకొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో అని చూచి, నిత్యమార్గమున నన్ను నడిపింపుము” (కీర్తన. 139:23,24) అని ప్రార్ధించెను.
దేవుని బిడ్డలారా, నిదానముగా ఆలోచించుడి, నిదానముగా మాట్లాడుడి, నిదానముగా ప్రయాసపరుడుడి, నిదానముగా నడువుడి, ప్రభువు యొక్క మాటలను ఉపదేశించుచున్నప్పుడు, సత్య వచనములను ధ్యానించుచున్నప్పుడు, నిదానముతో చేయుడి. లోకము మిమ్ములను చూచుచున్నప్పుడు, శరీర సంబంధులుగా కాక, ఆత్మ సంబంధులుగా చూడవలెను. అనవసరమైన వ్యవహారములయందు తొందరపడి తలను దూర్చి పరాజయము పాలుకాకుడి. నిధానించి జరిగించుచు ఎల్లప్పుడును విజయమును పొందువారై కనబడుడి.
నేటి ధ్యానమునకై: “బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచున్నావు; నీ వెవని యందును మోమోటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము” (లూకా. 20:21).