Appam, Appam - Telugu

ఏప్రిల్ 29 – విజ్ఞాపన చేయుడి!

“నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుడి”   (ఎఫెసీ. 6:20).

అపోస్తులుడైన పౌలు, తన్ను మిగుల తగ్గించుకొని,  ‘నా నిమిత్తమును విజ్ఞాపన చేయుడి, ప్రార్ధించుడి, నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు గోజాడుడి’ అని చెప్పుచున్నాడు. ధైర్యముగా ఆయన నోరు తెరచి సువార్త యొక్క రహస్యములను  ప్రకటించుటకు కావలసిన వాక్శక్తిని ఆయనకు ఇచ్చునట్లు ఆయన కొరకు విజ్ఞాపన చేయునట్లు ఆయన సెలవిచ్చుచున్నాడు.

ప్రార్ధన అనేది మీయొక్క శ్వాసయు, మీయొక్క హృదయ చప్పుడైయున్నది.  కావున ప్రార్థన చేయవలసినది మీయొక్క బాధ్యతయైయున్నది. పరిశుద్ధతను కాపాడుకొనుటకును,  జెయుంచువారై విజయపు అడుగులు వేయుటకు ప్రార్థన అవశ్యమైయున్నది. ప్రార్థన మీకు ఒక ధన్యతగాను,  గొప్ప భాగ్యముగాను కూడా ఉన్నది. ప్రార్ధన సమయమునందు ప్రాణప్రియుడి యొక్క చక్కని ముఖారవిందమును చూచి పరవశించుడి. బిడ్డలు తండ్రితోకూడా సంభాషించునట్లు ఉల్లసించుడి.  ప్రార్ధన అవకాశములను నిర్లక్ష్యము చేయకూడి.

విశ్వాసులు అందరును, సేవకులు అందరును చేయవలసిన  ప్రాముఖ్యమైన రెండు బాధ్యతలు కలవు.  మొదటి భాగ్యత వారు ప్రార్థించవలెను,  రెండవ బాధ్యత, వారి కొరకు  నమ్మకముగాను, బాధ్యత కలిగిన వారుగాను, ప్రార్థించేటువంటి ప్రార్ధనా యోధులను లేవనెత్తవలెను.  ఎవరెవరికైతే ప్రార్థించేటువంటి దైవజనులు తమకు కలిగి ఉంటారో, వారు  నిశ్చయముగానే భాగ్యవంతులు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “ఒంటిరివాడై యుండుటకంటెను, ఇద్దరు కూడియుండుట మేలు; గనుక వారిఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును.  వారిలో ఒకడు పడిపోయినయెడల  తనతోటివాడు లేవనెత్తును; అయితే ఒంటరివాడైయుండి పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, అతనిని లేవనెత్తుటకు  తోటివారు లేక పోవును”   (ప్రసంగి. 4:9,10).

అపోస్తులుడైన పౌలు, తన కొరకు ప్రార్థించుటకు వ్యక్తులు  కావలెనని గ్రహించెను. తన్ను తగ్గించుకొని   ‘నా నిమిత్తమును విజ్ఞాపన చేయుడి’  అని   ఎఫ్ఫేసునందు గల విశ్వాసులవద్ద ప్రేమతో అడుగుచున్నాడు.  మీరు కూడా ప్రార్ధనా యోధులను చూచుచున్నప్పుడును, సేవకులను చూచుచున్నప్పుడును, మా కొరకు ప్రార్ధించుడి అని అడుగుడి. మీరును ప్రార్ధించుడి.

అనేకమంది విశ్వాసులు చేయుచున్న పొరపాటు ఏమిటంటే, కానుకలను సేవకులకు ఇచ్చి తమ కొరకు ప్రార్థించమని కోరుచున్నారే  తప్ప, ‌ వారు ప్రార్ధించుటలేదు. తమ యొక్క సొంత మోకాళ్లను మడచి,  తమ కొరకును, తమ యొక్క కుటుంబముల కొరకును చాలినంతగా  ప్రార్థించుట లేదు. పొరుగువారి యొక్క ప్రార్థన పైనే ఆధారపడియున్నారు.

ఒకరి భారమును మరియొకరు భరించి క్రీస్తు యొక్క నియమమును నెరవేర్చుడని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  ఒకరికొకరు ప్రార్థించ వలెను, గోజాడి విజ్ఞాపన చేయవలెను.  ఒకరు సమ్మసిల్లి పోవుచున్నప్పుడు,  త్రొట్టిల్లి పోవుచున్నప్పుడు, వెనకబడి పోవుచున్నప్పుడు, ఇతరులు ప్రార్ధనయందు నిలిచి ఉండి, వారిని ఎలాగైనను లేవనెత్తి నిలబెట్ట వలెను. అదియే  క్రీస్తుయొక్క నియమమైయున్నది. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్ధించు వారుగాను,  ఇతరుల యొక్క ప్రార్ధన వాంఛను పురిగొల్పు వారుగాను ఉండుడి.

 నేటి ధ్యానమునకై: “మీరు నాకొరకు దేవునికి  చేయు ప్రార్థనలయందు, నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను”   (రోమీ. 15:32).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.