Appam, Appam - Telugu

సెప్టెంబర్ 10 – యేసునకు పిలుపు!

“యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి”    (యోహాను. 2:2) 

యేసును పిలిచియుండిరి, ఆయనను ఘనపరచి, ఆయనను ప్రాముఖ్యపరచి, ఆ వివాహపు ఇంటివారు ప్రేమతో ఆహ్వానించుట చేత ప్రభువు తన యొక్క మొదటి అద్భుతమును ఆ వివాహపు ఇంట జరిగించెను.

యేసును ఘణపరచి పిలచుచున్నప్పుడు, ఆయన మీతో పాటు ఉండుటకు ఎల్లప్పుడును సిద్ధముగా ఉన్నాడు. అది ఎట్టి స్థలమైయుండినను గాని, ఎట్టి సమయమైయుండినను గాని, ఆయన వచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు.    ‘నా నామమును ప్రసిద్ధిచేయు ఎట్టి స్థలమందైనను నేను వచ్చి మిమ్ములను ఆశీర్వదించెదను’  అని ఆయన వాక్కును ఇచ్చియున్నాడు.

యేసు యొక్క సముఖమును, ప్రసన్నతయు మీకు దొరకవలెను అంటే, మీరు మరికొన్ని అంశములను చేయవలెను. ఆయన యొక్క పాదముల చెంతకు కుటుంబ సమేతముగా ఏక మనస్సుగలవారై కూడి రావలెను. ఆయన నామమునందు ఇద్దరు, ముగ్గురు కూడి వచ్చినట్లయితే ఆయన వచ్చేదెను అని వాక్కును ఇచ్చియున్నాడు కదా? (మత్తయి. 18:20).

అనేకులకు తమ యొక్క జీవితమునందు, సంతోషమును సమాధానమును ఉన్నప్పుడు, ప్రభువు జ్ఞాపకమునకే వచ్చుటలేదు. తమ యొక్క సొంత బలము చేత సమస్తమును పొందుకొనుచునట్లు తలంచుచున్నారు. తమ యొక్క జీవితమునందు కఠినమైన చిక్కుళ్ళు, పోరాటములును వచ్చుచున్నప్పుడే, ప్రభువు యొక్క జ్ఞాపకము వారికి వచ్చుచున్నది. అప్పుల సమస్యయందు తలమునకులై పోయిన్నప్పుడును, అన్ని వైపులను అంధకారము అవరించుచున్నప్పుడును, చేతబడి శక్తుల చేత అలమటింప బడుచున్నప్పుడే ప్రభువును వెతికెదరు.

వివాహ సమయమునందు ప్రభువు తమకు మంచి జీవిత భాగస్వామిని అమర్చి ఇవ్వవలెను అని తలంచవచ్చును.  ఎక్కడ ఎక్కువ వరకట్నము దొరుకును, బంగారము, ధనము దొరుకును అని అనేకులు వెతుకుచూ పరిగెత్తుచున్నారు. అంతమునందు పలు వేదలచే తమ్మును పొడుచుకొనుచున్నారు.

ఆ వివాహపు ఇంటివారు యేసుని మాత్రము గాక, ఆయన యొక్క శిష్యులను కూడా పిలచి ఉండిరి. వారు తమ కులమువారు, స్నేహితులు అనుటచేత కాక, వారు క్రీస్తుతో ఉన్నవారు అనుట చేతను, శిష్యులు అనుట చేతను, ఆయన యొక్క పరిచారకులు అనుటచేతనే ఘణపరచబడిరి. ప్రభువుతోను, ఆయన యొక్క సేవకులతోను మీరు కలసిఉండుట ఎంతటి ఆశీర్వాదము!

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది:     “ఇదిగో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”     (కీర్తనలు. 133:1). ప్రభువును ఘణపరచుచున్నవారు, ఆయన యొక్క సేవకులను కూడా ఘణపరచుదురు.

మీరు ప్రభువు యొక్క ఇంటివారు అను సంగతిని మర్చిపోకుడి. క్రీస్తు మనకు శిరసైయున్నాడు. విశ్వాసులును, సేవకులును శరీరము యొక్క అవయవములై యున్నారు.

క్రీస్తు మూలరాయైయున్నాడు, మనము ఆయనపై కట్టబడుచున్న మందిరమై ఉన్నాము. మీరు ఎన్నడును ఒంటరిగా వ్యవహరించ లేరు. దేవుని బిడ్డలారా, మీరు యేసును, శిష్యులను ఆహ్వానించుడి.

నేటి ధ్యానమునకై: 📖”మీరు యెహోవా పక్షపువారైనయెడల, ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయన యొద్ద విచారణచేసినయెడల, ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల, ఆయన మిమ్ములను విసర్జించును”    (2. దినవృ. 15:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.