situs toto musimtogel toto slot musimtogel link musimtogel daftar musimtogel masuk musimtogel login musimtogel toto
Appam - Telugu

జూలై 04 – దప్పిగొనినవాడు

“ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము”   (ప్రకటన.22: 17).”

బైబిలు గ్రంధమునందు చివరి పుస్తకమైయున్న ప్రకటన గ్రంథము యొక్క చివరి అధ్యాయము నందు ఒక పిలుపు ప్రేమతో ఇవ్వబడియున్నది. ఆత్మయు పెండ్లికుమార్తెయు  “రమ్ము, రమ్ము” అని ప్రేమతో ఆహ్వానించుచున్నారు. అవును తెరవబడియున్న పరలోకము నుండి పాత నిబంధన పరిశుద్ధులును, కొత్త నిబంధన పరిశుద్ధులును, నాలుగు జీవులును, ఇరువది నలుగురు పెద్దలును, కోట్ల కొలది దేవదూతలును మనలను రమ్మని ప్రేమతో ఆహ్వానించుచున్నారు. తండ్రి చేత ఆశీర్వదింప బడినవారలారా, నిత్య సంతోషములోనికి రండి అని ఆహ్వానించుచున్నారు.

బైబిలు గ్రంధము ఇలాగునే ఒక చక్కటి శ్రేష్టమైన పిలుపుతో కూడా ముగించబడుట ఎంతటి ధన్యకరమైనది!  ఆదికాండము పుస్తకమునకును ప్రకటన గ్రంథము పుస్తకమునకును మధ్య ఎంతటి గొప్ప వ్యత్యాసము! ఆదామును, అవ్వయు పాపము చేసినప్పుడు, ఏదేను తోటలో నుండి వెళ్ళుడి అని తరుమగొట్టబడిరి. దేవునితోగల సహవాసమును కోల్పోయిరి. ఖడ్గ జ్వాలలు అక్కడికి రావద్దు అని హెచ్చరించెను. దేవుని యొక్క మహిమను కోల్పోయిరి. “పొమ్ము” అని ప్రారంభించబడిన మనిష్యుని యొక్క విషాద చరిత్ర అనేది ప్రకటన గ్రంథమునందు “రమ్ము” అను ఆనందముతో కూడిన ఆహ్వానముతో  ముగించ బడుటకు గల కారణము ఏమిటి?

దేవుని యొక్క సహవాసము నుండి తరుమగొట్టబడిన మనుష్యునికి మరల ఆ సహవాసమును ఇచ్చుటకు యేసుక్రీస్తు భూమికి వచ్చెను.   “ప్రయాసపడి  భారము మోసికొనుచున్న! సమస్త జనులారా, నా యొద్దకు రండి”. ‌‌  (మత్తయి. 11.28)  అని ప్రేమగల ఆహ్వానమును ఇచ్చెను. నా యొద్దకు రండి అవతలకు నెట్టి వేయను అని వాక్కును ఇచ్చుచున్నాడు. సిలువలో కొట్టబడిన స్థితియుందును రండి అని పిలచి పరామర్శించునట్లు తన యొక్క రెండు హస్తములను చాపినట్లు గానే జీవమును సమర్పించెను. అందుచేతనే పరలోకమంతయు,  ‘ఆత్మయు పెండ్లి కుమార్తెయును రామ్ము అని పిలుచుచున్నది.

పరలోకము ఎవరిని రమ్ము  అని పిలుచుచున్నది?  ప్రభువును ఆకలి దప్పికలతో వెతుకుచున్న వారికే ఇట్టి ఆహ్వానము ఇవ్వబడుచున్నది. బైబిలు గ్రంథము అంతటిని చదివి చూచినట్లయితే, దప్పిక గలవారికే అత్యధికమైన ఆశీర్వాదము. యాకోబు ఆశీర్వదింపబడి, ఏశావు తృణీకరించబడుటకు గల కారణము ఏమిటి? యాకోబునకు గల దాహమే దానికి కారణము. జేష్ఠత్వపు హక్కును, తండ్రి యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క ఆశీర్వాదమును యాకోబు దప్పికతో వెతికి పొందుకొనెను. అయితే ఏశావునకు అట్టి దప్పిక లేకుండెను.

దావీదు సెలవిచ్చుచున్నాడు,   “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు, దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది;  దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన  సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?”   (కీర్తన.42:1,2). దేవుని బిడ్డలారా మీకు ఇట్టి దప్పిక ఉండినట్లయితే, నిశ్చయముగా ప్రభువు మీయొక్క దప్పికను తీర్చును.  ఆశీర్వదించి హెచ్చించును.

 నేటి ధ్యానమునకై: “దప్పిగొనినవారలారా, మీరందరు నీళ్లయొద్దకు రండి; రూకలులేనివారలారా, మీరు వచ్చి, కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే  ద్రాక్షారసమును పాలను కొనుడి”    (యెషయా. 55:1).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.