No products in the cart.
డిసెంబర్ 09 – ప్రభువు యొక్క శక్తి!
“ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను”(లూకా.5:17).
ప్రభువు యొక్క స్వస్థపరచు శక్తి మన మధ్యలో బయలు పరచబడును అని ప్రభువు వాక్కు నిచ్చియున్నాడు. అన్ని రకములైన స్వస్థతలకంటెను బహు ప్రాముఖ్యమైనది మీ యొక్క ప్రాణములో లభించు స్వస్థతయైయున్నది. మీ ప్రాణము సౌఖ్యముగా జీవించును అంటే, మీరు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండెదరు.
దావీదు రాజు, “యెహోవా, నీ దృష్టియెదుట నేను పాపము చేసియున్నాను, నన్ను కరుణింపుము; నా ప్రాణమును స్వస్థపరచుము”(కీర్తన.41:4) అని చెప్పుచున్నాడు. అవును, పాపములనుండి మారుమనస్సు పొందుచున్నప్పుడు, ప్రభువుకును మీకును మధ్య గల సంబంధము నూతన పరచబడుచున్నది. అప్పుడు ప్రాణమునందు సంతోషమును, దైవిక స్వస్థతయు కలుగును.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు, “వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును; వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును”(హొషేయ.14:4). విశ్వాసఘాతకము నుండి గుణపరచబడుట అని బైబిలు గ్రంథము చెప్పుటను చూడుడి. శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము మొదలగు వాటియందు పడిపోయి విశ్వాసఘాతకము తట్టు పరిగెత్తుచున్నవారు ప్రభుని వద్దకు తిరిగినట్లయితే, వారి విశ్వాసఘాతకమును గుణపరచుదును అని ప్రభువు వాక్కునిచ్చుచున్నాడు.
మరియు ఇంకెవరికి ప్రభువు స్వస్థతను ఇచ్చును? హృదయమునందు నలిగిన వారిని ఆయన స్వస్థపరచును (లూకా.4:18). హింసలును, వేదనలును, ఓటమీలను, నమ్మకద్రోహములును హృదయమును విరచి వేయును. ఇవి హృదయమును విరిగి, నలిగి పోవునట్లు చేయుచున్నది. మీకు బహు నమ్మకమైనవారే మిమ్ములను మోసగించు చున్నప్పుడు మనస్సు విరగిపోవును. ఆ సమయమందును ప్రభువే మిమ్ములను గుణపరచుటకు శక్తిమంతుడైయున్నాడు. ఆయన హృదయమునందు నలిగిన వారిని స్వస్థపరచి, చెరపట్టబడిన వారిని విడిపించి, ఆదరణనను, సమాధానమును దయచేయును.
బైబిలు గ్రంధమంతటను స్వస్థతకును, గుణపరచుటకును, ఆరోగ్యమునకును సంబంధించిన వాగ్దానములు కలవు. ఆయన ప్రాణమునందు స్వస్థతను రప్పించుచున్నాడు. విశ్వాసఘాతకము నుండి స్వస్థతను తీసుకొచ్చుచున్నాడు. విరిగిన హృదయములను సరిజేసి స్వస్థ పరచుచున్నాడు. అది మాత్రమే గాక, పలకరించువారు లేక, తృణీకరింపబడినవారి జీవితమునందును ఆరోగ్యమును దయచేయుచున్నడు. ఆయన ఎంత మంచివాడైయున్నడు! ప్రభువు సెలవిచ్చుచున్నాడు, “ఇదిగో.నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను”(యిర్మీయా.33:6).
యేసుక్రీస్తు ఈ లోకమునందు జీవించిన దినములలో, ఆయన యొద్దకు వచ్చిన వారిలో, ఏ ఒక్కరైనను దైవీక స్వస్థతను పొందుకొనక తిరిగి వెళ్లిన వారు లేరు. దేవుని బిడ్డలారా, నిన్నా నేడు నిరంతరమును మారని యేసుక్రీస్తు నేడును మీకు విడుదలను దైవిక స్వస్థతను దయచేయును.
నేటి ధ్యానమునకై: 📖”యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు, గలిలయయందంతట సంచరించెను”(మత్తయి.4:23).