Appam - Telugu, AppamAppam - Telugu

ಫೆಬ್ರವರಿ 08 – ధ్యానించుట!

“ఆయనను  గూర్చిన  నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక;  నేను యెహోవాయందు సంతోషించెదను”   (కీర్తన.  104:34).

ఆత్మీయ ఎదుగుదలయందు ధ్యానించుట అనేది ఒక అత్యున్నతమైన సాదనయైయున్నది. భక్తి ప్రయాసములయందు ఇది ఒక శ్రేష్టమైన భాగమును వహించుచున్నది. దావీదు తన యొక్క అనుభవములో  నుండి  “ఆయనను  గూర్చిన  నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును”  అని  వ్రాయుచున్నాడు. దేవుని యొక్క జనులకు ధ్యానించు జీవితము మిగుల అవశ్యమైనదైయున్నది.  అట్టి ధ్యానము మీయొక్క ఆలోచనలను అమోహమైనదిగాను, మధురమైనదిగాను మార్చి బ్రతుకును బలపరచుచున్నది.

ఒక మనిషి యొక్క జీవితమునందు జయ అపజయాలు అతని యొక్క ఆలోచనయందును, తలంపులయందును, ముడిపడి ఉన్నదను సంగతిని మీరు మర్చిపోకూడదు. ఎవరైతే ప్రభువును గూర్చి అధికముగా ధ్యానించకయుందురో వారి యొక్క తలంపులయందు సాతాను పలు కీడైన విత్తనాలను విత్తుచు, శరీరాను సంబంధమైన తలంపులను ఆలోచింప చేయుచున్నాడు. పాప పూరితమైన ఊహాత్మక శక్తులను తీసుకొచ్చి,  యిఛ్చలను నెరవేర్చుకున్నట్లు  పుర్కొలుపును.

బైబిలు గ్రంధమునందు కనబడుతున్న పరిశుద్ధులు అందరును బైబిలు గ్రంథమును చదివి ధ్యానించుటయందు అత్యధిక సమయమును ఖర్చు పెట్టిరి.  ఇస్సాకు సాయంకాల సమయమునందు ధ్యానించ్చుటకు పొలములోనికి వెళ్లియుండెను  (ఆది. 24:63)  అని  బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది.  దావీదు తాను ధ్యానించు అనుభవమును గూర్చి వ్రాయుచున్నప్పుడు,   ” నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై, నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును”    (కీర్తన. 119:148)   అని   చెప్పుచున్నాడు. ధ్యానించుటయు, ప్రార్థనయు  మీ  ప్రాణమునకు బలమైయున్నది.  ధ్యానించుట  అనేది  మిమ్ములను దేవునితో  ఏకముగా ఐక్యపరచుచున్నది.

కనాను దేశమును స్వతంత్రించు కొనుటకు పూర్వము,  ప్రభువు యెహోషువాకు ఇచ్చిన ఒక  చక్కటి  ఆలోచన  బైబిలు గ్రంధము ధ్యానింపవలెను అనుటయే.  ప్రభువు సెలవిచ్చుచున్నాడు,    “దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు,  దివారాత్రము దాని ధ్యానించినయెడల,  నీ మార్గమును వర్ధిల్లజేసికొని, అప్పుడు బుద్ధిమంతుడవై  చక్కగా ప్రవర్తించెదవు”    (యెహోషువ. 1:8).

ఈ వచనమును గూర్చి ఆలోచించి చూడుడి.  యెహోషువా యెదుట పాలు యుద్ధములు ఉండెను.  అతడు కనానునందు గల ఏడు రకములైన జనాంగములను, ముప్పై ఒక్క మంది రాజులను ఎదిరించి పోరాడ వలసిన పరిస్థితియైయున్నది.  అటువంటి సమయమునందు యెహోషువకు శరీర బలము అవశ్యమైయున్నది.

అయితే దానికంటే ముందుగా అతనికి మిగుల అవసరమైయున్నది,  మనస్సునందు శక్తియు ఆత్మయందు బలమునైయున్నది. అంతరంగ పురుషుని బలపరచుటకు ధ్యానించుటయే ప్రధానమైన ఆయుధముగా ఉన్నది.  దేవుని బిడ్డలారా, ధ్యానించే జీవితము ఒక ఆశీర్వాదకరమైన జీవితము అను సంగతిని ఎరిగియుండి మసులుకొందుము.

నేటి ధ్యానమునకై: “నా గుండె నాలో మండుచుండెను; నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను;  అప్పుడు నేను ఈ మాట నోరార విన్నపించితిని”   (కీర్తన. 39:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.