Appam - Telugu, AppamAppam - Telugu

జూలై 24 – నీవు తడవుచేయుట ఎందుకు?

“గనుక నీవు తడవుచేయుట ఎందుకు?  నీవు లేచి ప్రభువుయొక్క  నామమునుబట్టి  ప్రార్థనచేసి,  బాప్తిస్మము  పొంది,  నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను”(అ. పొ.22:16)

తడవుచేయుట ద్వారా అనేకులు గొప్ప ఆశీర్వాదములను కోల్పోవుచున్నారు. యుద్ధ సమయములయందు ఆయుధాలు, ఆహారపు వస్తువులు ఆలస్యముగా వచ్చినట్లయితే, ఆ సైన్యము జయము పొందుట ఎలాగూ? కార్యాలయమునకు ఆలస్యముగా ఉచ్చుటను ఒకడు అలవాటుగా కలిగియున్నట్లయితే, అతడు కొనసాగించుచు ఆ ఉద్యోగమునందు ఉండుట ఎలాగు? పాఠశాలకు ఆలస్యముగానే వెళ్ళుట అలవాటుగా కలిగియున్నట్లయితే, ఆ పిల్లవాడు చదువులందు ముందుకు సాగుట ఎలాగు?

మీరు ఆశీర్వాదములు ఆలస్యముగా వచ్చుటను కోరుకొనరు. మీకు అందవలసిన ధనము త్వరగా అందక పోయినట్లయితే మీరు సహనమును కోల్పోవుదురు. త్వరగా రావలసిన ఉత్తరము కాలము గడిచాక వచ్చినట్లయితే అందుచేత మీరు కలతను, మనస్సునందు వేదనను పొందవలసియున్నది. అదే సమయమునందు ప్రభువుయొక్క కార్యములయందు మీరు తడవుచేయవచ్చునా అనుటను కొద్దిగా తలంచి చూడుడి!

కొందరు ఆలయమునకు ఆలస్యముగానే వచ్చెదరు. స్తుతి ఆరాధన, పాటల సమయము, ప్రార్ధన సమయము ముగించబడి, ప్రసంగ సమయమునందు సహములో వచ్చి కూర్చుందురు. ఇందుచేత వారు దేవుని సన్నిధియొక్క ఆశీర్వాదములను పూర్తిగా అనుభవింపక పోవచ్చును. కొందరు రక్షణను తడవుచేయుదురు. మరికొందరు బాప్తిస్మము తడవుచేయుదురు. ఇంకా కొందరు పరిచర్య చేయుటకై వచ్చుటకు ఆలస్యము చేయుదురు. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది; “గనుక నీవు తడవుచేయుట ఎందుకు? నీవు లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి,  బాప్తిస్మము  పొంది,  నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను”(అ. పొ.22:16).

మీరు ఆలస్యమును దేనికి అనుమతించినను, రక్షణ పొందుటకు దానిని ఎన్నడును అనుమతించకూడదు. సిలువ చెంతన నిలువబడి, “ప్రభువా, నేడే నన్ను అంగీకరించుము, నన్ను నీ స్వరక్తముచేత కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము” అని ఏడ్చి, ప్రార్థించి రక్షణను పొందుకొనవలెను. ఎప్పుడు ప్రభువు యొక్క రాకడ ఉండునో తెలియదు. రక్షింపబడక రాకడయందు చేయివిడువబడుట ఎంతటి వేదనకరమైనది!

సొదొమ నాశనమునకై నిర్ణయింపబడియుండెను. ప్రభువు ఆకాశమునుండి అగ్నిని, గంధకమును కుమ్మరింపజేసెను, దానిని పూర్తిగా కాల్చివేయుటకు తీర్మానించెను. దానికి ముందుగా అక్కడనున్న లోతును కనికరించి, అతనిని అతనియొక్క కుటుంబమును కాపాడుటకై తనయొక్క దూతలను పంపించెను. బైబిలు గ్రంథము చెప్పుచున్నది; “అయితే లోతు తడవుచేయుచుండెను”(ఆది.19:16). సొదొమును విడచి వెలుపలికి వచ్చుటకు అతనికి ఇష్టములేకుండెను. అక్కడనున్న నీళ్లుపారు తోటవలెనున్న దేశముపై అతని కండ్లు పొదిగింపబడియుండెను.

చివరకు లోతుయొక్క ఆలస్యమును గమనించిన ఆ దేవదూతలు లోతుయొక్క చెయ్యిని పట్టుకొని సొదొమను విడచి వెలుపలికి ఈడ్చుకొని వచ్చిరి. దేవుని బిడ్డలారా, ఈ లోకము అగ్నికి యెరగా ఉంచబడియున్నది. లోకమును నమ్ముటకును, దానియందు ఆశను కలిగియుండుటకును, దానియందు నిజమైన గొప్పతనము ఏమియులేదు. అందుచేత, మీరు ఎట్టి కారణముచేతను రక్షణను గూర్చి కాలయాపన చేయకుండుడి.

నేటి ధ్యానమునకై: “వెంటనే, సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను”(అ.పొ.  9:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.