Appam - Telugu, AppamAppam - Telugu

అక్టోబర్ 23 – ప్రాచీనపురుషుడు, నవీనపురుషుడు!

“జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనపురుషుని ధరించుకొని యున్నారు”(కొలొస్సి.3:10)

జిల్లేడు చెట్టు ఆకులయందు కొన్ని పురుగులు ఆకులతో అతుక్కొని యుండును. ఈ పురుగులు సాధారణమైన పురుగులు కావు. సీతాకోక చిలుకగా మారెటువంటి పురుగులు. కొన్ని దినములలో అట్టి పురుగులు ఆ ఆకులను తిని పెరిగి ఒక కీటకముగా మారుచున్నది. దాని తరువాత గొంగలి పురుగై అలాగుననే ప్యూపాగా గూటిలో పలు దినములు వేలాడుతూ ఉండును. అకస్మాత్తుగా ఒక దినమున అది ఒక సీతాకోక చిలుకగా మారి రెక్కలను ఆడించుచు  ఎగిరి పోవును.

దానికి ప్రాణము ఒక్కటే. అయితే దాని జీవితము రెండురకములై యుండును. ఒకటి గొంగలి పురుగుగా ఉన్న జీవితము, మరొకటి సీతాకోక చిలుక వంటి జీవితము అదే విధముగా ఒక విశ్వాసి యొక్క జీవితమునందును ప్రాచీన పురుషుణ్ణి చూడవచ్చును. క్రీస్తుని పోలికగా రూపాంతరము చెందిన నవీన పురుషుణ్ణి చూడవచ్చును.

ఆదామునందు మీరు ప్రాచీన పురుషులైయున్నారు. క్రీస్తునందు మీరు నవీన పురుషులైయున్నారు. రోమా ఆరవ అధ్యాయము, ఎఫసియులు నాలుగవ అధ్యాయము, కొలొస్సియులు మూడవ అధ్యాయము మొదలగు వాటియందు మీరు చెయ్యవలసిన మూడు ప్రాముఖ్యమైన అంశమును గూర్చి అక్కడ వ్రాయబడియున్నది.

  1. ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేయవలెను:- (రోమ.6:6). ఈ ప్రాచీన పురుషుడే మీయొక్క పాప స్వభావములతో నిండిన ప్రాచీన ఆదాము. మీరు చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దృఢమైన తీర్మానము చేయిటయే ప్రాచీన పురుషుని సిలువ వేయుట యైయున్నది.మీ సమస్త పాపములను, అతిక్రమములను ఆ యేసునిపై, సిలువయందు మోపబడుచున్నది. తద్వారా ఆయన రక్తము మీ యొక్క పాపములన్నిటిని పవిత్ర పరచుచున్నది. మిమ్ములను శుద్ధీకరించుచున్నది (1.యోహాను.1:7).
  2. ప్రాచీన పురుషుణ్ణి పరిత్యజించవలెను:- (కొలొస్సి.3:9). ‘ప్రాచీన పురుషుణ్ణి, క్రియలను పరిత్యజించుడి’ అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఒక ప్యూపా కీటకము నుండి వచ్చుచున్న సీతాకోక చిలుక, ప్రాచీన స్థితిని, ప్రాచీన కీటక జీవితమును, ప్రాచీన స్వభావములను పరిత్యజించి వేసి, నూతన సృష్టిగా రెక్కలను ఆడించుచు ఎగురుచున్నది. అదే విధముగా, మీరును పాపపు స్వభావములను పరిత్యజించి వేసి, మహోన్నతుడైన దేవుని స్వభావమును ధరించుకొందురు.
  3. నవీన పురుషుణ్ణి ధరించుకొనవలెను:- (ఎఫెసి.4:24). ప్రాచీన పురుషుణ్ణి పరిత్యజించుటతో పాటు విడిచిపెట్టక, క్రీస్తైయున్న నవీన పురుషుణ్ణి ధరించుకొనుడి. క్రీస్తు యొక్క స్వభావములు మీయందు రూపింపవలెను. క్రీస్తు యొక్క బలముతో ముందుకు సాగిపోవుడి. “బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను”(ఎఫెసీ.4:24).

నేటి ధ్యానమునకై: “మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మవలన బలపరచబడునట్లుగా. ప్రార్థించుచున్నాను”(ఎఫెసీ.3:15,19)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.