Appam, Appam - Telugu

సెప్టెంబర్ 01 – పరిశుద్ధుని యొక్క ప్రేమ!

“మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము, మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి”    (1. పేతురు. 1:16)అపోస్తులుడైన పేతురు,     “మీ సమస్త ప్రవర్తనయందు”  అని సూచించుటను గమనించుడి. మీ యొక్క సమస్త ప్రవర్తన అంతటియందును విశ్వాసులకు మాదిరికరముగా ఉండవలెనని  అపో. పౌలు సూచించుచున్నాడు  (1. తిమోతి. 4:12). ప్రభువు యొక్క కనులు త్రాసు వలె పనిచేయుచు మీయొక్క ప్రతి ప్రవర్తనను పరిశీలించి చూచుచున్నది.

మీ యొక్క ప్రవర్తనను ప్రభువు తనతో పోల్చి చూచుచున్నాడు.  ఆయన పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును మీయొక్క సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండవలెను అని ఎదురుచూచున్నాడు. ఒకవేళ మీ యొక్క ప్రవర్తన, లోకస్తులైన కొంతమందితో పోల్చుకొని, నేను నీతిమంతుడను, నేను వారికంటే ఎంతో పర్వాలేదు అని  మిమ్ములను మీరే ఓదార్చు కోనవచ్చును.

అయితే ప్రభువు మీ యొక్క జీవితమును లోకస్థులతో పోల్చువాడు కాదు, తనతో పోల్చుకొనువాడు. మీరు ఆయన యొక్క పోలికయందు కదా సృష్టిపబడియున్నారు? బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది:     “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెను ”    (1. పేతురు. 2:12).

ప్రవర్తన అంటే ఏమిటి? మీ యొక్క మాటలు, చేతలు, తలంపులు, మరియు అనుదినము జీవితమునందు మీరు జీవించుచున్న విధానము మొదలగునవైయున్న వాటినే,    ‘ప్రవర్తన’  అను మాట సూచింపబడుచున్నది. ప్రభువు  యొక్క బిడ్డల  ప్రవర్తన ఎలాగూ ఉండవలెను?  కీర్తనకారుడు చెప్పుచున్నాడు:     “దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు”     (కీర్తనలు. 1:1,2).

అది మాత్రమే కాదు, మీయొక్క నడకయందు దైవీక ప్రేమయు ఏకమై ఉండవలెను. మీ యొక్క ప్రేమ కళ్ళ కపటము లేనిదై, త్యాగమైనదిగాను, నిస్వార్ధమైనదిగాను ఉండినప్పుడు, అట్టి ప్రేమను బట్టి అనేకులు క్రీస్తుని వద్దకు ఆకర్షింపబడుదురు. ప్రభువు యొక్క నామము మహిమపరచబడును. యేసు సెలవిచ్చెను:   ‌‌ “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల, దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను”     (యోహాను. 13:35).

కొత్త నిబంధనయందు మనము నడవవలసిన ప్రవర్తన గూర్చి రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలను యేసు దయచేసెను. మొదటిది, మన యొక్క ప్రవర్తన అంతటియందును ప్రభువును ప్రేమింపవలెను. పూర్ణ హృదయముతోను, పూర్ణ ప్రాణముతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. రెండోవది, మనము మనలను ప్రేమించినట్లు పొరుగు వారిని కూడా ప్రేమింపవలెను. దేవుని బిడ్డలారా, అలాగున మీరు జీవించినట్లయితే, అట్టి ప్రేమగల ప్రవర్తనయందు ప్రభువు యొక్క మనస్సు అనందించును. లోకమునందు మీరు సాక్ష్యము గలవారై ఉందురు.

నేటి ధ్యానమునకై: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరును ఒకని కొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ”    (యోహాను. 15:12).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.