bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

జూన్ 30 – అంతమునందు ఆదరణ

“నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు.  అంతమునందు (తరువాత) మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు”   (కీర్తన. 73:24).”

పలు సమయములయందు ఒక అంశముయొక్క ప్రారంభము కంటే దాని యొక్క అంతము రమ్యముగా ఉండును. ప్రస్తుత కాలపు మేలులకంటేను నిత్యత్వము యొక్క మహిమగల అంశములు మిగుల ఔన్నత్యము గలదైయున్నది. ఈ లోకమునందు గల ఆశీర్వాదములన్నిటి కంటెను, నిత్య జీవము యొక్క ఆశీర్వాదములు బహు ఉన్నతమైనది.

ఆదరణ కలిగించు దేవుడే మీతో కూడా నిత్య నిత్యాముగా తరలివచ్చి మిమ్ములను ఆదరించువాడు. యేసు చెప్పెను,    “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో  కూడ ఉన్నానని చెప్పెను”    (మత్తయి. 28:20).

నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను అనుట ఆయన యొక్క వాగ్దానము కదా? ఆయన ఎల్లప్పుడను సజీవుడై ఉండుట చేత మిమ్ములను పరిపూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడై యున్నాడు.

ఈ లోకమునందు అనేకులు తమ యొక్క అంతమును గూర్చి తలంచి కలత చెందుచున్నారు. వారి విశ్వాసముందుగల లోపము అనేది, వారిని పలు విధములుగాను భయపెట్టుచున్నది. నా జీవితము యొక్క అంతము ఎలాగు ఉండునో, నేను పరలోక రాజ్యము నందు పాలుగలవాడనై ఉందునో లేక చెయ్యి విడవబడుదునో అనియంతా తలంచి కలత చెందుచున్నారు.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు; గనుక ఆలాగున చేయును” ‌  (1థెస్స. 5:24). ప్రభువు మిమ్ములను అంతము వరకును నడిపించుటకు శక్తి గలవాడై యున్నాడు.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “యేసు ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని  యెరిగిన వాడై, లోకములోనున్న తన వారియందు ప్రేమనుంచి, వారిని అంతమువరకు ప్రేమించెను”   (యోహాను. 13:1).

సమస్త విధములయందును ఆదరణను కలిగించు దేవుడే సంపూర్ణముగా  మిమ్ములను రక్షించి, సంపూర్ణముగా మిమ్ములను కాపాడి, సంపూర్ణముగా మిమ్ములను ఆశీర్వదించి, మేలులతోను, కృపలతోను మిమ్ములను కిరీటమును ధరింపజేసి, సంపూర్ణముగా మిమ్ములను ప్రేమించి, మిమ్ములను త్రోవయందు నడిపించువాడైయున్నాడు అను సంగతిని మీరు ఎన్నడును మరిచిపోకుడి.

దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను అంతము వరకు మార్గము నందు నడిపినట్లు ప్రభువు యొక్క హస్తమునందు మిమ్ములను సంపూర్ణముగా సమర్పించుకొనుడి. ప్రభువు మిమ్ములను ఆదరించి, అంతము వరకు నడిపించును.

 నేటి ధ్యానమునకై: “మన  పౌరస్థితి  పరలోకము నందున్నది;  అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని  నిమిత్తము  కనిపెట్టుకొని యున్నాము”   (ఫిలిప్పీ. 3:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.