No products in the cart.
జూన్ 28 – పరిశుద్ధాత్ముని ఆదరణ
“సత్యస్వరూపియగు ఆత్మయైయిన వేరొక ఆదరణకర్తను ఆయన మీకనుగ్రహించును” (యోహాను. 14:16).”
యేసుక్రీస్తు ఒక ఆదరణ కర్త. ఆయన మరొక ఆదరణ కర్తను పరిచయము చేసెను. ఆయనే సత్యస్వరూపియగు ఆదరణ కర్త. రెండు విధములుగా ప్రభువు యొక్క కృపను పొంది, మనము ఆదరింపబడుట ఎంత గొప్ప ధన్యత! క్రైస్తవ మార్గము నందు గల ఆదరణయు, ఓదార్పును, పరామర్శించుటయు మరి ఏ మార్గమునందును లేదు అను సంగతిని దృఢముగా చెప్పవచ్చును.
పాత నిబంధన పరిశుద్ధులు, తమ్మును ఓదార్చువారు ఎవరు ఉన్నారు అని అంగలార్చిరి. ప్రసంగి గ్రంధకర్త సెలవిచ్చుచున్నాడు, “ఇదిగో, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు; గనుక ఆదరించువాడెవడును లేకపోయెను” (ప్రసంగి. 4:1).
దావీదు, “నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటిని గాని, యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరారైరి” (కీర్తన. 69:20) అని అంగలార్చుచున్నానాడు.
క్రొత్త నిబంధన యందు, క్రీస్తు యొక్క ప్రసన్నత శిష్యులకు ఆదరణయు, ఓదార్పునై యుండెను. యేసు వ్యాధిగ్రస్తుల యొక్క కన్నీటిని తుడచి, స్వస్థపరెచును. జనులు ఆకలితో ఉన్నప్పుడు, అద్భుతమును చేసి, బహుస్వల్ప ఆహారముతో ఐదు వేల మందిని పోషించెను. ఆక్రోషముతో వచ్చిన దురాత్మలను వెళ్లగొట్టెను. పరిసయ్యులు, సద్దుకయ్యులు మొదలగు వారియొక్క ప్రశ్నలకు మరియు నేరారోపణలకు ఆయనే జవాబును ఇచ్చుచు, శిష్యులకొరకు వాదించెను. అవును, యేసు ఒక శ్రేష్టమైన ఆదరణ కర్త.
చాల సంవత్సరాల పూర్వము మంచు ప్రాంతమైయున్న ఆర్కిటిక్ దృవ ప్రాంతమునకు పరిశోధన చేయుటకు ఒక శాస్త్రజ్ఞుడు వెళ్ళను. ఎటువైపు చూచినా గడ్డకట్టుకుపోయిన మంచు బండలుతో నిండియున్న సముద్రమయమై ఉండెను. రెండు సంవత్సరములు ఒంటరిగా పరిశోధనలను జరిగించి, నూతన ఆవిష్కరణలను కనుగొనెను. భాహ్య ప్రపంచమునకు ఆయనకు ఎటువంటి సంబంధమును లేకుండెను. తన భార్యకు చెప్పవలసిన సమాచారములను ఒక లేఖగా రాసి, తాను తనతో తీసుకొచ్చిన ఒక పావురపు నోట దానిని ఉంచి పంపించెను.
ఆ పావురము చలియందు వణుకుచూనే, ఆకాశమునందు రెండు మూడు సార్లు తిరిగి, తిన్నగా దక్షిణదిశగా ఎగిరి వెళ్ళెను. వేలకొలది మైళ్ళ దూరము ఆగక ఎగురుచూ, చివరిగా ఆ శాస్త్రజ్ఞుని యొక్క భార్య యొక్క ఒళ్ళో లేఖతో సహా వచ్చి పడిపోయెను. ఆ!.. ఆమె పొందుకున్న ఆనందమునకును, ఆధరణనకును అవధులే లేకుండేను.
అదే విధముగా, యేసుక్రీస్తు పరమునకు ఎక్కి వెళ్ళిన తర్వాత, పరలోకపు పావురమైయున్న పరిశుద్ధాత్ముడుని శిష్యుల మధ్యకు పంపించెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడే మీయొక్క ఆనందము, ఆదరణ, దైవిక బలము. ఈ దినము నందు కూడా ఆయన తానే తన యొక్క మధురమైన ప్రసన్నతచేత మిమ్ములను నింపి ఆదరించును గాక.
నేటి ధ్యానమునకై: “మరల, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని, అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్న దత్తపుత్రాత్మను పొందియున్నారు” (రోమీ. 8:15).