No products in the cart.
డిసెంబర్ 07 – ప్రభువు యొక్క భుజములు!
ప్రభువు యొక్క అత్యధిక బలమైన, శక్తిగల, గొప్ప భుజములను తేరి చూడుడి. “రాజ్యభారము ఆయన భుజములపై ఉండును” అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. ప్రభువు యొక్క భుజములపై మనము చూచుచున్నది ఆయన యొక్క రాజ్యభారము. రాజ్యభారము అను మాటకు ఏలుబడి, అధికారము, భాద్యత అను పలు అర్ధములు కలవు. ఆంగ్ల భాష బైబిలు గ్రంధమునందు ఈ పదము “ప్రభుత్వము” అని భాషాంతరము చేయబడియున్నది.
లోకమునందు ఉండేటువంటి పలురకాల ప్రభుత్వాల వలెకాక, ప్రభువు ఆకాశమును భూమిని పాలించే పరలోక ప్రభుత్వమునకు చెందినవాడైయున్నాడు. అది భూమియందు గల సకల ఏలుబడుల పైనను అధికారము గల ప్రభుత్వమైయున్నది. ఆయన రాజ్యభారము గలవాడు.
అందుచేతనే ఆయనను “దేవుడు” అని పిలువ వచ్చును, “ప్రభువు” అని పిలచుచుచున్నాము. సమస్తమును ప్రభువుయొక్క ఏలుబడికి లోబడియున్నది. అటువంటి శక్తిగల దేవుని యొక్క భుజములను చూడుడి. ఆయన యొక్క భుజములపై పరలోకము అంతయు ఉన్నది. భూమి యొక్క సమస్తమును ఉన్నది. సమస్తభూతలమంతయు ఉన్నది.
ఇశ్రాయేలీయుల పాలకుడైన మొదటి రాజైన సౌలును ప్రభువు ఏర్పరచుకున్నప్పుడు, “ఇశ్రాయేలీయులలో అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడు”(1.సమూ.9:2) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. అయితే ప్రభువు ఎటువంటివాడు? సమస్త ప్రధాన మంత్రులను, రాష్ట్రపతులును, పాలకవర్గములు అన్నీయు ఈ యొక్క భుజముల క్రింద ఉండునట్లు అంతటి ఉన్నతమును, మహోన్నతమైనవాడు. రాజ్యభారము ఆయన యొక్క భుజములపై ఉన్నది.
ఒక ప్రభుత్వమునకు పలు రకములైన బాధ్యతలు కలవు. మొదటిది, తన యొక్క దేశ ప్రజలను కాపాడుకొనవలెను. చట్టనియమాలను నెలకొల్పవలెను. ప్రజలకు కావలసిన సకల వసతులను అందించవలెను. అంత మాత్రమేగాక, బద్ద శత్రువులైయున్న పొరుగు దేశాల దాడుల నుండి ప్రజలను కాపాడవలెను. ప్రజలు తమ యొక్క అవసరముల కొరకును, న్యాయముల కొరకును, సంరక్షణ కొరకును, ప్రభుత్వము వైపే ఎదరుచూచెదరు.
అదే విధముగా, మీరు ప్రభువు యొక్క బలముగల భుజములను తేరి చూచుచున్నారు. ఆయన యొక్క భుజములపై మీయొక్క భారములను మోపి వేయుచున్నారు. ఆయన యొక్క భుజములపై ఆనుకొనుచున్నారు. ఆయన మిమ్ములను సంరక్షించుచున్నాడు. మీకు న్యాయమును చేయుచున్నాడు. మిమ్ములను ఆశీర్వదించుచున్నాడు. ఎంతటి సమాధానము! ఎంతటి ఆనందము!
లోక ప్రకారమైన ప్రభుత్వములకు ఒకవేళ పేదరికమైనను కరువైనను రావచ్చును. అయితే పరలోకపు రాజ్యము ఎట్టి కష్టాలకును గురికాదు. అది పూర్తిగా ఆశీర్వదకరమైనది. దేవుని బిడ్డలారా, యేసుని భుజములపై ఉన్న రాజ్యభారమును తేరి చుడుడి. దానిని దృఢముగా పట్టుకొనుడి.
నేటి ధ్యానమునకై: “ఆయన భుజముమీద రాజ్యభారముండును; ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును”(యెషయా.9:6,7).