No products in the cart.
సెప్టెంబర్ 14 – దేవదూతకు ఆజ్ఞాపించును!
“గనుక వాడు, ఎలీషాచుట్టును ఆ పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథ ములచేతను నిండియుండుట చూచెను” (2. రాజులు. 6:17).
ప్రతి ఒక్క దేవుని బిడ్డకును ప్రభువు ఒక్కొక్క దేవదూతను ఆజ్ఞాపించుచున్నాడు. సేవకులందరికీ ప్రభువు అగ్నిమయమైన గుర్రములను రధములను ఆజ్ఞాపించుచున్నాడు. అందుచేత మనము భయపడవలసిన అవసరము లేదు.
ఒకసారి సాధు సుందర్ సింగ్ సువార్త పరిచర్యకై టిబెట్టు నందుగల ఒక గ్రామమునకు వచ్చినప్పుడు, ఆ గ్రామస్తులు ఆయనను అంగీకరించక తరిమికొట్టిరి. అది రాత్రి వేళయు, బహు భయంకరమైన చలి సమయమైయుండెను. ఏమి చేయాలి అని ఆయనకు పాలుపోక సాధు సుందర్ సింగ్ కొంత దూరము నడిచి వచ్చినప్పుడు, ఒక గృహను చూచెను. గృహలోకి వెళ్లి పండుకొనుట కొరకు ఆలోచిస్తుండగా, అకస్మాత్తుగా ఆ గ్రామపు ప్రజలు కర్రలతోను, కత్తులతోను, భయంకరమైన ఆయుధములతోను దొమ్మిగా మూర్ఖతతో ఆ గృహ తట్టునకు వచ్చుటను చూచెను.
ఒక్క క్షణములోగా సాదు సుందర్ సింగ్ పరిస్థితిని అర్థము చేసుకొనెను. వారు తనని వెతుక్కుంటూ వచ్చుచున్నారు అనియు, నిశ్చయముగా తనను కొట్టి చంపివేయుదురు అనియు గ్రహించి, గృహలోపటి భాగమునకు వెళ్లి మోక్కాలూని ప్రార్థించుటకు ప్రారంభించెను. మరణించెదను అను భయము ఆయనకు ఉండుటచేత తన ప్రాణమును, ఆత్మను ప్రభువు వద్ద సమర్పించుకొని ఆసక్తితో ప్రార్థించెను. దరిదాపులు అరగంట సేపు ప్రార్థించి ఉంటాడు. అయితే ఎవరును లోపలికి వచ్చి ఆయనను పట్టుకొనుటకు రాలేదు. బయటకు వచ్చి చూసినప్పుడు ఆ ప్రజలందరును తిరిగి వెళ్ళుటను చూచెను.
ఆ గృహయందు ఆ రాత్రి అంతయు గడిపెను. చక్కగా నిద్రించి ఉదయమున ప్రభువు యొక్క నడిపింపు కొరకు ఆసక్తితో ప్రార్థించెను. గృహను విడిచి బయటకు వచ్చిన వెంటనే ఆ ఊరు ప్రజలు తనతట్టు ఉచ్చటను చూచెను. ఇప్పుడు వారి చేతులలో భయంకరమైన ఆయుధములు ఏదియు లేకుండెను. అయితే వచ్చిన గుంపు గొప్ప మూకగా ఉండెను.
సాదు సుందర్ సింగ్ యొక్క హృదయమునందు భయము ఉండినప్పటికిని, ప్రభువు యొక్క చిత్తమునకు తన్ను సమర్పించుకొని, వారిని ఎదుర్కొని వచ్చి, వారిని ఏమి కావలెను అని అడిగెను. అందుకు వారు చెప్పిన మాట: “మేము నిన్నటి దినమున నిన్ను చంపివేయుటకు నిశ్చయించుకుని వచ్చుట వాస్తవమే. అయితే నీయొక్క గృహ చుట్టూతా నిలబడియున్న ఆ మహత్తైన మనుష్యులు ఎవరు? వారిలో నుండి ప్రకాశించిన వెలుగు ఎట్టి వెలుగు? వారు ఏ దేశమునకు చెందినవారు?” అని అడిగిరి.
నన్ను కాపాడుట కొరకు ప్రభువు దూతలను పంపించి గృహ చుట్టూతను నిలబడునట్లు ఉంచెను అను సంగతిని అప్పుడే సాదు సుందర్ సింగ్ గారికి అర్థమాయెను. యేసుక్రీస్తు ఎంతటి గొప్పవాడు అను సంగతిని ఆ గ్రామ ప్రజలకు వివరించి చెప్పుటకు ఆ సందర్భమే ఆయనకు చాలినదై ఉండెను.
ప్రభువు ఆటంకములను ఎక్కి వెళ్లేటువంటి మెట్లుగా మార్చుచున్నాడు. చూడుడి, సాధు సుందర్ సింగ్ గారికి వచ్చిన మరణపు పోరాటమునునది చక్కగా ఆత్మల సంపాదయము చేయుటకు అనుకూలమైన మార్గముగా మారెను. ఆనాడు ఆ గ్రామపు ప్రజలు అందరును ప్రభువును అంగీకరించిరి. దేవుని బిడ్డలారా, మీయొక్క ప్రార్ధన ఏదైనను ఉండినప్పటికి ప్రభువు విని తన యొక్క దేవదూతను పంపించుచున్నాడు. అగ్నిమయమైన గుర్రములను, రధములను పంపించుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును” (మత్తయి. 6:8).