SLOT GACOR HARI INI BANDAR TOTO musimtogel bo togel situs toto musimtogel toto slot
Appam, Appam - Telugu

సెప్టెంబర్ 26 – గాడిదయొక్క పచ్చి దవడ యెముక!

“అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని,  చెయ్యి చాచి పట్టుకొని, దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను”   (న్యాయా.15:15

సమ్సోను యొక్క జీవితమందు జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను గూర్చి ఇక్కడ చదువుచున్నాము.  ఫిలిష్తీయులు సమ్సోను పై ఎదుర్కొని రాగా, సమ్సోను యొక్క చేతిలో ఒక్క ఆయుధమును లేకుండెను. వేల సంఖ్యలో ఫిలిష్తీయులు కూడియుండగా ఒంటరిగా వారిని ఎలాగు ఎదుర్కొనుట అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, సమీపమున ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొనెను.

బలవంతునికి పచ్చి బరిక కూడా ఆయుధమే అను మాటకు తగినట్లుగా ఆ సాధారణమైన గాడిద దవడ ఎముక ఆయనకు మంచి ఆయుధముగా ఉండెను. దాని చేత వెయ్యిమంది మనుష్యులను చంపెను. క్రొత్త తాళ్లచేత  కట్టబడియున్న స్థితియందు,  ఫిలిష్తీయుల వద్ద అప్పగింపబడినప్పుడు కూడాను, ఫిలిష్తీయులవల్ల  సమ్సోనును ఏమియు చేయలేకపోయెను.

సమ్సోను యొక్క చేతులకు ఆ దవడ ఎముక దొరుకుట ఎంతటి ఆశ్చర్యమైనది!  దేనికి పనికిరాని దానిని  సమ్సోనుచే  వాడబడగలిగెను అంటే, మిమ్ములను ఇంకెంత అత్యధికముగా ప్రభువుచే వాడుకొనగలడు!  సమ్సోను యొక్క  చెయ్యి ఆ ఎముకను దృఢముగా పట్టుకున్నట్లు, ప్రభువు యొక్క చేతులు మిమ్ములను బహు బలముగా పట్టుకొనియున్నది.

కొందరి యొక్క జీవితమును సాతాను పట్టుకొనియున్నాడు. పాపపు త్రోవలయందు తీసుకొని వెళుచున్నాడు. అతడి చేతులలో చిక్కుకున్న వారిచే అనేకులను తొట్టిల్లుటయందును, అనేకులను నిత్య వేదనలయందును కొనిపోవుచున్నాడు.

చూడుడి! ఒక పదునైన కత్తి ఉన్నదని అనుకునుడి. వైద్యులు ఆ కత్తిని వాడుకొనుచు వ్యాధిగ్రస్తులకు సశ్స్ర చికిత్సను చేసి శరీరమందుగల గడ్డలను తొలగించి, వారిని స్వస్థపరచి, ప్రాణాలు పోయగలరు. అదే సమయమునందు క్రూరుడైన ఒక హంతకుని యొక్క చేతులలో అదే కత్తి ఉన్నట్లయితే అతడు ఎంతోమంది యొక్క చక్కటి ప్రాణాలను చంపి వేయవచ్చును.

సమ్సోను వాడినది గాడిద యొక్క దవడ ఎముక అని చదువుచున్నాము. మీయొక్క దవడ ఎముకయే మీరు మాట్లాడుటకు సహాయకరముగా ఉన్నది. ప్రభువు యొక్క మాటలను ప్రకటించుటకు సహాయకరముగా ఉన్నది. మీ యొక్క నోటి మాటలు ప్రభువు యొక్క రాజ్యమును కట్టి లేవనెత్తుటకును, శత్రువు యొక్క శృంగములను పడగొట్టుటకును బహు ప్రయోజనకరముగా ఉంటున్నది.

ఆనాడు సమ్సోను ఫిలిస్తీయులను సంహరించెను. వెయ్యి మందిని చంపి కూల్చేను. నేడును మీకు ఆకాశ మండలమందుగల దురాత్మల సమూహములతో పోరాటము కలదు. ఒకడు వెయ్యి మందిని తరుమగొట్టును. ఇద్దరు పదివేల మందిని తరుమ గొట్టెదరు.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “ఇదిగో నేను, కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలె చేయుదువు”    (యెషయా. 41:15). దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క హస్తములయందు ఆయుధముగా ఉన్నారు.

 నేటి ధ్యానమునకై: “యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా, మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను”   (యెహేజ్కేలు. 37:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.